ఆర్థిక సంక్షోభాలు ఆయనకు అడ్డు రావు. ఉపద్రవాలు, ఎన్నికలు, అధికార మార్పులు ఇవేవీ ఆయనపై ప్రభావం చూపించలేవు. వర్గాలు ,పార్టీలు, ముఠాలు, కులాలు రకరకాలుగా ఉండొచ్చు. ఆయన విషయంలో మాత్రం అందరూ ఒక్కటే. అందుకే ప్రపంచంలోనే ఆయన రిచ్ గార్డ్. ఆదాయంలో ఆయన కొట్టే వాళ్ళు లేరు. అది కూడా న్యాయబద్ధమైన ఆదాయం. తన రికార్డులని తాను బ్రేక్ చేసుకోవాల్సిందే తప్ప ఎవ్వరు ఆయన రికార్డులకి దరిదాపులకు కూడా రాలేరు. తెలుగు ఆదానీలు ఎంత సంపాదించినా మళ్లీ ఆయన దగ్గరికి వచ్చి చేతులెత్తి మొక్కల్సిందే. వెంకటేశ్వర స్వామి వైభవం అలాంటిది.
