బాలయ్య సినిమాలో సంక్రాంతి భాగ్యం.!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది.

Post Published By: dialnews
Updated : 21 July 2026, 9:00 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నందమూరి బాలకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంటుంది. ప్రస్తుతం బాలయ్య వరుస సక్సెస్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో బాలయ్య ఒక భారీ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే నందమూరి అభిమానుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర గురించి వినిపిస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వైవిధ్యమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య రాజేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆమె ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడం లేదు. బాలయ్య సరసన డ్యూయెట్లు పాడే క్యారెక్టర్ కాదట ఇది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న ఐశ్వర్య రాజేష్, ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నట్లు గట్టిగా వినిపిస్తోంది. కొరటాల శివ మార్క్ సినిమాల్లో విలన్ లేదా నెగిటివ్ క్యారెక్టర్లు ఎంత బలంగా ఉంటాయో మనకు తెలిసిందే. ఇప్పుడు బాలయ్య లాంటి మాస్ హీరోను ఢీకొట్టే నెగిటివ్ రోల్‌లో ఐశ్వర్య రాజేష్ కనిపించనుండటం నిజంగా విశేషమనే చెప్పాలి.

ఈ క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఇక ఈ సినిమా కథ మరియు బాలకృష్ణ క్యారెక్టరైజేషన్ గురించి మరో ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ కోసం బాలయ్య బాబు ఒక సరికొత్త లుక్‌ లో కనిపించబోతున్నారని సమాచారం. మునుపెన్నడూ చూడని రీతిలో బాలయ్య మేకోవర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలుస్తోంది.అంతేకాదు, ఈ ఫ్లాష్ బ్యాక్ బ్యాక్‌డ్రాప్ మొత్తం మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తోంది. ఒక పవర్‌ఫుల్ మాఫియా డాన్‌గా లేదా ఆ ముఠాను శాసించే ఒక విలక్షణమైన పాత్రలో బాలయ్య కనిపిస్తారని సమాచారం. ఈ ఎపిసోడ్‌లో వచ్చే యాక్షన్ సీక్వెన్సులు, డైలాగులు థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

దర్శకుడు కొరటాల శివ తన సినిమాల్లో కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా బలమైన సామాజిక సందేశాన్ని లేదా కుటుంబ బంధాలను చూపిస్తుంటారు. ఈ సినిమాలో కూడా బాలయ్యను పూర్తిస్థాయి మాస్ అవతార్‌ లో చూపిస్తూనే, మరోవైపు ఫ్యామిలీ ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తున్నారట. ఎమోషన్స్ మరియు మాస్ యాక్షన్ సమపాళ్లలో కుదిరేలా కొరటాల శివ ఈ స్టోరీని సిద్ధం చేశారు. ఈ సినిమా కథ చాలా ప్రత్యేకంగా ఉంటుందని, బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్టుగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా స్క్రిప్ట్ డిజైన్ చేశారని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.ఎన్టీఆర్ 'దేవర' తర్వాత చేస్తున్న సినిమా కావడంతో కొరటాల శివ ఈ కథపై చాలా కాలం పాటు ప్రత్యేక కసరత్తులు చేశారు. బాలయ్య మాస్ పవర్, కొరటాల శివ ఎమోషనల్ అండ్ పవర్‌ఫుల్ టేకింగ్, మాఫియా బ్యాక్‌డ్రాప్ ఫ్లాష్ బ్యాక్, మరియు ఐశ్వర్య రాజేష్ నెగిటివ్ షేడ్స్.. ఇలా అన్నీ కలిపి ఈ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Published : 
  • 21 July 2026, 9:00 PM IST