బంగారంతో బికినీ, ఇన్నర్‌ వేర్‌ చేయించుకున్న లేడీ ఎంపీ.!

అవినీతిని అంతం చేయడానికి ఏ దేశ ప్రభుత్వం చేయని ధైర్యాన్ని ఇరాక్‌ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నేతల మీద తమ అవినీతి నిరోదక శాఖ చేత దాడులు చేయింది. ఇందులో భాగంగా ఇరాక్ ఎంపీ అలియా నస్సిఫ్ ఇంట్లో జరిగిన సోదాల్లో కళ్లు

Post Published By: dialnews
Updated : 2 July 2026, 11:10 AM IST

అవినీతిని అంతం చేయడానికి ఏ దేశ ప్రభుత్వం చేయని ధైర్యాన్ని ఇరాక్‌ ప్రభుత్వం చేసింది. ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నేతల మీద తమ అవినీతి నిరోదక శాఖ చేత దాడులు చేయింది. ఇందులో భాగంగా ఇరాక్ ఎంపీ అలియా నస్సిఫ్ ఇంట్లో జరిగిన సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో నగదు, బంగారం పట్టుబడింది. ఆమె ఇంటి నుంచి దాదాపు 20 బిలియన్ల ఇరాకీ దీనార్లు అంటే మన కరెన్సీలో సుమారు 130 కోట్ల నగదుదొరికింది. దాంతో పాటు, భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్ని కంటే హైలెట్‌ ఏంటంటే ఆమె ఇంటి నుంచి బంగారంతో చేసిన బికినీ, లోదుస్తులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఎంత బంగారం దాచుకున్న బిస్కెట్ల రూపంలో దాచుకుంటారు. లేదంటే నగలు చేయించుకుని పెట్టుకుంటారు.

మరీ బంగారం ఎక్కువైతే ఇంట్లో సామాన్లు, బాత్‌రూముల్లో సామాన్లు కూడా బంగారంతో చేయించుకున్న ఘటనలు గతంలో చూశాం. కానీ బంగారంతో బికినీ, అండర్‌వేర్‌ లాంటివి కూడా చేయించుకోవడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే జరుగుతున్న ఈ ప్రచారం గురించి ఇరాక్‌ అవినీతి నిరోధక శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నామని.. దాని బరువు సుమారు 27 కిలోలు ఉంటుందని చెప్తున్నారు. కానీ ఎంపీ చేయించుకున్న బికినీ, ఇన్నర్‌వేర్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. మే నెలలో ఇరాక్ కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అలీ అల్-జైదీ.. దేశంలో పాతుకుపోయిన అవినీతి వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించి వేస్తానని ప్రమాణ స్వీకారం రోజే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ భారీ అవినీతి వ్యతిరేక డ్రైవ్‌కు ఆదేశాలు జారీ చేశారు.

బగ్దాద్ నగరంలో అత్యంత భద్రత ఉండే 'గ్రీన్ జోన్'లో ఇరాక్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌కు చెందిన ప్రత్యేక బృందాలు అర్ధరాత్రి వేళ ఈ దాడుల్లో పాల్గొన్నాయి. మే చివర్లో ఇరాక్‌లో డిప్యుటీ మినిస్టర్‌గా ఉన్న అద్నాన్ అల్-జుమైలీని అవినీతి ఆరోపణలపై అరెస్ట్ చేశారు. ఆయనను విచారించగా, ప్రభుత్వ నిధులు ఎవరెవరు పక్కదారి పట్టించారో కీలక విషయాలు బయటపెట్టారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. విచారణలో పేర్లు వచ్చిన ఎంపీలకు ఉన్న చట్టబద్ధమైన రక్షణను ముందుగా ఎత్తివేసి మరీ వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. అధికారులు వస్తున్నారని ముందే పసిగట్టిన కొందరు నేతలు పారిపోవడంతో, గ్రీన్ జోన్ ఎంట్రన్స్‌లన్నీ మూసివేసి మరీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

ఈ తాజా దాడుల్లోనే కాకుండా, కొన్ని రోజుల క్రితం జరిగిన మరో ఆపరేషన్‌లో ఏకంగా 107 మిలియన్ డాలర్ల అంటే సుమారు 890 కోట్లు ప్రభుత్వ నిధులను అధికారులు రికవరీ చేశారు. అవినీతిపరులు తమ ఇళ్ల కింద గుంతలు తవ్వి, అందులో ఈ డబ్బును, బంగారాన్ని దాచిపెట్టారు. ఆ రహస్య స్థావరాల నుంచి ఆస్తులను బయటకు తీయడానికి భారీ క్రేన్లు, ఎక్స్‌కవేటర్లు వాడాల్సి వచ్చింది. అక్రమార్కుల ఇళ్ల నుంచి డబ్బు, బంగారంతో పాటు తుపాకులు, ఇతర మందుగుండు సామగ్రిని కూడా సీజ్ చేశారు. మొత్తంగా వివిధ ఇళ్లు, రహస్య స్థావరాల నుంచి ఈ ఆపరేషన్‌లో 85 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అవినీతిని అంతం చేయడానికి ఇరాక్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ సాహసోపేతమైన చర్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి.

Published : 
  • 2 July 2026, 11:10 AM IST