Top story: నువ్వు మింగేయ్.. నేతన్యాహుకు ట్రంప్ షాక్… యూఏఈ, సౌదీ రాజుల కాళ్ళు పట్టుకుంటున్న ట్రంప్… ఇరాన్ యుద్ధంలో ట్రంప్ యూ-టర్న్… చైనా టూర్ తర్వాత, ట్రంప్ రివర్స్ ప్లాన్…!

ఇరాన్‌ను ప్రపంచ పటం నుండి తుడిచేస్తాం అంటూ కొద్దిరోజుల క్రితం వరకు గర్జించిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు హఠాత్తుగా శాంతి మంత్రం ఎందుకు జపిస్తున్నారు..? కొన్ని రోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఇరాన్ యుద్ధం రెండు నెలలు దాటినా

Post Published By: dialnews
Updated : 21 May 2026, 11:32 AM IST

ఇరాన్‌ను ప్రపంచ పటం నుండి తుడిచేస్తాం అంటూ కొద్దిరోజుల క్రితం వరకు గర్జించిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు హఠాత్తుగా శాంతి మంత్రం ఎందుకు జపిస్తున్నారు..? కొన్ని రోజుల్లోనే ముగుస్తుందనుకున్న ఇరాన్ యుద్ధం రెండు నెలలు దాటినా తేలకపోవడంతో వాషింగ్టన్‌లో అసలు ఏం జరుగుతోంది..? యుద్ధం నుండి గౌరవప్రదంగా బయటపడటానికి ట్రంప్.. తన మిత్రదేశాలైన సౌదీ, యూఏఈ, పాకిస్తాన్‌లతో పాటు పరమశత్రువు చైనా సహాయం కూడా ఎందుకు కోరారు..? ట్రంప్ మైండ్‌లో ఉన్న ఆ సీక్రెట్ 'ఎగ్జిట్ స్ట్రాటజీ' ఏంటో న్యూయార్క్ టైమ్స్ నివేదికల ఆధారంగా తెలుసుకుందాం.ఇరాన్ సంక్షోభం ముదురుతున్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ చైనా రాజధాని బీజింగ్ వెళ్లి అక్కడి అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో అత్యంత కీలక చర్చలు జరిపారు. చైనా నుండి తిరిగి వచ్చిన వెంటనే ట్రంప్ ఒక ఊహించని యూ-టర్న్ తీసుకున్నారు. ఇరాన్‌పై జరగాల్సిన భారీ సైనిక దాడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దానికి కారణం.. ఇరాన్ నుండి ఒక శాంతి ప్రతిపాదన వచ్చిందని ట్రంప్ చెప్పారు. కతార్, సౌదీ అరేబియా, మరియు యూఏఈ లీడర్లు తనకు ఫోన్ చేసి దాడిని కాసేపు ఆపమని కోరారని, అమెరికాకు అలాగే మిడిల్ ఈస్ట్‌కు ఆమోదయోగ్యమైన ఒక పెద్ద డీల్ కుదరబోతోందని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' పోస్ట్‌లో సంచలన ప్రకటన చేశారు.

ట్రంప్ అంతలా ప్రకటనలు చేస్తుంటే.. ఇరాన్ మాత్రం దీనికి పూర్తిగా రివర్స్ రియాక్షన్ ఇచ్చింది. తాము ఎలాంటి శాంతి ప్రతిపాదనలు అమెరికాకు పంపలేదని టెహ్రాన్ స్పష్టం చేసింది. అంతేకాదు, అమెరికా మరియు దాని కూటమి దేశాలు మరోసారి వ్యూహాత్మక తప్పులు చేయవద్దని హెచ్చరించింది. ఇరాన్ యొక్క టాప్ మిలిటరీ కమాండర్ అలీ అబ్దుల్లాహి మాట్లాడుతూ.. 'మా సైన్యం గతంలో కంటే ఇప్పుడు మరింత బలంగా, సర్వసన్నద్ధంగా ఉంది. అమెరికా గనుక మళ్ళీ దురాక్రమణకు దిగితే మా సమాధానం అత్యంత వేగంగా, శక్తివంతంగా మరియు ఊహించని స్థాయిలో ఉంటుంది' అని ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు. అంటే ట్రంప్ ఆశించినట్లు ఇరాన్ అంత సులువుగా లొంగిపోవడానికి సిద్ధంగా లేదని తేలిపోయింది.ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే.. ఎప్పుడూ దూకుడుగా ఉండే ట్రంప్, ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నారు..? విశ్లేషకుల ప్రకారం.. ట్రంప్ ఒక పెద్ద ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ యుద్ధం కేవలం 'కొన్ని రోజుల్లోనే' ముగిసిపోతుందని, అమెరికాకు 'స్విఫ్ట్ విక్టరీ' దక్కుతుందని ఆయన అంచనా వేశారు. కానీ రెండు నెలలు గడుస్తున్నా ఇరాన్ పట్టు వదలడం లేదు. దీనివల్ల అమెరికాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. అన్నిటికంటే ముఖ్యంగా.. ట్రంప్‌ను గెలిపించిన ఆయన సొంత 'MAGA' గ్రూపుల నుండే తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

'మనకెందుకు ఈ పరాయి దేశాల యుద్ధాలు..? మన ఆర్థిక వ్యవస్థను నాశనం చేసుకుంటున్నాం' అని సొంత మద్దతుదారులే ప్రశ్నిస్తుండటంతో ట్రంప్‌పై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. డోనాల్డ్ ట్రంప్ తన శాంతి చర్చల వ్యూహంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును పక్కనపెట్టి, చైనా మరియు అరబ్ దేశాల నాయకులతో నేరుగా చర్చలు జరుపుతున్నట్లు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇరాన్ విషయంలో నెతన్యాహు దూకుడు వైఖరిని నియంత్రిస్తూ, తన రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాన్ని ముగించి ఒక 'డీల్' కుదుర్చుకోవాలనేది ట్రంప్ ప్రధాన ఉద్దేశంగా ఉంది.యుద్ధం నుండి తన గౌరవానికి భంగం కలగకుండా బయటపడటానికి ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇరాన్‌కు భారీ ఆఫర్లను ఇస్తోంది. గతంలో 'విజయం' అనే పదం వాడిన ట్రంప్, ఇప్పుడు 'ఒప్పందం' వైపు మొగ్గు చూపుతున్నారు.

ఇరాన్‌కు సంబంధించి స్తంభింపజేసిన పదుల బిలియన్ల డాలర్ల నిధులలో నాల్గవ వంతు విడుదల చేయడానికి అమెరికా అంగీకరించిందని అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అలాగే, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలో ఇరాన్ కొన్ని శాంతియుత అణు కార్యక్రమాలను కొనసాగించడానికి కూడా అమెరికా సుముఖత వ్యక్తం చేసింది.చర్చలు జరుగుతున్నంత కాలం ఇరాన్‌పై చమురు ఆంక్షలను కూడా ఎత్తివేయడానికి ఒప్పుకుంది. అయితే ఇదే సమయంలో అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. 'ఒకవేళ చర్చలు విఫలమైతే అమెరికా దాడులకు పూర్తిగా సిద్ధంగా ఉంది' అని ఇరాన్‌ను హెచ్చరించడం గమనార్హం. యుద్ధం ప్రకటించడం సులువే.. కానీ దానిని ముగించడం ఎంత కష్టమో డోనాల్డ్ ట్రంప్‌కు ఈ ఇరాన్ సంక్షోభం అర్థమయ్యేలా చేసింది. మరి అమెరికా ఇస్తున్న ఈ భారీ ఆఫర్లకు ఇరాన్ లొంగుతుందా..? లేదా మిడిల్ ఈస్ట్‌లో యుద్ధ జ్వాలలు మరింత తీవ్రం అవుతాయా..? చైనా జోక్యంతో ఈ యుద్ధానికి ముగింపు పడుతుందా..? అనేది చూడాలి.

Published : 
  • 21 May 2026, 11:32 AM IST