ముప్పైరోజులు గ్యాప్ లేకుండా ఒకే సీన్ కోసం వారణాసి టీం, రిస్కీ సాహసానికి రెడీ అయ్యింది. 28 నిమిషాల సీన్ కోసం ముప్పైరోజులు చాలా పెద్ద యుద్దమే చేయబోతోంది మహేశ్ బాబు, రాజమౌళి టీం. విచిత్రం ఏంటంటే వారణాసి మూవీలో ఐదంటే ఐదు సీన్లే ఈ మూవీలో 50శాతం డ్యూరేషన్ ని కవర్ చేయబోతున్నాయి. ఒకటి 25 నిమిషాలు, ఇంకొకటి 28 నిమిషాలు, మరొకటి 22 నిమిషాలు..అసలు షూటింగ్ పూర్తికాకముందే, ఇలా ఎలా డ్యూరేషన్ డిసైడ్ అవుతుందనే డౌట్ రావటం కామన్. కాని అక్కడే ఏఐ లాజిక్ మ్యాజిక్ చేస్తోంది. ఎంటైర్ వారణాసి మూవీని ఏఐలో ఎప్పుడో తీసేసింది రాజమౌళి టీం. అంతా రెఫరెన్స్ కోసమే... అలా తీసిన సీన్ల ప్రకారమే ఐదు సీన్లు 105 నిమిషాలు ఉంటాయని తేలిందా? ఇంట్రో, ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఇలా ఐదు సీన్లుతో వారనాసి ఒక్క మూవీనే ఐదు బాహుబలిలతో సమానం అనిపించేలా మారిందా?
: సూపర్ స్టార్ మహేశ్ బాబు, 28 నిమిషాల భారీ ఫైట్ సీన్ కోసం 30 రోజుల లాంగ్ షెడ్యూల్ కి రెడీ అయ్యాడు. వారణాసి మూవీలోని ప్రీక్లైమాక్స్ సీన్ కోసమే 30 రోజులు గ్యాప్ లేకుండా భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు రాజమౌళి. అదే ఇప్పుడు మొదలౌతోంది. నిజానికి ఇలాంటి సీన్లు మొత్తం వారణాసి సినమాలో ఐదున్నట్టు తెలుస్తోంది.80శాతం షూటింగ్ మాత్రమే పూర్తైంది కాబట్టి, అప్పుడే ఈ సినిమాలో ఏ సీన్ ఎంత సేపు వస్తుందో చెప్పటం ఎవరికి కూడా సాధ్యం కాదు. కాని ఇంత అక్యూరేట్ గా వారణాసి లో ఐదు సీన్లున్నాయి. వాటిలో ఒక్కో సీన్ 20నిమిషాల పైనే అని బయటికి ఫీలర్స్ రావటానికి రియలిస్టిక్ రీజనే ఉంది. అదే షాక్ ఇస్తూనే కిక్ ఇస్తోంది. అదేంటంటే ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్.ఔను ఏఐ సాయంతో వారణాసి మూవీని షూటింగ్ మొదలవ్వటానికి ముందే తీశారు. దానికోసం 5 కోట్ల వరకు ఖర్చైందట.. అంటే ఏఐలో ఈసినిమాను రిలీజ్చేయటానికి కాకుండా, కేవలం రెఫరెన్స్ కోసమే.. సెట్లు, కాస్ట్యూమ్స్, లొకేషన్లు, ఇవన్నీ ముందుగా ఏఐలో డిజైన్ చేయటం, మొత్తం మూవీని ముందుగానే ఏఐలో తీస్తే, అసలు షూటింగ్ కి, ఫైనల్ కట్ కి , గ్రాఫిక్స్ వర్క్ కి ఇలా చాలా విషయాల్లో సమస్యలను ముందే ఊహించొచ్చు.
వాటిని షూటింగ్ కి బిఫోరే సెట్ రైట్ చేయొచ్చు.. అలా షూటింగ్ టైం కూడా సేవ్ అవుతుంది. అందుకే ఈ మధ్య పెద్ద సినిమాలు తీసే ఏదర్శక నిర్మాతలైనా,ముందు టెస్ట్ షూటింగ్ లానే, ఏఐ సాయంతో ముందే కంప్యూటర్ లోసినిమా తీసేస్తున్నారు. దాని ఆధారంగా అసలు షూటింగ్ మొదలుపెడుతున్నారు. సో అలా ఏఐ లో ముందే తీసిన వారణాసి వల్లే, ఏ సీన్ డ్యూరేషన్ ఎంతుంటుందో అటు ఇటుగా ఓ అంచనాకి రాగలుగుతున్నారు.అలాచూస్తే వారణాసి ప్రీక్లైమాక్స్ సీన్ 28 నిమిషాలు రావొచ్చు... అలాంటీ లెంథీ ఫైట్ సీన్ ని 30రోజులు ప్లాన్ చేసి గ్యాప్ లేకుండా తీయబోతున్నారు. ఇక ఇందులో రామాయణం వార్ సీన్ అయితే 25 నిమిషాలు పక్కగా వచ్చిందట. హీరో ఇంట్రడక్షన్ సీన్ పదినిమిషాలుంటే, ఇటర్వెల్ బ్యాంగ్ సీన్ 22 నిమిషాలు వచ్చేఛాన్స్ఉందని తెలుస్తోంది. క్లైమాక్స్ ని 20నిమిషాలతో రౌండ్ ఫిగర్ ఫిక్స్ చేశారు. సో టోటల్ గా ఈ ఐదు లెంథీ సీన్స్ కలిపితే 105 నిమిషాలు.. అంటే గంటా 45 నిమిషాలు ఈ ఐదు సీన్లకే సరిపోతుంది.. అంటే ఈ ఐదు సీన్లే సగం సినిమా నిడివిని లాగేసుకున్నాయి...ఐతే బాహుబలిలో ఇలాంటి వార్ సీన్లు, లేదంటే త్రిబుల్ ఆర్ లో ఇంటర్వెల్ బ్యాంగ్స్ చూసిన ఎవరికైనా, వారణాసిలో అలాంటి సీన్లు ఐదున్నాయంటే, ఒక్క వారణాసే, ఐదు బాహుబలిలతో సమానం అన్న క్లారిటీ రాకుండా ఉండదు.. నిజం చెప్పాలంటే పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కాబట్టి, ఆ మాత్రం డబుల్ త్రిబుల్ డోస్ ఇవ్వకపోతే, వరల్డ్ ఆడియన్స్ ని ఆకట్టుకోవటం కష్టం.. అందుకే ఐదారు బాహుబలులని ఒకే వారణాసిలో చూపించే సాహసం చేస్తున్నట్టున్నాడు రాజమౌళి.