FIRST ఇండియన్ మూవీ.. 45K థియేటర్స్ లో…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీస్టరీలోనే కాదు, హాలీవుడ్ హిస్టరీలో, వరల్డ్ సినిమా హిస్టరీలో కూడా నిలిచపోబోతోంది. అంతటికీ కారనం 45 వేల థియేటర్ల రికార్డు.

Post Published By: dialnews
Updated : 25 May 2026, 6:10 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న డ్రాగన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీస్టరీలోనే కాదు, హాలీవుడ్ హిస్టరీలో, వరల్డ్ సినిమా హిస్టరీలో కూడా నిలిచపోబోతోంది. అంతటికీ కారనం 45 వేల థియేటర్ల రికార్డు.. అటువైపుగానే డ్రాగన్ అడుగులు పడుతున్నాయి. ఒక ఇండియన్ సినిమా ఇంతవరకు యూఎన్, యూరప్ లో 14 వేలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది లేదు. ఇక ఆమిర్ ఖాన్ మూవీలు కూడా ఆడనంతగా, చైనాలో డ్రాగన్ ఏకంగా 17 వేలథియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా ఉంది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా డ్రాగన్ రిలీజ్ కాబోయే థియేటర్ల సంఖ్య ప్రస్తుతానికి 45 వేలని తెలుస్తోంది. ఈ నెంబర్ రిలీజ్ టైం వచ్చేసరికి పెరొగొచ్చు... ఆల్రెడీ వారణాసి 55 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే ఫస్ట్ ఇండియన్ మూవీ అన్నారు. ఇప్పుడు దీంతో పోలిస్తే పదివేల థియేటర్స్ తగ్గినా, ఈ నెంబర్స్ ని హాలీవుడ్ మూవీలు కూడా టచ్ చేయలేదు. కాబట్టే డ్రాగన్ రికార్డు హిస్టరీలో వినిపిస్తోంది.. అంటే వచ్చే ఏడాది బిగినింగ్ లో గా థియేటర్స్ సంఖ్య మరింత పెంచి, వారణాసితో డ్రాగన్ పోటీ పడుతుందా?

డ్రాగన్ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతోందంనటానికి 45 వేల థియటేర్ల సంఖ్యే బెస్ట్ ఎగ్జాంపుల్. ఈవిషయంలో ప్రశాంత్ నీల్ అచ్చుగుద్దినట్టు రాజమౌళి దారిలోనే నడుస్తున్నాడు. వారణాసి మూవీని 55 వేల థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారని, ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఆ స్థాయిలో రాజమౌళీ వారనాసిని, 120దేశాల్లో 100 కోట్ల మందకి రీచ్ అయ్యేలా 30భాషల్లో విడుదల చేస్తున్నాడు.ఐతే డ్రాగన్ మాత్రం 6 భాషల్లో వస్తుందా? 16 భాషల్లో రిలీజ్ అవుతుందా అనేది, ఫైనల్ షూటింగ్ అయ్యాకే తెలిసే ఛాన్స్ఉంది.కాని ఈలోపుమాత్రం వరల్డ్ వైడ్ గా 45 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసేలా, థియేటర్స్ చైన్స్, బిజ్ జాయాంట్స్ తో డీల్ ఓకే అయినట్టు తెలుస్తోంది. ఇంకా ఈ థియేటర్స్ సంఖ్య రాను రాను, పెరొగొచ్చని తెలుస్తోంది.

ముందు ఇండియా విషయానికొస్తే, మన దేశంలో 8 వేల థియటేర్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కేవలం చైనాలో 17వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ సినిమాగా, తొలి వరల్డ్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేయబోతోంది. ఇక యూఎస్, యూరప్ రెండు ప్రాంతాలలో డ్రాగన్ ఏకంగా 14 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా డీల్ కన్పామ్ అయ్యిందని తెలుస్తోంది.ఇక జపాన్, కొరియా, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఇలా రెస్టాఫ్ వరల్డ్ లో 6 వేల థియేటర్స్ లో డ్రాగన్ గర్జించబోతోంది. మొత్తంగా హాలీవుడ్ మూవీలు కూడా 20 వేల నుంచి 25 వేల థియేటర్స్ ని మించలేదు.

అలాంటిది, డ్రాగన్ వరల్ద్ వైడ్ గా 45 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోయే సినిమాగా రికార్డు క్రియేట్ చేయబోతోంది. వారణాసి 55 వేల థియటేర్స్ తో పోలిస్తే, ఈ సంఖ్య పదివేలు తక్కువే.కాని వచ్చే ఏడాది జూన్ వచ్చేలోగా 45 వేల థియేటర్స్ కాస్త, 55 వేల థియేటర్స్ గా కూడా మారొచ్చు. ఈవిషయంలో రాజమౌళి టీం కూడా ప్రశాంత్ నీల్ టీంకి ఫుల్ సపోర్ట్ చేస్తోంది. అందుకే వరల్డ్ మార్కెట్ లో ఏప్రిల్ లో వారణాసి, జూన్ లో డ్రాగన్ ఇలా రెండు సినిమాలు, పాన్ వరల్డ్ మార్కెట్ బెండు తీసేలా ఉన్నాయి. ఏమైనా టైం కలిసొస్తే, వారణాసి ఊపుచూసి, మన సినిమాలకు వరల్డ్ వైడ్ గా డిమాండ్ పెరిగితే, డ్రాగన్ థియేటర్ల సంఖ్యం 55 వేలు కూడా దాటొచ్చు.. ఈవిషయంలో వారనాసికే కాదు, డ్రాగన్ కి కూడా ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్సే సపోర్ట్ చేస్తోందని తెలుస్తోంది.

Published : 
  • 25 May 2026, 6:10 PM IST