విజయ్ రోజుకో రికార్డు…!

సినిమా రంగంలో అగ్ర హీరోగా వెలుగొందుతూ, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'మోస్ట్ పాపులర్

Post Published By: dialnews
Updated : 14 May 2026, 11:50 AM IST

సినిమా రంగంలో అగ్ర హీరోగా వెలుగొందుతూ, ఇప్పుడు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తున్న తమిళ స్టార్ హీరో విజయ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ ఐఎండీబీ తాజాగా విడుదల చేసిన 'మోస్ట్ పాపులర్ ఇండియన్ సెలబ్రిటీల' జాబితాలో విజయ్ రెండో స్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.గత వారం వరకు ఇదే జాబితాలో 21వ స్థానంలో ఉన్న విజయ్, కేవలం ఏడు రోజుల్లోనే ఏకంగా 19 స్థానాలను అధిగమించి టాప్ 2కి చేరుకోవడం విశేషం. ఆయన పాపులారిటీ ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం.

ముఖ్యంగా తమిళనాడులో ఇటీవల వెలువడిన రాజకీయ పరిణామాలు, ఆయన నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలు ఈ క్రేజ్‌కు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.ఐఎండీబీ సంస్థ ఈ పాపులారిటీ ర్యాంకింగ్స్‌ను అత్యంత పారదర్శకంగా గణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 250 మిలియన్లకు పైగా వెబ్‌సైట్ సందర్శకుల రియల్ టైమ్ పేజీ వీక్షణల ఆధారంగా ఈ జాబితాను సిద్ధం చేస్తారు. అంటే, గడిచిన వారంలో నెటిజన్లు ఏ సెలబ్రిటీ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు, ఎవరి ప్రొఫైల్‌ను ఎక్కువగా వీక్షించారు అనే అంశాలే ఈ ర్యాంకులను నిర్ణయిస్తాయి.

సినిమా నటుడిగా విజయ్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఇప్పుడు ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించడం, ఆయన పార్టీ టీవీకే తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. వరుస హిట్లతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే కాకుండా, ఇప్పుడు ఐఎండీబీ వంటి అంతర్జాతీయ వేదికలపై అత్యంత ప్రభావవంతమైన సెలబ్రిటీగా విజయ్ నిలవడం ఆయన సత్తాకు నిదర్శనం. రాజకీయ ప్రయాణంలోనూ ఆయన ఇదే జోరును కొనసాగిస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Published : 
  • 14 May 2026, 11:50 AM IST