రామాయణ 50 వేల స్క్రీన్స్.!

భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్థాయి రోజురోజుకూ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోంది. మన సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి రాబోతున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక హిస్టారికల్ మూవీ ‘రామాయణ’

Post Published By: dialnews
Updated : 11 August 2026, 7:55 PM IST

భారతీయ చలనచిత్ర పరిశ్రమ స్థాయి రోజురోజుకూ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతోంది. మన సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి రాబోతున్న అత్యంత భారీ ప్రతిష్టాత్మక హిస్టారికల్ మూవీ ‘రామాయణ’ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌లో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, మరియు కన్నడ రాకింగ్ స్టార్ యష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ విజువల్ వండర్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకు రావడానికి సన్నాహాలు చేసుకుంటోంది.అయితే, ఇండస్ట్రీ రూమర్స్ ప్రకారం, 'రామాయణ' చిత్రాన్ని ఏకంగా 50,000 కంటే ఎక్కువ స్క్రీన్స్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

పోలికగా చూసుకుంటే, ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలైన 'ఒడిస్సీ' చిత్రమే 25 వేలకు పైగా స్క్రీన్స్ లలో రిలీజ్ అయింది. దానికి రెట్టింపు సంఖ్యలో, అంటే 50 వేల స్క్రీన్స్ లో ఒక ఇండియన్ సినిమా విడుదల కావడం అనేది చిన్న విషయం కాదు. ఈ వార్త గనక నిజమైతే, ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అయిన తొలి సినిమాగా 'రామాయణ' సరికొత్త రికార్డు నమోదు చేస్తుంది. ఈ గ్లోబల్ రిలీజ్ టాక్‌లో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ 50,000 స్క్రీన్ల అంచనాలో చైనా కంట్రీ రిలీజ్ లేదు! సాధారణంగా హాలీవుడ్ సినిమాలు వేల సంఖ్యలో స్క్రీన్స్ సాధించడానికి చైనా మార్కెట్ ప్రధాన కారణం.

అయితే చైనా రిలీజ్ లేకుండానే, హాలీవుడ్ వండర్ 'అవతార్ 2' రేంజ్‌లో 'రామాయణ'కు గ్లోబల్ వైడ్ ప్రదర్శన దక్కడం ఆషామాషీ విషయం కాదని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.అంతర్జాతీయ స్థాయిలో ఇన్ని వేల స్క్రీన్స్ దక్కడం ఎంత ముఖ్యమో, థియేటర్లలోకి ఆడియన్స్ వచ్చి ఆదరించడం కూడా అంతే ముఖ్యం. నితీష్ తివారి దర్శకత్వ ప్రతిభ, గ్రాఫిక్స్, మరియు విజువల్ ఎఫెక్ట్స్ గ్లోబల్ ఆడియన్స్‌ను మెప్పిస్తే రికార్డు స్థాయి వసూళ్లు రావడం ఖాయం. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్‌ల పాన్-ఇండియా స్టార్‌డమ్ సినిమాకు భారీ ఓపెనింగ్స్ అందించడానికి తోడ్పడుతుంది. ఈ భారీ రిలీజ్ ప్లాన్స్ మరియు 50 వేల స్క్రీన్ల కౌంట్‌పై ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్రమైన చర్చ నడుస్తున్నప్పటికీ, మూవీ మేకర్స్ లేదా డిస్ట్రిబ్యూషన్ సంస్థల నుంచి దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫారమ్‌పై మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న 'రామాయణ' చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Published : 
  • 11 August 2026, 7:55 PM IST