రాక్ స్టార్ రహస్యాలు.!

మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు 'రాక్ స్టార్' దేవీ శ్రీ ప్రసాద్. ఆయన పాటలు అంటేనే ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్. అయితే, ఆ అద్భుతమైన మెలోడీలు, మాస్ బీట్స్ వెనుక ఉన్న కష్టం మరియు ఆయన అనుసరించే పద్ధతుల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో DSP

Post Published By: dialnews
Updated : 23 June 2026, 12:50 PM IST

మ్యూజిక్ డైరెక్టర్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు 'రాక్ స్టార్' దేవీ శ్రీ ప్రసాద్. ఆయన పాటలు అంటేనే ఒక ఎనర్జీ, ఒక వైబ్రేషన్. అయితే, ఆ అద్భుతమైన మెలోడీలు, మాస్ బీట్స్ వెనుక ఉన్న కష్టం మరియు ఆయన అనుసరించే పద్ధతుల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో DSP పంచుకున్న ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.దేవీ శ్రీ ప్రసాద్ తన పాటలను రెండు ముఖ్యమైన పద్ధతుల్లో ప్లాన్ చేస్తానని వెల్లడించారు.మొదటిది, సినిమా చూస్తున్నప్పుడు ఆ పాట కథతో పూర్తిగా కనెక్ట్ అవ్వాలి.రెండవది, సినిమాతో సంబంధం లేకుండా విడిగా విన్నప్పుడు కూడా ఆ పాట సూపర్ హిట్ అయ్యేలా ఉండాలి. కథను నడిపించాల్సిన అవసరం లేని పాటలకు, వీలైనంత జెనరిక్ గా, కావ్యాల లాగా ఉండే సాహిత్యాన్ని తాను ఇష్టపడతానని ఆయన తెలిపారు.

ఇక, DSP కెరీర్ లో ఎన్నో విజయవంతమైన పాటలు ఉన్నప్పటికీ, ఉదయ్ కిరణ్ నటించిన 'కలుసుకోవాలని' సినిమాలోని "ఉదయించిన సూర్యుడిని" పాట ఆయన అభిమానులకు చాలా ఇష్టమైనది. ఈ పాట వెనుక ఉన్న ఆసక్తికరమైన నేపథ్యం ఏంటంటే, ఈ పాటను ఆయన అనుహ్య పరిస్థితుల్లో కేవలం అరగంటలో రాసి, కంపోజ్ చేశారు.సినిమా ఆడియో విడుదల చేయడానికి కొద్ది సమయం మాత్రమే ఉండగా, ట్యూన్‌కు సాహిత్యం సరిగ్గా రాకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఆ సమయంలో మిక్సింగ్ స్టూడియోలోనే కాగితం, పెన్నుతో ఆ పాటను రాస్తూ, పాడుతూ పూర్తి చేశానని DSP వివరించారు.

ఇలా తక్కువ సమయంలో సృష్టించిన పాటలు కూడా అద్భుతాలు సృష్టిస్తాయని దీని ద్వారా రుజువైందని ఆయన పేర్కొన్నారు. 'కలుసుకోవాలని' సినిమా కోసం దేవీ శ్రీ ప్రసాద్ "ఆకాశం తన రెక్కలతో", "ఉదయించిన సూర్యుడిని" అనే రెండు పాటలకు సాహిత్యాన్ని అందించారు. ముఖ్యంగా "ఆకాశం తన రెక్కలతో" పాట రాసిన తర్వాత, ఆయన తల్లి "ఒక అమ్మాయిలా ఫీల్ అయ్యి రాసావు, నా పెళ్లికి ముందు నాకు కూడా ఇలాంటి అనుభూతులు కలిగాయి" అని ప్రశంసించారని DSP గుర్తు చేసుకున్నారు. అలాగే ఆయన తండ్రి కూడా ఆ పాటను ఎంతో మెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సంగీతం గురించి వివరిస్తూ, పాటలు ఎల్లప్పుడూ సినిమా ఎమోషన్ ఆధారంగానే ఉంటాయని దేవీ శ్రీ ప్రసాద్ తెలిపారు. తన కెరీర్‌లో సాధించిన విజయాల వెనుక ఉన్న కష్టం, పాటల కోసం చేసే ప్రయోగాలు ప్రేక్షకులకు తెలియజేస్తూ, ప్రతి పాట వెనుక ఒక కథ, ఒక ఎమోషన్ ఉంటాయని ఆయన మరోసారి నిరూపించారు.

Published : 
  • 23 June 2026, 12:50 PM IST