Top story: ఉక్రెయిన్‌పైకి ఇరాన్ మాన్‌స్టర్ మిస్సైళ్లు.. ఇరాన్‌ను కెలుక్కుని తప్పుచేసిన జెలెన్‌స్కీ..!

అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న ఇరాన్.. ఇప్పుడు పుతిన్‌కు మద్దతుగా ఉక్రెయిన్‌పై ఫోకస్ చేసిందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తమకేం సంబంధం లేదంటూనే.. ఉక్రెయిన్‌పై గురి పెట్టిందా?

Post Published By: dialnews
Updated : 28 July 2026, 4:30 PM IST

అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న ఇరాన్.. ఇప్పుడు పుతిన్‌కు మద్దతుగా ఉక్రెయిన్‌పై ఫోకస్ చేసిందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తమకేం సంబంధం లేదంటూనే.. ఉక్రెయిన్‌పై గురి పెట్టిందా?అంటే అవుననే అంటున్నాయి అంతర్జాతీయ పరిణామాలు. కాస్పియన్ సముద్రంలో ఇరాన్‌ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ జరిపిన దాడి అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఈ దాడిలో తమ దేశ నావికుడు మరణంతో టెహ్రాన్‌ సీరియస్ అయింది. ఉక్రెయిన్‌కు ఇరాన్ పాలకులు ఇస్తున్న వార్నింగ్ కాల్స్ చూస్తుంటే.. యుద్ధం మరో మలుపు తిరగబోతోందా అనే అనుమానాలను వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకూ రష్యాకు కేవలం సూసైడ్ డ్రోన్లు మాత్రమే సరఫరా చేసిన ఇరాన్.. ఇప్పుడు నేరుగానే యుద్ధ క్షేత్రంలోకి దిగబోతోందా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయి.

అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న ఇరాన్ వాణిజ్య నౌకపై ఉక్రెయిన్ దాడి చేసింది. ఈ దాడిలో ఒక ఇరాన్ నావికుడు మరణించాడు. దీంతో ఈ దాడి అంతర్జాతీయంగా పెను సంచలనంగా మారింది. ఎందుకంటే, ఈ దాడిని టెహ్రాన్ కేవలం ఒక నౌకపై జరిగిన దాడిగా చూడటం లేదు. ఇది నేరుగా ఇరాన్ సార్వభౌమాధికారానికి, దాని ఆర్థికమూలాలకు ఉక్రెయిన్ విసిరిన ప్రత్యక్ష సవాల్‌గా పరిగణిస్తోంది. ఈ దాడిపై ఇరాన్ విదేశాంగ శాఖ అత్యంత తీవ్రమైన భాషలో స్పందించింది. తమ దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తాము సైనిక పరంగా ఎలాంటి కఠిన చర్యలకైనా వెనకాడబోమని స్పష్టం చేసింది.

తమ నౌకపై దాడికి పాల్పడిన ఉక్రెయిన్ ఇంతకింతా అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. మిడిల్‌ఈస్ట్‌లో ఇప్పటికే ఉద్రిక్తతలు పీక్ స్టేజ్‌కు చేరిన వేళ, ఈ యుద్ధం మరింత విస్తరించి అంతర్జాతీయ సంక్షోభంగా మారకుండా ఉండాలంటే యూరోపియన్ దేశాలు వెంటనే జోక్యం చేసుకుని కీవ్ పాలకులను కట్టడి చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది.మరోవైపు, ఇరాన్ చేస్తున్న హెచ్చరికలను ఉక్రెయిన్ ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఇరాన్ పదేపదే చెప్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో వాస్తవాలు వేరేలా ఉన్నాయని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నాడు. రష్యా అత్యాధునిక ఉపగ్రహ సమాచారాన్ని, గల్ఫ్ దేశాలు, అమెరికా సైనిక స్థావరాల రహస్య ఫొటోలను ఇరాన్ తన వ్యూహాత్మక దాడుల కోసం వాడుకుంటోందని జెలెన్‌స్కీ ఆరోపిస్తున్నాడు.

తెరవెనుక రష్యా-ఇరాన్ బంధాన్ని దెబ్బకొట్టేందుకే ఉక్రెయిన్ ఈ ఆపరేషన్ చేపట్టినట్లు రక్షణ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఉక్రెయిన్ ఆర్మీ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్పియన్ సముద్రాన్నే టార్గెట్ వెనుక పెద్ద ఆర్థిక వ్యూహం ఉంది. అమెరికా, పాశ్చాత్య దేశాలు విధించిన కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ప్రపంచ వాణిజ్యానికి దాదాపు దూరమైంది. ఇలాంటి స్థితిలో ఇరాన్‌కు ఉత్తర దిశలో ఉన్న కాస్పియన్ సముద్ర మార్గమే ఏకైక ఆర్థిక లైఫ్ లైన్‌గా మారింది. చైనా, రష్యాతో పాటు ఆసియా దేశాల నుంచి కీలకమైన ముడిసరుకులు, సాంకేతికత, ఆయుధ విడిభాగాలు ఇరాన్‌కు చేరుకునేది ఈ మార్గం ద్వారానే. ఇప్పుడు ఆ రూట్‌పై దాడి జరగడం అంటే ఇరాన్ ఆర్థిక వెన్నుముకపై కోలుకోలేని దెబ్బకొట్టడమే.

ఇప్పటివరకు ఉక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ పాత్ర కేవలం రష్యాకు షాహెద్ సూసైడ్ డ్రోన్లు సరఫరా చేయడానికే పరిమితమైంది. కానీ, కాస్పియన్ సముద్రంలో తమ నావికుడు మరణించిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. ఇరాన్ దృష్టి ఇప్పుడు నేరుగా ఉక్రెయిన్‌పై పడింది. రష్యాకు కేవలం ఆయుధ సరఫరా చేసే దేశంగా కాకుండా.. తమపై జరిగిన దాడికి కీవ్ పాలకులపై స్వయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి టెహ్రాన్ సిద్ధమవుతోందని ఇరాన్ పాలకుల హెచ్చరికలు చెబుతున్నాయి. ఇందుకోసం రష్యాకు డ్రోన్ల మద్దతు ఇవ్వడం అనే పాత ఆప్షన్‌ను పక్కనబెట్టి, నెక్స్ట్ లెవెల్ ప్లాన్స్‌ను సిద్ధం చేస్తోంస్తున్నట్టు నివేదికలు వస్తున్నాయి.

అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. ఇరాన్ ముందున్న మొదటి ఆప్షన్.. రష్యాకు తన వద్ద ఉన్న క్షిపణులను అందివ్వడం. ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన 'ఫతా-110, 'జోల్ఫాఘర్ వంటి క్లోజ్-రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను రష్యాకు భారీగా తరలించే అవకాశం ఉంది. ఉక్రెయిన్ వాడుతున్న పాశ్చాత్య వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ గైడెడ్ క్షిపణులకు ఉందని చెబుతున్నారు. ఇరాన్ గనుక ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే, రష్యా సైన్యం ఉక్రెయిన్ నగరాలపై గతంలో ఎన్నడూ లేని విధంగా క్షిపణుల వర్షం కురిపించడం ఖాయం.

పశ్చిమాసియాలో ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికాతో నేరుగా తలపడుతూ, బహుముఖ యుద్ధం చేస్తున్న ఇరాన్.. ఇప్పుడు ఉక్రెయిన్‌ను కూడా తన శత్రువుల జాబితాలో చేర్చుకుందని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఇప్పటివరకూ ఇటు మిడిల్ ఈస్ట్ అటు ఉక్రెయిన్‌లో జరిగిన యుద్ధాలు ఇప్పుడు ఒక్కటి కాబోతోందా అన్న ఆందోళనలూ కనిపిస్తున్నాయి. రష్యా-ఇరాన్-చైనా-ఉత్తర కొరియా ఒక కూటమిగా.. అమెరికా-నాటో-ఉక్రెయిన్ దేశాలు మరో కూటమిగా నిలుస్తూ ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో, తన నౌకపై జరిగిన దాడికి ఇరాన్ ప్రతికార చర్య ఉక్రెయిన్ ఉనికికే ముప్పుగా మారడమే కాకుండా, ప్రపంచ రాజకీయాలను శాశ్వతంగా మార్చేసే ప్రమాదం ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

Published : 
  • 28 July 2026, 4:30 PM IST