Top story :అమెరికా భయపడే ఇరాన్… విమానానికి పాక్ షెల్టర్… ఇరాన్‌తో చేతులు కలిపి అమెరికాకు వెన్నుపోటు..? పాకిస్థాన్ ‘డబుల్ గేమ్’, తాలిబాన్లతో చేతులు కలిపిందా..? కాబూల్‌లో ఏం జరిగింది..?

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోతుందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. పాకిస్థాన్ మళ్ళీ తన చిల్లర బుద్ధిని బయటపెట్టుకుంది. ఒకవైపు మధ్యవర్తిత్వం అని చెబుతూనే, మరోవైపు ఇరాన్ సైన్యానికి దొడ్డిదారిలో సాయం చేస్తోందా..?

Post Published By: dialnews
Updated : 13 May 2026, 1:15 PM IST

అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఆగిపోతుందని ప్రపంచమంతా ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. పాకిస్థాన్ మళ్ళీ తన చిల్లర బుద్ధిని బయటపెట్టుకుంది. ఒకవైపు మధ్యవర్తిత్వం అని చెబుతూనే, మరోవైపు ఇరాన్ సైన్యానికి దొడ్డిదారిలో సాయం చేస్తోందా..? యుద్ధం మొదలవ్వడానికి కొన్ని నిమిషాల ముందే కాబూల్ విమానాశ్రయంలో ఇరాన్ విమానం ఎందుకు దిగింది..? పాకిస్థాన్ ఆడుతున్న ఈ డేంజరస్ గేమ్ ఏంటి..? విషయం ఏంటంటే.. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని ప్రపంచం కోరుకుంటోంది. కానీ సరిగ్గా యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో, ఇరాన్‌కు చెందిన 'మహాన్ ఎయిర్' అనే పౌర విమానం ఆఫ్ఘనిస్థాన్‌లోని కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఇది మామూలు విమానం కాదు. దీనిపై అమెరికా ఎప్పటి నుంచో నిఘా పెట్టింది. సైనిక సామగ్రిని తరలించడానికి ఇరాన్ ఈ విమానాలను వాడుతుందని ఆరోపణలు ఉన్నాయి. యుద్ధం మొదలవ్వడానికి కొద్దిసేపటి ముందే ఇది అక్కడ దిగడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం కాబూల్ మాత్రమే కాదు, పాకిస్థాన్‌లోని రావల్పిండి సమీపంలో ఉన్న అత్యంత కీలకమైన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లోకి ఇరాన్ తన సైనిక విమానాలను తరలించినట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపిస్తున్నాయి. అమెరికా దాడుల నుండి కాపాడుకోవడానికి ఇరాన్ తన RC-130 రీకనైసెన్స్ విమానాలను పాకిస్థాన్ బేస్‌లో పార్క్ చేసిందని సమాచారం. మధ్యవర్తిగా నటిస్తున్న పాకిస్థాన్, శత్రు దేశానికి చెందిన యుద్ధ విమానాలకు ఆశ్రయం కల్పించడం అంటే అమెరికా వెన్నుపోటు పొడవడమేనని విశ్లేషకులు మండిపడుతున్నారు.యుద్ధం ప్రారంభానికి కొద్ది నిమిషాల ముందే మహాన్ ఎయిర్ విమానం కాబూల్‌లో దిగడం కాకతాళీయం కాదు.ఆఫ్ఘనిస్థాన్‌లోని తాలిబన్ల సహాయంతో ఇరాన్ తన కీలక ఆస్తులను మరియు అధికారులను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని, దీనికి పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలు వస్తున్నాయి.మహాన్ ఎయిర్‌ను గతంలోనే అమెరికా 'ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తోంది' అని బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. అలాంటి విమానాన్ని కాబూల్ ఎయిర్‌పోర్టులో దాచిపెట్టడం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అప్పుల కోసం ఒకవైపు అమెరికాను, మరోవైపు సౌదీ అరేబియాను ప్రసన్నం చేసుకోవాలని చూస్తోంది. ఈ యుద్ధంలో మధ్యవర్తిగా ఉంటే అమెరికా నుండి ఆర్థిక ప్యాకేజీలు దొరుకుతాయని, అదే సమయంలో ఇరాన్ లాంటి పొరుగు దేశంతో గొడవ లేకుండా ఉంటుందని పాక్ ప్లాన్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఈ 'డబుల్ గేమ్' బయటపడటంతో అమెరికా సెనేటర్లు పాకిస్థాన్‌కు ఇచ్చే నిధులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు.పాకిస్థాన్ ఎప్పుడూ ఇంతే.. పైన పటారం.. లోన లోటారం. అమెరికా దగ్గరకు వెళ్ళి 'మేము ఇరాన్‌తో మాట్లాడి యుద్ధం ఆపుతాం' అని మంచి వాళ్ళలా నటిస్తారు. కానీ లోపల మాత్రం ఇరాన్ సైన్యానికి దారి చూపిస్తారు. కీలక వైమానిక స్థావరాల దగ్గర ఇరాన్ విమానాలు ల్యాండ్ అవ్వడానికి పాకిస్థాన్ పరోక్షంగా సహకరించిందని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది. పాక్ అధికారులు ఈ వార్తలను ఖండిస్తున్నా, 'సీబీఎస్ న్యూస్' కు ఆఫ్ఘన్ అధికారులు ఇచ్చిన సమాచారం చూస్తుంటే.. పాకిస్థాన్ వేస్తున్నది ముమ్మాటికీ చిల్లర వేషాలే అని అర్థమవుతోంది.

పాకిస్థాన్ చేస్తున్న ఈ రెండు ముక్కల రాజకీయం అమెరికాకు తెలియంది కాదు. ఒకవేళ ఇరాన్ సైన్యానికి పాక్ నిజంగా సాయం చేస్తే.. అమెరికా ఇచ్చే ఆర్థిక సాయం మొత్తం కట్ అయిపోతుంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్, ఇరాన్ కోసం అమెరికాతో పెట్టుకుంటే.. ఆ దేశం నామరూపాలు లేకుండా పోవడం ఖాయం. మధ్యవర్తిత్వం పేరుతో డబుల్ గేమ్ ఆడటం పాకిస్థాన్‌కు అలవాటే కానీ, ఈసారి అది ఆ దేశం మెడకే చుట్టుకునేలా ఉంది.చూశారుగా.. పాకిస్థాన్ బుద్ధి ఎప్పటికీ మారదు. శాంతి కోసం ప్రయత్నిస్తున్నాం అని చెబుతూనే గోతులు తీయడంలో ఆ దేశం దిట్ట. మొన్నటి దాకా 'భారీ ఆర్థిక సాయం' కోసం అమెరికా కాళ్ళా వేళ్ళా పడ్డ పాకిస్థాన్, తీరా అవసరం తీరాక ఇలా గోతులు తీయడం ఆ దేశానికే చెల్లింది. ఒకవైపు శాంతి మంత్రం చదువుతూనే, మరోవైపు యుద్ధ విమానాలకు షెల్టర్ ఇవ్వడం అంటే.. మంటల్లో నెయ్యి పోయడమే.

Published : 
  • 13 May 2026, 1:15 PM IST