"మరో కొన్ని రోజుల్లో.. ఇరాన్‌ను పూర్తిగా ఓడించి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (హోర్ముజ్ జలసంధి) సముద్ర మార్గాన్ని అమెరికా సొంత భూభాగంగా ప్రకటిస్తాను".. ఇవీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన అత్యంత సంచలన వ్యాఖ్యలు! ఇరాన్‌తో యుద్ధం నడుస్తున్న ఈ క్లిష్ట సమయంలో.. ఒక అంతర్జాతీయ జలమార్గాన్ని అమెరికా టెరిటరీగా మారుస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా పెను దుమారం రేపింది. అయితే, ఈ వ్యాఖ్యలపై ఇరాన్ ఊరుకుందా? అస్సలు లేదు.
ట్రంప్ పరువు తీసేలా ఊహించని రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. "ప్రెసిడెంట్ ట్రంప్.. మా సరిహద్దుల గురించి అనవసరమైన బడాయిలు పలకడం మానేసి.. మొదట మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మళ్లీ ఎక్కడ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 'క్యాటరింగ్ ట్రక్కు'లో దాక్కోవాల్సి వస్తుందో చూసుకోండి." అంటూ ఒక ఇరాన్ టాప్ లీడర్ ఘాటుగా ఎగతాళి చేశారు. అసలు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంతలా ఎందుకు రెచ్చిపోయారు? ఇరాన్ లీడర్ ప్రస్తావించిన ఆ 'క్యాటరింగ్ ట్రక్' వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఈ రోజుటి మన వీడియోలో పూర్తి వివరాలు క్లియర్ గా తెలుసుకుందాం.
అసలు వివాదం ఎక్కడ మొదలైందంటే.. న్యూయార్క్‌లో జరిగిన ఒక భారీ సభలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తూ ఇరాన్ దేశాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో అమెరికా నౌకాదళం పూర్తిగా హోర్ముజ్ జలసంధిని తమ అదుపులోకి తెచ్చుకుందని ఆయన క్లెయిమ్ చేశారు. అంతటితో ఆగకుండా.. "ఒక్కసారి ఇరాన్‌ను మేము పూర్తిగా ఓడించిన తర్వాత, త్వరలోనే ఆ హోర్ముజ్ జలసంధిని యూఎస్ టెరిటరీగా మారుస్తాం" అని వైట్ హౌస్ తరపున ప్లాన్ ప్రకటించారు. అయితే పరిస్థితి చాలా సీరియస్‌గా మారుతోందని గమనించిన వైట్ హౌస్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి.. "ట్రంప్ గారు ఆ మాటలను సీరియస్‌గా అనలేదు, కేవలం ప్రచారంలో సరదాగా మాత్రమే అన్నారు" అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ, ఇరాన్ మాత్రం ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకుంది.
ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల్లోనే.. ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కమిటీ చైర్మన్ ‘ఇబ్రహీం అజీజీ’ సోషల్ మీడియా వేదికగా ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ఆయన తన ట్వీట్లో.. "అమెరికా అధ్యక్షుడు హోర్ముజ్ జలసంధి గురించి పనికిరాని బడాయిలు, అంతులేని అబద్ధాలు పలకడం మానేసి.. మొదట తన సొంత భద్రత గురించి ఆందోళన చెందితే మంచిది. లేదంటే మళ్లీ ఎయిర్‌పోర్టులో ఒక ఫుడ్ ట్రక్కులో దాక్కోవాల్సి వస్తుంది" అంటూ ఘోరంగా ఎగతాళి చేశారు. ఆయనతో పాటు ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి 'కాజెం ఘరీబాబాది' కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.
"మిస్టర్ ట్రంప్.. ఈ అంతర్జాతీయ జలసంధి అనేది నువ్వు పెట్టే ఒక ట్వీట్ ద్వారానో, లేదా అమెరికా పంపించే ఒక ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ద్వారానో స్వాధీనం చేసుకోవడానికి వీలు పడదు. ఇరాన్ దేశం ఇలాంటి షో ఆఫ్ ఫోర్స్‌లకు అస్సలు భయపడదు" అని తేల్చి చెప్పారు. అయితే ఇక్కడ మనకు వచ్చే పెద్ద డౌట్ ఏంటంటే.. ఇరాన్ ఎంపీ అన్న ఆ 'క్యాటరింగ్ ట్రక్' లేదా 'ఫుడ్ ట్రక్' కథ ఏంటి? అమెరికా ప్రెసిడెంట్ అంతటి వ్యక్తి ఎప్పుడు దాక్కున్నారు..? దీని వెనుక ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ఆపరేషన్ ఉంది. ఇది జూలై నెలలో జరిగిన ఒక అంతర్జాతీయ ఘటన. నాటో సదస్సు ముగిసిన తర్వాత ప్రెసిడెంట్ ట్రంప్ టర్కీ రాజధాని అంకారా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరాల్సి ఉంది.
అప్పుడు ఆయన ప్రయాణించడానికి ఖతార్ దేశం గిఫ్ట్‌గా ఇచ్చిన ఒక అత్యంత విలాసవంతమైన, భారీ బోయింగ్ విమానం సిద్ధంగా ఉంది. ట్రంప్ అందరి కళ్లెదుటే ప్రెస్ మీడియా ముందు ఆ పెద్ద విమానంలోకి ఎక్కారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'వాషింగ్టన్ పోస్ట్' రిపోర్ట్ ప్రకారం.. ఆ పెద్ద విమానం కేవలం ఇరాన్ దృష్టిని మళ్లించడానికి వాడిన ఒక డెకాయ్ మాత్రమే. ట్రంప్ ఆ విమానం ఎక్కిన కొద్దిసేపటికే, అమెరికా సీక్రెట్ సర్వీస్ మరియు మిలిటరీ అధికారులు ఆయనను అత్యంత రహస్యంగా విమానం వెనుక గుండా దించేసి, ఎయిర్‌పోర్టుకు సంబంధించిన ఒక 'క్యాటరింగ్ ట్రక్' లోపల కూర్చోబెట్టారు.
ఆ ట్రక్కులో ఆయనను ఎయిర్పోర్ట్ అవతలి వైపునకు తరలించి, అక్కడ సిద్ధంగా ఉన్న ఒక చిన్న సి-32ఎ మిలిటరీ విమానంలోకి మార్చారు. ఇరాన్ నుండి ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ మిస్సైల్ దాడి లేదా హత్య బెదిరింపులు ఉన్నాయనే ఇంటెలిజెన్స్ సమాచారంతోనే అమెరికా ఆర్మీ తమ దేశ ప్రెసిడెంట్‌ను అలా ఒక ఫుడ్ ట్రక్కులో దాచి తరలించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ కూడా తర్వాత ఒప్పుకున్నారు. ఇప్పుడు అదే పాయింట్‌ను పట్టుకుని ఇరాన్ లీడర్లు ట్రంప్‌ను ప్రపంచం ముందు ట్రోల్ చేస్తున్నారు.
అసలు ఈ హోర్ముజ్ జలసంధి చుట్టూ ఇంత రాజకీయం, ఇరు దేశాల మధ్య ఇన్ని యుద్ధ బెదిరింపులు ఎందుకు జరుగుతున్నాయో కూడా మనం తెలుసుకోవాలి. భౌగోళికంగా చూస్తే.. ఇరాన్‌కు మరియు ఒమన్, యూఏఈ దేశాలకు మధ్య ఉన్న చాలా సన్నటి సముద్ర మార్గమే ఈ హోర్ముజ్ జలసంధి. ప్రంఛవ్యాప్తంగా సముద్ర మార్గాల ద్వారా ఎగుమతి అయ్యే ముడి చమురులో దాదాపు 20% నుండి 30% కేవలం ఈ ఒక్క సన్నని మార్గం గుండానే వెళ్లాలి. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాల ఆయిల్ ట్యాంకర్లన్నీ దీని గుండానే ప్రపంచానికి సరఫరా అవుతాయి. ఒకవేళ ఇరాన్ గనుక ఈ మార్గాన్ని ఎక్కువ కాలం మూసివేస్తే, ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి.
అందుకే ఇక్కడ పూర్తి కంట్రోల్ సాధించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భావిస్తుంటే.. తమ పరిధిలో ఉన్న ప్రాంతాన్ని వదులుకోకూడదని ఇరాన్ గట్టిగా పోరాడుతోంది. ఒకవైపు హోర్ముజ్‌ను అమెరికా భూభాగం చేస్తానంటూ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరిస్తుంటే.. మరోవైపు నీ ప్రాణాలు కాపాడుకోవడానికే నీకు క్యాటరింగ్ ట్రక్కులు కావాలంటూ ఇరాన్ ఘాటుగా సమాధానం ఇచ్చింది.