సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర లో మూడో వేవ్ స్టార్ట్ కాబోతోంది.. తన లైఫ్ లో ఒక్కో వేవ్ మొదలైన ప్రతీసారి, తన ఇమేజ్, మార్కెట్ అన్నీ రెండింతలు మూడింతలౌతూ వచ్చాయి.. మొదట్లో ప్రిన్స్ అనేవాళ్లు..తర్వాత సూపర్ స్టార్ అంటున్నారు. ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారే టైం దగ్గర పడుతోంది.నిజానికి 2005 నుంచే మహేశ్ బాబు అసలు సిసలైన సినీ జర్నీ మొదలైంది. అంతకుముందు వరకు ఒక ఎత్తు, 2005 లో అతడు వచ్చినప్పటి నుంచి మరో ఎత్తు... అక్కడ మొదలై పోకిరితో నెక్ట్స్ లెవల్ కి వెళ్లింది తన కెరీర్.. కట్ చేస్తే ఇలానే 2011 ఏడాది కూడా దూకుడుతో తన ఫేట్ మరో లా మారిపోయింది. ఇప్పుడు 2027 లో మరో సారి, అంటే మూడో సారి తన తలరాత మారే సూపర్ గ్లోబల్ వేవ్ రాబోతోందా?
సూపర్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ సూపర్ స్టార్ గా మారే టైం దగ్గర పడుతోంది. 2027 తన కెరీర్ లోనే వెరీ స్పెషల్ ఇయర్ గా మారబోతోంది. ఫస్ట్ టైం పాన్ ఇండియానే కాదు, పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ తో వరల్డ్ మార్కట్ మీద ఎటాక్ చేయబోతున్నాడు మహేశ్ బాబు. సో వారణాసి తన కెరీర్ గ్రాఫ్ ని డెఫినెట్ గా హాలీవు్డ రేంజ్ కి తీసుకెళుతుందనే అంచనాలున్నాయి.అయితే ఇక్కడే తన కెరీర్ గ్రాఫ్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా మారిందన్న అంశాలు, నెంబర్స్ సెంటిమెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. నిజానికి మహేశ్ బాబు రాజకుమారుడిగా అంటే ప్రిన్స్ గానే ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చాడు.. చైల్డ్ ఆర్టిస్ట్ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంటనే తనని అంతా ప్రిన్స్ అనటం మొదలుపెడితే, తనని మాత్రం మురారితోనే హిట్ పలకరించింది. ఒక్కడితో మాస్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది.
అంతవరకు మరీ కుర్రాడినే చూశారంతా.. అలాంటి తనలో అనూహ్యమైన మార్పుమొదలైంది పోకిరితోనే.. తన లుక్కే కాదు, తన పెర్ఫామెన్స్ కూడా ఆ మూవీనుంచే మారిపోయింది. ఇమేజ్ లెవల్స్ కూడా పీక్స్ చేరాయి. కట్ చేస్తే దీనికి ముందు అతడు కూడా మహేశ్ డైలాగ్ డెలివరిని మార్చేసి, తన ఫేట్ ని డిసైడ్ చేసిన మూవీగా వెలిగింది.ఈ రెండూ కూడా 2005, 2006 లో జరిగాయి... ఆతర్వాత 2011 లో దూకుడు వచ్చింది. తనతో కామెడీ టైమింగ్ మారింది. ఈజ్ ఉన్న నటుడిగా ఎలివేట్ అవుతూ సూపర్ స్టార్ ఇమేజ్ లోకి అడుగు పెట్టాడు. ఓరకంగా చెప్పాలంటే మహేశ్ బాబుకి ఎన్ని హిట్లు, బ్లాక్ బస్టర్స్ అయినా ఉండొచ్చు.. కాని తన ఫేట్ ని మార్చిన నెంబర్స్ అంటే, 2005, 2011 .. ఈ ఇయర్సే.
అప్పుడే అతడు, పోకిరి, దూకుడు లాంటి సినిమాలతో తన పెర్ఫామెన్స్, ఇమేజ్, సినిమా అప్రోచ్ అన్నీ మారిపోయాయి. ఆతర్వాత చాల హిట్లొచ్చినా, మరో ఊహించని మార్పంటే గుంటూరు కారంతోనే వచ్చింది. రిజల్ట్ ఫ్యాన్స్ కోరకున్నంత గొప్పగా లేకున్నా... పెర్ఫామెన్స్ తో మహేశ్ బాబు ఊహించని మార్పుచూపించాడు. ఆతర్వాతే వారణాసి రాబోతోంది.ఓరకంగా అతడు తర్వాత పోకిరి వచ్చి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసినట్టు, మళ్లీ ఇప్పుడు త్రివిక్రమ్ తో తీసిన గుంటూరు కారం తర్వాత మహేవ్ మరో ప్రయోగం రాబోతోంది. అదే వారణాసి... అందుకే సెంటిమెంటల్ గా కూడా ఇది మరోసారి సూపర్ స్టార్ ఫేట్ ని మార్చే టైం లైన్ అనంటున్నారు. అసలే రాజమౌలి డైరెక్షణ్ కాబట్టి, వారణాసి ఎలాచూసినా సూపర్ స్టార్ ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చే ప్రాజెక్టే. కాకపోతే, 2005, 2011 లో ఏం జరిగిందో దాంతో పోలిస్తే, ఇప్పుడు రెండు వేవ్స్ తర్వాత మూడో ఫేట్ ఛేంజింగ్ వేవ్ 2027లో వారణాసితోనే మొదలయ్యేలా ఉందనే నమ్మకం క్రియేట్ అవుతోంది.