ఐపీఎల్ లో అత్యంత విలువైన ఆటగాళ్లలో సూర్య కుమార్ యాదవ్ ఒకడు. మిస్టర్ 360 ప్లేయర్ గా పేరున్న స్కైకు భారీగా అభిమానులు ఉన్నారు. అందువల్లే ముంబై మేనేజ్మెంట్ ఇతడిని తమతోనే ఉంచుకుంటోంది. ఎలా ఆడినప్పటికీ.. అతడిని కొనసాగిస్తూనే ఉంది. ఇటీవలి ఐపిఎల్ లో సూర్య కుమార్ యాదవ్ అంత గొప్పగా ఆడలేదు.. తన స్థాయి బ్యాటింగ్ చేయలేదు. ముఖ్యంగా జట్టు అవసరాలకు తగ్గట్టుగా పరుగులు తీయలేదు. ఈ నేపథ్యంలోనే సూర్య కుమార్ యాదవ్ వచ్చే సీజన్లో ముంబై జట్టులో ఉండడని.. మేనేజ్మెంట్ అతడిని వదిలించుకోవడానికి సిద్ధమైందని వార్తలు రావడం మొదలైంది. దీనికి తగ్గట్టుగా సూర్య కుమార్ యాదవ్ వ్యవహార శైలి కూడా ఉండడంతో అనేక రకాల అనుమానాలకు కారణమైంది. అయితే సూర్య కుమార్ యాదవ్ ఈ వ్యవహారం మీద అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ముంబై మేనేజ్మెంట్ కూడా అతని తొలగించి పట్ల క్లారిటీ ఇవ్వలేదు.
అటు ముంబై.. ఇటు సూర్య కుమార్ యాదవ్ ఎటువంటి ప్రకటనలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఊహాగానాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు వాటన్నింటికీ స్పష్టమైన సమాధానం చెప్పాడు సూర్య కుమార్ యాదవ్. కాకపోతే పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు. టీమిండియా టి20 మాజీ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇన్ స్టా గ్రామ్ బయోలో ముంబై ఇండియన్స్ పేరు కనిపించింది. దీంతో ముంబై ఇండియన్స్ అభిమానులు ఒకసారి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సంతోషం వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. ఇటీవల స్కై ఇన్ స్టాలో ముంబై ఇండియన్స్ పేరును తీసేసాడు. అధికారిక పేజీని.. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను సైతం అన్ ఫాలో చేశాడు. దీంతో అతడు జట్టు నుంచి వెళ్ళిపోతాడని ప్రచారం మొదలైంది. అయితే ఇప్పుడు బయోలో ముంబై ఇండియన్స్ పేరు కనిపించింది. కానీ హార్థిక్ పాండ్యాను అతడు మళ్లీ ఫాలో అవడం మొదలుపెట్టలేదు.
ఈ సీజన్లో సూర్య కుమార్ యాదవ్ 13 మ్యాచులు ఆడాడు. కేవలం 270 పరుగులు మాత్రమే చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు తాత్కాలిక సారథిగా పని చేశాడు. అయితే సూర్య కుమార్ యాదవ్ మునుపటి మాదిరిగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. తన ఫేవరెట్ షాట్లు కూడా కొట్టలేకపోయాడు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో సూర్య కుమార్ యాదవ్ మీద సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు టీమిండియా టి20 కెప్టెన్సీ కూడా కోల్పోవడంతో సూర్యకుమార్ యాదవ్ కెరీర్ డేంజర్ లో పడిందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.