Top story: ట్రంప్ కొడుకు జస్ట్ మిస్.. ట్రంప్ కొడుకును లేపెసేందుకు ఇరాన్ ప్లాన్.. అమెరికా సీక్రెట్ సర్వీస్ సంచలన ఆరోపణలు..!

అమెరికా రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం సృష్టిస్తోంది. యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు, అందరికీ సుపరిచితుడైన బారన్ ట్రంప్ హత్యకు ఇరాన్ దేశం కుట్ర పన్నిందా?

Post Published By: dialnews
Updated : 29 August 2026, 7:20 PM IST

అమెరికా రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఒక వార్త పెను సంచలనం సృష్టిస్తోంది. యూఎస్ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు, అందరికీ సుపరిచితుడైన బారన్ ట్రంప్ హత్యకు ఇరాన్ దేశం కుట్ర పన్నిందా? అమెరికా అత్యున్నత రక్షణ సంస్థ అయిన 'యూఎస్ సీక్రెట్ సర్వీస్' చేసిన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. అసలు అమెరికా రక్షణ సంస్థలు ఏమని ఆరోపించాయి? ఈ భారీ కుట్ర వార్తలపై ఇరాన్ ప్రభుత్వం ఎలా స్పందించింది? ఇరాన్ భద్రతా విభాగం ఇచ్చిన క్లారిటీ ఏంటి?

అసలు విషయానికి వస్తే.. డోనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్‌ను టార్గెట్ చేస్తూ ఇరాన్ ప్లాన్ చేసిందని అమెరికా సీక్రెట్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది. బారన్ ట్రంప్‌ను హతమార్చేందుకు ఇరాన్ దేశానికి చెందిన కొన్ని శక్తులు లోతుగా కుట్ర పన్నాయని వారు పేర్కొన్నారు. ఇందుకు బలమైన ఆధారంగా.. ఇరాన్ ప్రభుత్వ అధికారిక టీవీ ఛానల్‌లో ప్రసారమైన ఒక ప్రత్యేక వీడియో గురించి తమకు సమాచారం ఉందని యూఎస్ భద్రతా సంస్థలు వెల్లడించాయి.

ఆ వీడియోలో బారన్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు కొన్ని సంకేతాలు ఉన్నాయని అమెరికా అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే బారన్ ట్రంప్ భద్రతను యూఎస్ నిఘా వర్గాలు మరింత కట్టుదిట్టం చేశాయి. అయితే, అమెరికా చేస్తున్న ఈ ఆరోపణలను ఇరాన్ ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. బారన్ ట్రంప్ హత్యకు కుట్ర పన్నామన్న వార్తలను తీవ్రంగా ఖండించింది. ఇదంతా కేవలం అబద్ధమని, ఇరాన్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు అమెరికా ఆడుతున్న డ్రామా అని స్పష్టం చేసింది.

ఇరాన్ దేశ రక్షణ, భద్రతా విభాగానికి చెందిన కీలక అధికారి, భద్రతా చీఫ్ మొహ్సిన్ రెజాయ్ తాజాగా లెబనాన్ టీవీకి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ట్రంప్ కుటుంబ సభ్యులను గానీ, ఆయన చిన్న కుమారుడిని గానీ టార్గెట్ చేయాల్సిన అవసరం తమకు లేదని, అమెరికా చేస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని ఆయన తేల్చి చెప్పారు. నిజానికి అమెరికాకు, ఇరాన్ దేశానికి మధ్య గత కొన్నేళ్లుగా తీవ్రమైన శత్రుత్వం నడుస్తోంది. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్ సైనిక కమాండర్ ఖాసిం సులేమానీని అమెరికా దళాలు డ్రోన్ దాడిలో హతమార్చాయి.

అప్పటి నుండి ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ లోని కొన్ని విభాగాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా 18 ఏళ్ల బారన్ ట్రంప్‌పై ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయంటూ వస్తున్న వార్తలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఒకవైపు అమెరికా సీక్రెట్ సర్వీస్ హెచ్చరికలు, మరోవైపు ఇరాన్ రక్షణ శాఖ ఖండనలతో ఈ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. అగ్రరాజ్యం అమెరికా ప్రెసిడెంట్ కొడుకును టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ వార్తలు రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలకు దారితీస్తాయో చూడాలి.

Published : 
  • 29 August 2026, 7:20 PM IST