Top story:విజయ్ ఇంట్లో త్రిష మకాం..? విజయ్ ప్రభుత్వంలో లేడీ సజ్జల..? తమిళ పాలిటిక్స్‌లో ‘సైలెంట్ ఎంట్రీ’.. మేడం పర్మీషన్ కోసం లీడర్ల క్యూ…?

తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ పగ్గాలు చేపట్టడమే ఆలస్యం.. అటు పార్టీ వ్యవహారాల్లో, ఇటు ప్రభుత్వ నిర్ణయాల్లో ఒక స్టార్ హీరోయిన్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

Post Published By: dialnews
Updated : 16 May 2026, 1:56 PM IST

తమిళనాడు రాజకీయాల్లో ఎవరూ ఊహించని ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రిగా దళపతి విజయ్ పగ్గాలు చేపట్టడమే ఆలస్యం.. అటు పార్టీ వ్యవహారాల్లో, ఇటు ప్రభుత్వ నిర్ణయాల్లో ఒక స్టార్ హీరోయిన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆమే.. సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్.. తాజా తమిళ పొలిటికల్ వర్గాల సమాచారం ప్రకారం, త్రిష తన మకాంను పూర్తిగా విజయ్ నివాసానికి మార్చేసినట్లు, అక్కడి నుంచే తమిళగ వెట్రి కజగం పార్టీకి సంబంధించిన కీలక చర్చలు నడుస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు విజయ్ ఇంట్లో త్రిష ఏం చేస్తోంది..? పార్టీలో ఆమెకు దక్కబోయే ఆ పవర్‌ఫుల్ పదవి ఏంటి..? కొన్ని రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో, టీవీకే పార్టీ భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్న వేళ.. అందరి కళ్ళు చెన్నైలోని విజయ్ నివాసంపైనే పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని వచ్చిన త్రిష, కట్టుదిట్టమైన భద్రత నడుమ నేరుగా విజయ్ ఇంటికి చేరుకుంది. గంటల తరబడి ఆమె అక్కడే గడిపింది, బయటకు వస్తూ మీడియాకు థంబ్స్ అప్ చూపిస్తూ విక్టరీ సిగ్నల్ ఇచ్చింది. అప్పటి నుంచే పొలిటికల్ లీకులు మొదలయ్యాయి.

కేవలం అభినందనలు చెప్పడానికే త్రిష అంత సమయం కేటాయించిందా..? లేక భవిష్యత్తు రాజకీయ వ్యూహాల కోసం తన బేస్‌ను విజయ్ ఇంటికి షిఫ్ట్ చేసిందా..? అనే చర్చకు తెరలేచింది. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ.. నెహ్రూ స్టేడియంలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార ఉత్సవంలో త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రంట్ రోలో కూర్చుని, విజయ్ వేదికపై స్పీచ్ ఇస్తున్నంత సేపూ ఆమె కళ్ళు ఆనందభాష్పాలతో నిండిపోయాయి. అంతటితో ఆగకుండా, విజయ్ తల్లిని ఆమె ఆలింగనం చేసుకున్న విజువల్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి.ఆ తర్వాత సోషల్ మీడియాలో "The love is always louder" అంటూ త్రిష పెట్టిన పోస్ట్, బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టిన రొమాంటిక్ సాంగ్.. వీరిద్దరి మధ్య కేవలం స్నేహం మాత్రమే కాదు, ఒక బలమైన పొలిటికల్ అండ్ పర్సనల్ బాండింగ్ ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ మీడియా లోపల జరుగుతున్న ప్రచారం ప్రకారం.. త్రిష కేవలం విజయ్ వెనుక ఉండే సపోర్టర్ కాదు, ఆమె డైరెక్ట్ పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాబోతోంది.

విజయ్ ఖాళీ చేయబోయే తిరుచ్చిరాపల్లి ఈస్ట్ యోజకవర్గం నుండి రాబోయే ఉపఎన్నికల్లో టీవీకే అభ్యర్థిగా త్రిషను బరిలోకి దించేందుకు పార్టీ హైకమాండ్ గట్టిగా ప్లాన్ చేస్తోందట.గతంలో ఒక ఇంటర్వ్యూలో "నాకు రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు సీఎం అవ్వాలని ఉంది" అని త్రిష చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. పార్టీ అంతర్గత వ్యవహారాలు, ప్రభుత్వ పాలసీల విషయంలో త్రిష ఒక సైలెంట్ గైడ్‌లా, విజయ్‌కు అత్యంత నమ్మకస్తురాలైన సలహాదారుగా వ్యవహరిస్తోందని టాక్. వెండితెరపై 'గిల్లి', 'కురువి', 'లియో' చిత్రాలతో బ్లాక్‌బస్టర్ జోడీగా నిలిచిన విజయ్-త్రిష.. ఇప్పుడు తమిళనాడు రాజకీయ వేదికపై అంతకంటే పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ కొట్టేందుకు సిద్ధమయ్యారు.విజయ్ ఇంటి నుంచే త్రిష పొలిటికల్ కెరీర్ రీ-స్టార్ట్ కాబోతుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. మరి విజయ్ పార్టీలో త్రిష ఎంట్రీ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు..? ఆమె పాలిటిక్స్‌లో సక్సెస్ అవుతుందా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్.. మరి త్రిషను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.

Published : 
  • 16 May 2026, 1:56 PM IST