పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'స్పిరిట్'. ఈ సినిమాకు సంబంధించి తాజాగా సందీప్ వంగా ఒక ఈవెంట్లో మాట్లాడుతూ, "స్పిరిట్ సినిమా ప్రస్తుతానికి 40 శాతం పూర్తయినట్టు" అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఇంకా 60 శాతం షూట్ పూర్తి చేసుకోవాల్సి ఉంది.
సినిమాను అనుకున్న సమయానికే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు దర్శకుడు సందీప్ శరవేగంగా పనులను పూర్తి చేస్తున్నారు. ప్రభాస్ కెరీర్లోనే 'మోస్ట్ వైలెంట్' మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.