Nominations fair from today... what precautions should candidates take!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇవాళ ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో లోక్ సభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. సెలవు రోజులు తప్ప మిగిలిన రోజుల్లో ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్లను స్వీకరిస్తారు. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లలో.... అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈనెల 25, 26న పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నెల 29. మే 13వ తేదీ పోలింగ్, జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో ఆఫీసు లోపలికి అనుమతిస్తారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు ఫైల్ చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ తీస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో హెల్ప్ డెస్కులను ఏర్పాటు చేశారు.
నామినేషన్ల దాఖలు చేసే అభ్యర్ధులకు జాగ్రత్తలు, నిబంధనలు :