మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ వచ్చే ఏడాది జూన్11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ గ్లింప్స్ పేలింది. సౌత్ ని మించేలా నార్త్ ఇండియాలో డ్రాగన్ గ్లింప్స్ కి రెస్పాన్స్ ఊహించనంత భారీగా పెరిగింది. ఐతే ఇదే టాక్ తో ఈ సినిమా రిలీజ్ అయితే వసూల్ల వరద ఎంత రావొచ్చు..? కేజీయప్ 2 మూవీకి 1400 కోట్ల వసూల్లను రాబ్టటిన ప్రశాంత్ నీల్, ఈ సారి అందుకు డబుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడా? నార్త్ ఇండియాలో ప్రభాస్ ని మించేలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎన్టీఆర్ కి దక్కుతోంది కాబట్టి, ఈ సారి 2000 కోట్ల రికార్డు బ్రేక్ అవటం పెద్ద విషయం కాకుండాపోతుందా? ఈడౌట్లని మించే డౌట్, ఇది కూడా రెండు భాగాలా మూవీనే అయితే, అప్పుడు పరిస్థితేంటి? వారణాసి వసూల్ల అంచనా 5 వేల కోట్ల నుంచి 10 వేల కోట్లు.. ఆ నెంబర్ ని డ్రాగన్ మూవీ చాలా తేలిగ్గా సొంతం చేసుకునేలా ఉందా? ప్రాక్టికల్ గా మార్కెట్ ని అంచనా వేస్తే డ్రాగన్ రిజల్ట్ తో రీసౌండ్ చేసే రికార్డ్స్ ఏంటి?
నిజానికి డ్రాగన్ మూవీ మీద గ్లింప్స్ వచ్చే వరకు ఉన్నా అంచనాలు కేవలం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా సీన్ ఎంత అనే... ఎందుకంటే సలార్ మూవీ 800 కోట్లు రాబట్టినా, అంతా రెబల్ స్టార్ ప్రభాస్ దయే అన్నారు. కంటెంట్ కాస్త కన్ ఫ్యూజ్ చేయటం వల్ల, కేజీయఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తడబడ్డాడు అనేశారు. అందుకే డ్రాగన్ లో ఏం చూపిస్తాడులే అనుకున్నారు. కాని గ్లింప్స్ లెవల్లోనే మైండ్ బ్లాంక్ చేస్తాడని ఎవరి ఊహకి కూడా అందలేదు.అసలు డ్రాగన్ గ్లింప్స్ వచ్చాక, అదేదో మూవీనే రిలీజై, వసూళ్ల వరద తెచ్చిందా అన్నంత వేబ్రేషన్స్ మార్కెట్లో క్రియేట్ అయ్యాయి.. దెబ్బకి ఓటీటీ రైట్స్ 1200 కోట్ల వరకు చేరిందనే టాక్ షాక్ ఇస్తోంది. ఐను ఆరునెల్ల క్రితం డ్రాగన్ ఓటీటీ రైట్స్ 550 కోట్ల నుంచి 650 కోట్లనగానే, దేవర టోటల్ వసూళ్లు డ్రాగన్ ఒక్క ఓటీటీ రైట్స్ తోనే వచ్చేలా ఉన్నాయని అంతా అనుకున్నారు.
కాని ఒక్క గ్లింప్స్ చేసిన భీభత్సం వల్ల, 1000 కోట్ల నుంచి 1200 కోట్లు ఆఫర్లు ఇచ్చేందుకు అమేజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ రెండూ పోటీ పడుతున్నట్టు కొత్త లెక్కలు కిక్ ఇస్తున్నాయి. ఇక నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఏకంగా 1200 కోట్లని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ ఉండొచ్చనంటున్నారు. ఇక తమిల్,మలయాళం, కన్నడం థియేట్రికల్ రైట్స్ మొత్తంగా 300 కోట్లని తెలుస్తోంది. వీటి వరకు లెక్కేసినా, 3 వేల కోట్ల లెక్కలు తేలుతున్నాయి.అంటే 2000 కోట్ల దంగల్ రికార్డుని రిలీజ్ కి ముందు జరిగే బిజినెస్ తోనే డ్రాగన్ బ్రేక్ చేసేలా ఉంది. ఇది కాకుండా యూఎస్, యూకే, కెనెడా, ఆస్ట్రేలియా, యూరప్ రైట్స్ 1000 కోట్ల వరకు ధర పలకొచ్చు.. ఐతే ఇండోనేషియా, మలేషియా, కొరియా, చైనా, జపాన్ లో ఈ సినిమా కేవలం జపాన్ వరకే బజ్ ని క్రియేట్చేస్తోంది. మిగతా దేశాల్లో రిలీజై టాక్ కిక్ ఇస్తే, అప్పుడు లెక్కలు మారొచ్చు.. ఎందుకంటే జపాన్ లో ఎన్టీఆర్ కి ఫ్యాన్ బేస్ ఉంది. కాని చైనా, కొరియా, ఇండోనేషియా లాంటి మిగతా సౌత్ ఏషియా కంట్రీస్ లో పెద్దగా తన సినిమాలు పరిచయం లేవు.ఏదేమైనా డ్రాగన్ మొదటి భాగం ఈజీగా 5 వేల కోట్ల వరకు వసూళ్లు రాబట్టేలా ఉంది. ఏమాత్రం టాక్ కిక్ ఇచ్చిన రెండో భాగం మినిమలమ్ 5 వేల కోట్లు, లేదంటే అంతుకు మించే వసూళ్లు రాబట్టొచ్చు.. అదే జరిగితే, వారణాసి పాన్ వరల్డ్ లెవల్లో రాబట్టాలనుకుంటున్న 10 వేల కోట్లు, డ్రాగన్ మూవీ రాబట్టే ఛాన్స్ఉంది. ఈవిషయంలో వారణాసికి వసూల్ల విషయంలో డ్రాగన్ పోటీ గట్టిగానే ఇచ్చేలా ఉంది.