ఎమ్మెల్సీ విజయశాంతి అలియాస్ రాములమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై రివెంజ్ తీసుకుంటున్నారా? ఆశించింది ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని నేను ఏదోరకంగా ఇరుక్కున పెడుతూనే ఉంటాను. నాకు మంత్రి పదవి ఇచ్చేవరకు ఇలాగే వ్యవహరిస్తూ ఉంటాను అని పరోక్షంగా హెచ్చరిస్తున్నారా?ఇటీవల షాబాద్ లో జరిగిన హత్యల నేపద్యంలో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు విజయశాంతి. ఆరుగురుని చంపిన హంతకుడు సూసైడ్ చేసుకోవడం పక్కన పెట్టండి. ఫోక్సో కేసులో ఆ ఉన్మాదికి ముందస్తు బెయిల్ ఎలా ఇచ్చారు? కేసుని బలహీనపరుస్తూ వీక్ సెక్షన్లు ఎందుకు పెట్టారు? దీనిలో పోలీసులు తిన్నది ఎంత? ఈ విషయం తేల్చండి అంటూ..... విజయశాంతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్ లో ట్వీట్ పెట్టారు. దీంతో అటు పోలీసులు, ఇటు ప్రభుత్వ అధినేతలు ఉలిక్కిపడ్డారు. ఇలా ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకున పెట్టడం
విజయశాంతి కొత్త ఏం కాదు.
ఎమ్మెల్సీ అని కొత్తలో కౌన్సిల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేసారమే. తమ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందని.... వాళ్లకి ఇస్తానన్నవి ఏవి ఇవ్వలేదని.... బహిరంగంగానే సభలోనే విమర్శించారు. ఇది కూడా రేవంత్ సర్కార్ కి ఊహించని దెబ్బే. విజయశాంతి మాటలకు పార్టీలో ఎవ్వరు కౌంటర్ ఇవ్వద్దని, ప్రాధాన్యం కూడా ఇవ్వద్దని కరాకండిగా చెప్పడంతో పెద్ద రచ్చ ఏమి జరగడం లేదు. కానీ సొంత పార్టీ ఎమ్మెల్సీ ఇలా ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో సీఎంని, ప్రభుత్వాన్ని ఇరుకును పెడుతుంటే ఏం చేయాలో అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు కాంగ్రెస్ పెద్దలు. నాకు ఢిల్లీలో హై కమాండ్ నేతలు బాగా తెలుసు... నేను ఎమ్మెల్సీ తెచ్చుకున్నది కూడా వాళ్ళ సహకారంతోనే, కనుక నాకు ఇక్కడ లీడర్లు అంతా జుజుబి అన్నట్లు విజయశాంతి వ్యవహరిస్తూ ఉంటారు.
తెలంగాణ ఉద్యమం మొత్తం తానే నడిపించినట్లు విజయశాంతి మొదటి నుంచి బిల్డప్ ఇస్తూ ఉంటారు. మొదట తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి.... ఆ పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేశారు. కెసిఆర్ మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వడంతో అక్కడ పోటీ చేసి గెలిచారు. విజయశాంతి ఓవరాక్షన్ భరించలేక ఆమెను పక్కన పెట్టారు. టిఆర్ఎస్ నుంచి బిజెపికి, అక్కడినుండి కాంగ్రెస్ కి సెట్టింగ్స్ సర్వీస్ చేసి మొత్తానికి కాంగ్రెస్ లో సెటిల్ అయ్యారు. మొదట బిజెపి, తర్వాత తల్లిదండ్రంగా నా పార్టీ, టిఆర్ఎస్, మళ్లీ బిజెపి, అక్కడి నుండి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు విజయశాంతి. ఎమ్మెల్సీ కోసం చాన్నాళ్లు ప్రయత్నించగా మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం మొన్న ఈ మధ్య ఆ పదవి ఇచ్చింది.
ఆ తర్వాత పెట్టారు ఒకప్పటి లేడీస్ సూపర్ స్టార్. సినిమాలు వేరు , పాలిటిక్స్ వేరు. తానేంటో అర్థం అయినా కూడా ఇప్పటికీ స్టార్ పొలిటిషన్ లాగే బిల్డప్ ఇస్తూ ఉంటారు విజయశాంతి. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించరు. అసలు ఆమె అంటే ఏ కార్యకర్త ఉన్నాడో కూడా అర్థం కాదు. పుట్టినరోజు జరిగితే పుష్పం ఇచ్చేవాడు లేడు. హైదరాబాద్ మొత్తం నా చేతిలోనే ఉంది అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. విజయశాంతి కి మంత్రి పదవి ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి తో పాటు, మిగిలిన పెద్ద నాయకులు ఎవరు ఒప్పుకోవడం లేదు. ఆమెకి ఎమ్మెల్సీ ఏ ఎక్కువ అన్నట్లు వాళ్లు భావిస్తున్నారు. విజయ శాంతి మాత్రం నేను లేస్తే మనిషిని కాదన్నట్లు, ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రిని ప్రభుత్వాన్ని ఇరకాటంలో లో పెడుతూనే ఉన్నారు.