సెకండ్ ఇన్నింగ్స్ సవాళ్లు.!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ స్పాన్ ఎంత? ఒకప్పుడు పదేళ్లు ఏలితే గొప్ప అనుకునేవారు. అలాంటిది 'చందమామ' కాజల్ అగర్వాల్ దాదాపు పదిహేనేళ్లకు పైగా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాజ్యమేలింది.

Post Published By: dialnews
Updated : 29 July 2026, 3:01 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరీర్ స్పాన్ ఎంత? ఒకప్పుడు పదేళ్లు ఏలితే గొప్ప అనుకునేవారు. అలాంటిది 'చందమామ' కాజల్ అగర్వాల్ దాదాపు పదిహేనేళ్లకు పైగా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా రాజ్యమేలింది. స్టార్ హీరోలందరి సరసన నటించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుంది. అయితే, ప్రతీ కథానాయిక జీవితంలోనూ పెళ్లి లేదా విరామం తర్వాత ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. దాన్నే మనం 'సెకండ్ ఇన్నింగ్స్' అంటుంటాం.ప్రస్తుతం మన చందమామ కాజల్ కూడా తన సెకండ్ ఇన్నింగ్స్‌లో గెలిచేందుకు తీవ్రంగా పోరాడుతోంది. కానీ పాపం.. ఎంత ప్రయత్నిస్తున్నా దురదృష్టం ఆమెను వెంటాడుతూనే ఉంది.

నిజానికి సినిమా పరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చి మళ్లీ పాత వైభవాన్ని అందుకోవడం అనేది ఎవరికీ అంత తేలికైన విషయం కాదు. మన గత జ్ఞాపకాలను ఒకసారి గుర్తుచేసుకుంటే...ఒకప్పుడు కుర్రకారును ఊపేసిన భూమిక చావ్లా, పెళ్లి తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తూ రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. రీసెంట్‌గా వచ్చిన 'యుఫోరియా' కూడా ఆమెకు కలిసి రాలేదు. ఇక లైలా, మీరా జాస్మిన్ వంటి భామలు లాంగ్ గ్యాప్ తర్వాత తిరిగొచ్చినా ఆశించిన స్థాయిలో బిజీ కాలేకపోతున్నారు. హీరోయిన్ లయ అయితే ఇటీవల ఒకే రోజు రెండు సినిమాలతో వచ్చినా పెద్దగా మైలేజ్ దక్కలేదు. అంటే, సెకండ్ ఇన్నింగ్స్ అనేది చాలామంది సీనియర్ హీరోయిన్లకు ఒక పెద్ద పరీక్షగానే మారింది.

ఇప్పుడు కాజల్ అగర్వాల్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే తయారైంది. పెళ్లి, బాబు పుట్టిన తర్వాత కాజల్ కేవలం రోటీన్ గ్లామర్ పాత్రలకే పరిమితం కాకూడదు అనుకుంది. యాక్షన్, పర్‌ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్లు ఎంచుకుంది. కానీ బ్యాడ్ లక్!చిరంజీవి 'ఆచార్య'లో నటిస్తే, ఎడిటింగ్‌లో ఆమె సీన్లు మొత్తానికే తీసేశారు.భారీ అంచనాలతో వచ్చిన 'ఇండియన్ 2' డిజాస్టర్ అయ్యి ఆశలన్నీ అడుగుంటిపోయాయి.లేడీ ఓరియెంటెడ్ అని నమ్మి చేసిన 'సత్యభామ' ఆకట్టుకోలేకపోయింది.ఇటీవల 'ది ఇండియా స్టోరీ' కోసం కాజల్ ఎన్నడూ లేనంతగా ప్రమోషన్లు చేసింది. కానీ ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది.

ఈ వరుస ఫ్లాపుల తుఫానులో కాజల్‌కి దొరికిన ఒకే ఒక్క గట్టు... నందమూరి బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి'! ఆ సినిమాలో బాలయ్యతో కాజల్ పెయిర్ మెప్పించింది, సినిమా కూడా మంచి హిట్ సాధించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కాజల్ ఖాతాలో పడ్డ ఏకైక బిగ్ హిట్ ఇదే!
మిగతా సినిమాలు ఏవీ బాక్సాఫీస్ దగ్గర నిలబడకపోవడంతో ఇప్పుడు అందరి దృష్టి బాలకృష్ణతో ఆమె చేయబోయే తదుపరి చిత్రంపైనే పడింది. 'భగవంత్ కేసరి' కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో, ఈ సినిమా అయినా కాజల్‌కి ఒక డ్రీమ్ కంబ్యాక్ ఇస్తుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా, వరుసగా ప్లాపులు పడుతున్నా వెనకడుగు వేయకుండా కొత్త తరహా కథలను ప్రయత్నిస్తున్న కాజల్ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. మరి బాలయ్యతో రాబోయే సినిమాతోనైనా మన చందమామ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించి హిట్ ట్రాక్ ఎక్కుతుందో లేదో చూడాలి.

Published : 
  • 29 July 2026, 3:01 PM IST