పసిడి కొనుగోళ్లను నిరుత్సాహపరచడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని 6 నుంచి 15 శాతానికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీటిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ (ఏఐడీసీ) విధించారు. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనమై డాలర్‌తో పోలిస్తే రూ.95.75 వద్దకు చేరిన సమయంలో ప్రభుత్వం ఈ చర్యలకు సిద్ధమైంది.వాస్తవానికి బంగారం కొనుగోలు నిలిపేయాలని ప్రధాని మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా కస్టమ్స్ డ్యూటీని పెంచడం గమనార్హం. ప్రపంచంలోనే బంగారం అత్యధికంగా దిగుమతి చేసుకొనే రెండో దేశం భారత్ కాగా.. వెండి విషయంలో మొదటి స్థానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుంకాలు పెంచడంతో.. దేశీయ కొనుగోళ్లు డీలా పడే అవకాశాలున్నాయని ఇండియా బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ అభిప్రాయపడుతోంది.
భారతదేశం తన అవసరాలకు కావాల్సిన 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా ఇండియాకి భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700-800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90 శాతానికి పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం. బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండూ దిగుమతి చేసుకుంటే ఆమేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరిగి, భారత రూపాయి విలువ పడిపోతుంది.ఈ పరిస్థితుల్లో దుబాయ్ నుంచి భారత్‌కు బంగారం దిగుమతులు పెరిగే అవకాశం ఉందని మేధో సంస్థ జీటీఆర్ఐ (GTRI) వెల్లడించింది. బంగారం క ఏటా ఎనిమిది వందల టన్నుల బంగారం దిగుమతి స్టమ్స్ సుంకం పెంచడం వల్ల దిగుమతయ్యే రూట్ మారనుందని అభిప్రాయపడింది. భారత్- యూఏఈ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమే దీనికి కారణం.
ఈ ఒప్పందంలో భాగంగా అత్యంత ప్రాధాన్య దేశాల కంటే టారిఫ్ రేట్ కోటా కింద ఒక శాతం తక్కువకే బంగారం దిగుమతులకు భారత్ అనుమతిస్తోంది. ప్రస్తుతం సాధారణ దిగుమతి సుంకం 15 శాతం ఉండగా.. దుబాయ్ కోటా కింద వచ్చే బంగారంపై 14 శాతం సుంకం మాత్రమే పడుతుంది. ఈ 1శాతం వ్యత్యాసం వల్ల వ్యాపారులు బంగారాన్ని దుబాయ్ ద్వారా భారత్‌కు తీసుకువచ్చే అవకాశం ఉందని జీటీఆర్ఐ తెలిపింది. 2022లో 120 టన్నులుగా ఉన్న దిగుమతులు 2027 నాటికి 200 టన్నులకు చేరనున్నాయని జీటీఆర్ఐ అంచనా వేస్తోంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం దిగుమతుల్లో నాలుగోవంతు దుబాయ్ ఆక్రమించనుంది.వెండిపై సాధారణ సుంకం 15 శాతం ఉండగా.. ఒప్పందం ప్రకారం దుబాయ్ నుంచి వచ్చే వెండిపై ప్రస్తుతం 7 శాతం మాత్రమే ఉంది. ఈ 8 శాతం వ్యత్యాసం వల్ల దుబాయ్ మార్గం ద్వారా వెండి దిగుమతులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని జీటీఆర్ఐ తెలిపింది. 2031 నాటికి ఈ ఒప్పందం కింద వెండిపై సుంకం సున్నా శాతానికి చేరుకోనుందని తెలిపింది. అంటే ఏ రకంగా చూసినా దుబాయ్ నుంచి బంగారం వెండి కొనుక్కోవడం కొంత బెటర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్ రేట్ కంటే ఎంతో కొంత తక్కువ వస్తుంది దుబాయ్ బంగారం. అంతేకాదు గోల్డ్ క్వాలిటీ కూడా దుబాయిలో బాగుంటుందనేది అందరికీ తెలిసిందే.