తర్వాతి ట్రేడింగ్ డీల్ పాండ్యాదే…ఆల్ రౌండర్ పై 2 ఫ్రాంచైజీల కన్ను…!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడటం దాదాపు ఖాయమైంది. హార్దిక్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా సిద్దంగా ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి.

Post Published By: dialnews
Updated : 25 June 2026, 4:15 PM IST

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆ జట్టును వీడటం దాదాపు ఖాయమైంది. హార్దిక్‌ను వదులుకునేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా సిద్దంగా ఉంది. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలోనే హార్దిక్ పాండ్యా తన నిర్ణయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేసినట్లు వార్తలు వచ్చాయి. సీనియర్ ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడం, వరుస పరాజయాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన హార్దిక్ పాండ్యా.. జట్టులో కొనసాగడం తన వల్ల కాదని చెప్పాడని పీటీఐ పేర్కొంది.అయితే ట్రేడింగ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్ తో పాటు రాజస్థాన్ రాయల్స్ ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్.. ముంబై ఇండియన్స్‌తో సంప్రదింపులు ప్రారంభించినట్లు వార్తలు కూడా వచ్చాయి.వీలైతే క్యాష్ డీల్ లేదా స్వాప్ డీల్ ద్వారా హార్దిక్ పాండ్యాను తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హార్దిక్ పాండ్యా కోసం యశస్వి జైస్వాల్‌ను ఇచ్చేందుకు కూడా రాజస్థాన్ రాయల్స్ రెడీ అయినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్ కూడా యశస్వి జైస్వాల్‌ను తీసుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా జట్టులోకి వస్తే రాజస్థాన్ రాయల్స్ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించనుంది.కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా హార్దిక్ పాండ్యా కోసం పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. క్యాష్ డీల్‌తో పాటు ప్లేయర్ స్వాప్ డీల్‌కు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌తో కేకేఆర్ సంప్రదింపులు ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. అజింక్యా రహానేతో పాటు రింకూ సింగ్‌ను వదులుకునేందుకు కూడా కోల్‌కతా నైట్‌రైడర్స్ సిద్దమైనట్లు పీటీఐ పేర్కొంది.

కోల్‌కతా జట్టులోకి వెళ్లినా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ దక్కనుంది. ఒకవేళ మినీ వేలంలోకి వచ్చిన హార్దిక్ పాండ్యా భారీ ధర పలికే ఛాన్స్ ఉంది.ఐపీఎల్ 2026 సీజన్‌లో హార్దిక్ పాండ్యా సారథ్యంలోనే ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్‌ల్లో నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో 9వ స్థానంలో నిలిచింది. గతంలో గుజరాత్ టైటాన్స్‌ నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ క్యాష్ డీల్ ద్వారా కొనుగోలు చేసింది. కానీ అతని సారథ్యంలో ముంబై ఘోర పరాజయాలను చవిచూసింది. ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆప్స్ చేరినా.. ఐపీఎల్ 2024, 2026 సీజన్‌లో నిరాశపరిచింది.

Published : 
  • 25 June 2026, 4:15 PM IST