సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని చాలా కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో ఈ వార్తలను అనిరుధ్ కొట్టిపారేసినప్పటికీ, తాజాగా అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే సీనియర్ నటుడు వై.జి. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలతో ఈ పుకార్లు మరోసారి బలంగా మొదలయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో వై.జి. మహేంద్రన్ మాట్లాడుతూ ఈ క్రేజీ జంట పెళ్లి వార్తలను దాదాపు కన్ఫర్మ్ చేశారు. "నేను విన్న సమాచారం ప్రకారం వాళ్ల పెళ్లి జరగబోతోంది అన్నది కచ్చితంగా నిజమే.
అనిరుధ్ త్వరలోనే ఓ పెద్ద పెళ్లి చేసుకోబోతున్నాడు. వాళ్లిద్దరూ ఓ సూపర్ కపుల్ అవుతారు" అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరి గురించి ఆయన గొప్పగా మాట్లాడారు. అనిరుధ్ ఎంత ఎదిగినా చాలా సింపుల్‌గా ఉండే మృదుస్వభావి అని మెచ్చుకున్నారు. అలాగే కావ్య మారన్ గురించి చెబుతూ.. ఆమె ఏమీ సాదాసీదా అమ్మాయి కాదని, ఒక పెద్ద ఐపీఎల్ టీమ్‌ను ఒంటిచేత్తో నడిపిస్తోందని, తన తండ్రి కళానిధి మారన్ వ్యాపార లక్షణాలను ఆమె అద్భుతంగా పుణికిపుచ్చుకుందని ప్రశంసించారు. ఇద్దరూ కలిసి భవిష్యత్తులో 'మ్యూజికల్ బిజినెస్' కూడా చేయొచ్చంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
సినీ, క్రీడా వర్గాల్లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్ ప్రకారం.. వీళ్ల పెళ్లి ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే అవకాశం ఉంది. రెండు కుటుంబాలు స్పెయిన్‌లో గ్రాండ్‌గా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాయని.. ఆ తర్వాత చెన్నైలో సినీ, క్రీడా, వ్యాపార, రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. అటు ఇండియన్ సినిమాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అనిరుధ్, ఇటు సక్సెస్ఫుల్ బిజినెస్‌వుమెన్‌గా కావ్య మారన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. దీంతో వీళ్ల పెళ్లి వార్త ఇప్పుడు అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు క్రికెట్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ పెళ్లి తేదీలు, వెన్యూకి సంబంధించి ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.