సనాతన ధర్మంపై విషం.. స్టాలిన్‌కు బిగ్ షాక్… హిందుత్వ జోలికి రావొద్దని విజయ్ వార్నింగ్…చెత్త మాటలు ఆపు!

జోసెఫ్ విజయ్.. పక్కా క్రిస్టియన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా తాను తలచుకుంటే హిందువులపై విషం చిమ్మడం పెద్ద విషయం కాదు. కానీ, విజయ్ ఆ పని చేయలేదు. ఆ పని చేసిన వారినీ స్వాగతించలేదు.

Post Published By: dialnews
Updated : 14 May 2026, 2:30 PM IST

జోసెఫ్ విజయ్.. పక్కా క్రిస్టియన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా తాను తలచుకుంటే హిందువులపై విషం చిమ్మడం పెద్ద విషయం కాదు. కానీ, విజయ్ ఆ పని చేయలేదు. ఆ పని చేసిన వారినీ స్వాగతించలేదు. అసెంబ్లీ సాక్షిగా సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని స్టాలిన్ కారుకూతలు కూస్తే.. తనకు అందరూ సమానమే చెత్త సలహాలు తీసుకోను అంటూ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు విజయ్. అంతేకాదు, తన ప్రభుత్వంలో హిందువులకు కీలక బాధ్యతలు అప్పగించి ద్రవిడ వాద డీఎంకేక దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. సనాతన ధర్మం ప్రజలను విభజిస్తుందట. కాబట్టి సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే అన్నాడు. ఇటీవల జరిగిన నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తమిళ రాష్ట్ర గీతాన్ని మొదటగా పాడలేదు. వరుసగా వందేమాతరం, జనగణమన, తమిళ్ తాయ్ వాల్తు పాడారు. దీనిపై ఉదయనిధి అభ్యంతరం వ్యక్తం చేశాడు. 'మీ ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవంలో జరిగిన ఇలాంటి పొరపాటు మళ్లీ జరగడానికి అనుమతించకూడదని విజయ్‌కు సూచించాడు. తామయితే అస్సలు అనుమతించేది లేదన్నాడు.

అసెంబ్లీలోనే కాదు, తమిళనాడులో జరిగే ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనైనా తమిళ్​ తాయ్ వాల్తుకే ఎప్పుడూ ప్రథమ స్థానం ఇవ్వాలన్నాడు. రాష్ట్ర గీతాన్ని కాదని, ముందుగా జాతీయ గేయం, గీతం పాడడం వల్ల ప్రజల్లో తీవ్ర దిగ్భ్రాంతి, ఆగ్రహం వ్యక్తమయ్యాయని చెప్పాడు. అప్పుడే సనాతన ధర్మంపై నోటికొచ్చింది పేలాడు. దీనికి బీజేపీ అదే స్థాయిలో బదులిచ్చింది.సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ మళ్లీ దాడిచేయడాన్ని బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అతను, మరికొన్ని ఇతర పార్టీలు సనాతన ధర్మంపై ద్వేషం వెల్లగక్కుతున్నారని విమర్శించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్​ పూనావాలా.. గతంలో ఉదయనిధి చేసిన ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు ద్వేషపూరిత ప్రసంగాలుగా పేర్కొందని గుర్తు చేశారు. అయితే తమిళనాడు అప్పటి సీఎం ఎంకే స్టాలిన్​ తన కుమారుడిపై చర్యలు తీసుకోకపోగా, అతనికి డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టారని ఎద్దేవా చేశారు.

చివరికి కాంగ్రెస్ కూడా ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించలేదన్నారు. ఈ వివాదంలో సీఎం విజయ్‌పైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, స్టాలిన్ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అన్నప్పుడు విజయ్ అతడి ముందే ఉన్నారు. ఆ తర్వాత కూడా స్టాలిన్ వ్యాఖ్యలను ఖండించే ప్రయత్నం చేయలేదు. ఈ తీరే విమర్శలకు దారి తీసింది. ఐతే, విజయ్ పరోక్షంగా ఈ వివాదంపై రియాక్ట్ అయ్యారు. ఇక్కడ అందరూ సమానమే. ఒక్క ఎమ్మెల్యే ప్రాతినిధ్యం మాత్రమే ఉన్న పార్టీకి కూడా ఈ సభలో టీవీకే సభ్యులకు దక్కిన ప్రాధాన్యం దక్కుతుంది. మంచి సలహాలు స్వీకరిస్తాం. మిగతా వాటిని పట్టించుకోం అన్నారు.విజయ్ క్రిస్టియన్ అయినప్పటికీ.. ఆయనకు ఇతర మతాల పట్ల ద్వేషం లేదనే సంకేతాలు ఇస్తున్నారు. అందరికీ సమాన ప్రాధాన్యం ఇవ్వాలనేదే తన అభిమతంగా చెబుతున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ద్రవిడ పార్టీలు బ్రాహ్మణుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినప్పటికీ..

విజయ్ తన పార్టీ తరఫున ఇద్దరు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటున్నారు టీవీకే నేతలు. అంతే కాదు మైలాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పి.వెంకటరమణన్‌కు ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు విజయ్. సనాతన ధర్మాన్ని రూపుమాపాలని ఉదయనిధి అసెంబ్లీలో మాట్లాడిన కొద్ది సేపటికే.. సీఎం విజయ్ ఓఎస్డీగా ఓ జ్యోతిషుడిని నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాల ద్వారా తాను అందరివాడినని విజయ్ చాటుకునే ప్రయత్నం చేశారు. ఓ వర్గాన్ని గుడ్డిగా ద్వేషించే తత్వం తనది కాదని చెప్పకనే చెప్పారంటున్నారు. రాజకీయ కుటుంబంలో పుట్టి, చిన్నప్పటి నుంచి రాజకీయాలను దగ్గర్నుంచి చూస్తూ పెరిగిన ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ వాదం పేరిట సనాతన ధర్మంపై అక్కసు వెళ్లగక్కుతుంటే.. ఏ రాజకీయ నేపథ్యం లేని విజయ్ మాత్రం ఎంతో పరిణతితో వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు అనగానే ద్రవిడ రాజకీయాలే గుర్తుకొస్తాయి. అక్కడ ద్రవిడ వాదంతోపాటు బ్రాహ్మణ వ్యతిరేకత సైతం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. డీఎంకే నుంచి ఇప్పటి దాకా ఒక బ్రాహ్మణుడు కూడా మంత్రి కాలేదంటే.. అక్కడ బ్రాహ్మణేతర వాదం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అఫ్‌కోర్స్ 20వ శతాబ్దం ఆరంభంలో మద్రాస్ ప్రెసిడెన్సీలోని మెజార్టీ ఉద్యోగాలు బ్రాహ్మణులతో నిండిపోయి ఉండేవి. దీన్ని సహించలేకే జస్టిస్ట్ పార్టీ, తర్వాత ద్రవిడ వాదం పురుడు పోసుకున్నాయి. ఈ క్రమంలోనే డీఎంకే, అన్నాడీఎంకే ఏర్పాటై.. దశాబ్దాలపాటు తమిళనాడును ఏలాయి. ఈ రెండు పార్టీల వైఖరితో విసిగిపోయిన తమిళ ప్రజలు.. విజయ్ ఏర్పాటు చేసిన టీవీకేకు పట్టం కట్టారు. ఇటీవలే తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టిన విజయ్.. తనదైన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

 

Published : 
  • 14 May 2026, 2:30 PM IST