అతడు ఒక్కడు కాదు.. ముగ్గురు మొనగాళ్లు…!

వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. ఒక్కసారి, తన ఫ్యాన్స్ ఇప్పటికిప్పుడు వారణాసిని థియేటర్స్ లో చూస్తున్నట్టు ఊహిస్తే... ఒకే తెరమీద సూపర్ స్టార్ మహేశ్ బాబు, మరో మహేశ్ బాబుని కలిస్తే ఎలా ఉంటుంది

Post Published By: dialnews
Updated : 29 May 2026, 7:50 PM IST

వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కాబోతోంది. ఒక్కసారి, తన ఫ్యాన్స్ ఇప్పటికిప్పుడు వారణాసిని థియేటర్స్ లో చూస్తున్నట్టు ఊహిస్తే... ఒకే తెరమీద సూపర్ స్టార్ మహేశ్ బాబు, మరో మహేశ్ బాబుని కలిస్తే ఎలా ఉంటుంది... ఎప్పుడో నాని మూవీలో.. అది కూడా, క్లైమాక్స్ లోనే ఇద్దరు మహేశ్ బాబులు కనిపించారు. కాని ఇక్కడ అలా కాదు.. రుద్రుడు రాముడిని కలిసే సీన్ ఎలా ఉంటుది? శివుడిలో తనని తాను చూసుకుంటే ఇంకెలా ఉంటుంది.. కాస్త ఊహిస్తేనే రోమాలు నిక్కబొడుస్తాయి.. అలాంటిది పాన్ వరల్డ్ లాంటి ప్రాజెక్ట్ లో ఇది జరగబోతోందంటే, ఇంకెలా ఉంటుంది...అయితే ఆ సీన్లే అలా వచ్చి ఇలా వెల్లే సీన్లు కాదని తెలుస్తోంది. ఈప్రాజెక్టుకి ప్రాణం లాంటి సీన్లలో అది కూడా లెంథీ సీన్లలో ఇలాంటి మ్యాజిక్ జరగబోతోంది? అందుకే ఆ నమ్మకంతోనే, ఇది వరల్డ్ ఆడియన్స్ ని మైండ్ బ్లాక్ చేసే మూవీ అని జక్కన్న భావిస్తున్నాడా? అందుకే అంత కాఫ్ఫిడెంట్ గా ఐదు సిన్ల కోసం,  700 కోట్లకు పైనే ఖర్చేచేస్తున్నాడా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు తనని తాను ఫేస్ చేస్తే ఎలా ఉంటుందో నాని మూవీలో చూశాం. అందులో కేవలం క్లైమాక్స్ లోనే సీనియర్ మహేశ్ బాబుని, జూనియర్ మహేశ్ బాబు అంటే తండ్రి కొడుకుల సీన్ అలా కనిపించి ఇలా మాయమౌతుంది. అది వదిలేస్తే, మహేశ్ బాబు డ్యూయెల్ రోల్ వేసిన సినిమానే కనిపించదు. అలాంటి టైంలో ఒకటికాదు, రెండు కాదు, మూడు పాత్రల్లో మహేశ్ ని చూపిస్తున్నాడు రాజమౌళి.వారణాసిలో రుద్రుడిగా, శివుడిగా, రాముడిగా మహేశ్ బాబు కనిపిస్తాడనే క్లారిటీ రాజమౌళి ఇచ్చేశాడు. ఐతే ఇక్కడ క్లారిటీ రావల్సింది ఏంటంటే, మహేశ్ బాబు తనలా ఉండే మరో పాత్రని ఎలా ఫేస్ చేస్తాడు? అది కూడా మామూలు పాత్రలు కాదు.. ఒకటి లార్డ్ రామా.. మరొకటి లార్డ్ శివ.. ఈ ఇద్దరు దేవుళ్లని మామూలు మనిషి పాత్రలో మహేశ్ బాబు ఎలా ఫేస్ చేస్తాడు?

ఒక్కసారి ఊహించుకోండి ఇక్కడమనిషి మహేశ్ బాబునే, అక్కడ దేవుడి పాత్ర అంటే రాముడు, శివుడుపాత్రలో కనిపించేది మహేశ్ బాబునే.. ఇలా తనని తానే కలుసుకోవటం అన్నది నిజంగా ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెచ్చే అంశం.. మామూలుగా రాజమౌలి తన హీరోలనే సూపర్ హీరోల్లా చూపిస్తాడు.. అలాంటిది దేవుల్లని ఇంకెలా చూపిస్తాడు..?త్రిబుల్ ఆర్ లో కాసేపే రామ్ చరణ్ రాముడేనా అనిపించేలా ఒక్క సీన్ లో చూపిస్తే, నార్త్ ఇండియా షేక్ అయ్యింది. సో అలాంటిది రాముడిగా, శివుడిగా మహేశ్ బాబుని రాజమౌళి తన స్టైల్లో చూపిస్తే, నార్త్ ఇండియాలో వసూళ్ల వరదలు, సినిమా సునీమీలొస్తాయి. వీటికితోడు, ఒక మహేశ్ బాబు, మరో మహేశ్ బాబుని కలవటం ఇంకెంత సర్ ప్రైజింగ్ గా ఉంటుంది.కాలంలో సూపర్ స్టార్ ప్రయాణించి, ఇలా దేవుళ్లనే కలవటం అన్న సీన్ ఫైట్లతో నింపేస్తే ఇంకెలా ఉంటుంది.. ఇవన్నీ మైండ్ బెండ్ చేసే మిక్సింగ్ ఎమోషన్స్ ... కాబట్టే వారణాసి వరల్డ్ ఆడియన్స్ ని ఎంతగా థ్రిల్ చేస్తుందో, అంతకు వెయ్యిరెట్లు ఇండియన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది.

Published : 
  • 29 May 2026, 7:50 PM IST