తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి బోర్డు చైర్మన్ బి ఆర్ నాయుడు అలియాస్ టీవీ5 నాయుడు త్వరలో చైర్మన్ పదవికి రాజీనామా చేయబోతున్నారా? తప్పనిసరి పరిస్థితుల్లో బి ఆర్ నాయుడు ను చైర్మన్ పదవి నుంచి తప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టిటిడి బోర్డు కొత్త చైర్మన్గా టిడిపి సీనియర్ నాయకుడు కళా వెంకట్రావు కి అవకాశం ఇవ్వొచ్చని కూడా పార్టీలో టాక్ నడుస్తోంది.టీవీ5 చైర్మన్ విఆర్ నాయుడు..... టిడిపికి అపారమైన సేవ చేసినందుకు, మొన్నటి ఎన్నికల్లో ఛానల్ తరఫున పూర్తి మద్దతు ఇచ్చినందుకు నజరానాగా ఆయనకు టిటిడి బోర్డు చైర్మన్ పదవి ఇచ్చారు సీఎం చంద్రబాబు.
ముక్కోటి ఏకాదశి ముందు రోజు తిరుపతి లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం, ఏర్పాట్లలో గందరగోళం... ఇవన్నీ కలిసి బి ఆర్ నాయుడు ప్రతిష్టను మంట కలిపాయి. ఆ తర్వాత తిరుమల జేఈవో వెంకయ్య చౌదరి తో నాయుడుకి పడకపోవడం, వాళ్ళిద్దరి మధ్య విభేదాలు రచ్చకెక్కడం.... చివరికి అవి సీఎం దగ్గరికి చేరడంతో బి ఆర్ నాయుడు మరింత అల్లరి అయ్యారు. ఈవో శ్యామలరావు తో కూడా నాయుడికి విభేదాలు ఉండేవి. వెంకయ్య చౌదరి జె ఈ ఓ గా వచ్చాక, నాయుడు పూర్తిగా జీరో అయ్యారు.
ముఖ్యంగా జే ఈ ఓ వెంకయ్య చౌదరి చంద్రబాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆ ఒక్క విషయాన్ని మరిచిపోయిన బిఆర్ నాయుడు, పోయి.... పోయి వెంకయ్య చౌదరి తోనే ఘర్షణకు దిగారు. వీటన్నిటికీ తోడుఇటీవల వైరల్ అయిన వివాదాస్పద వీడియోలు బి ఆర్ నాయుడు ప్రతిష్టను దిగజారిచెయ్. ఒక మహిళతో బి ఆర్ నాయుడు అభ్యంతరకరంగా కనిపించడం... వీడియోలోని మహిళ తనకి చాన్నాళ్లుగా కుటుంబ స్నేహితురాలని స్వయంగా బిఆర్ నాయుడు అంగీకరించడం... పెద్ద వివాదమే రేపింది. ఆ వీడియోలు మార్ఫింగ్ అని ఒకసారి.... ఆ వీడియోలు తనవేనని మరోసారి పొంతన లేని మాటలు చెప్పి మరింత ఇరుక్కుపోయారు బిఆర్.
ఈ వ్యవహారాన్ని వైసీపీ పూర్తిగా రాజకీయం చేసింది. బిఆర్ నాయుడు టీటీడీ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సిందేనని, వైసిపి నిత్యం డిమాండ్ చేస్తూనే ఉంది. బిఆర్ నాయుడు చేత రాజీనామా చేయిద్దామని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కూడా సూచించినట్లు సమాచారం. అయితే మొదట్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇందుకు ఒప్పుకోలేదు. రాజీనామా చేస్తే ఆ మహిళతో సంబంధం ఉన్నట్లేనని , తప్పు చేసినట్లు అంగీకరించినట్లు అవుతుందని, అంతేగాక వైసిపి మరికొందరు రాజీనామాకు డిమాండ్ చేసే అవకాశం ఉందని నాలుగు రోజులు అయితే ఈ వ్యవహారం చల్లబడిపోతుంది ఇక్కడితో వదిలేద్దామని టిడిపి పెద్ద సూచించారు. బిఆర్ నాయుడు పదవీకాలం ఎలాగో ముగిసిపోతుంది కనుక అప్పటివరకు, ఎవరు మాట్లాడకుండా ఉంటే వివాదం సమస్య పోతుందని భావించారు .దానికి విరుద్ధంగా వైసీపీ రోజు ఎక్కడో ఒకచోట ఆందోళన చేస్తూనే ఉంది.
బి ఆర్ నాయుడు విషయంలో ఇంట బయట ఒత్తిడి పెరిగిపోవడంతో.... ఆయన చేత రాజీనామా చేయించడమే మంచిదని సీఎం కార్యాలయం భావిస్తుంది. అయితే బి ఆర్ రాజీనామా చేయగానే, మహిళా విభాగంలో చిక్కుకున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరికొందరు రాజీనామాలు చేయాలని వైసిపి పట్టు పట్టవచ్చు అని, పార్టీలో ఒక వర్గం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికిప్పుడు తలనొప్పి తగ్గాలంటే బి ఆర్ నాయుడు ని ఏదో ఒక కారణం ద్వారా తప్పించడం మేలని మరికొందరి వాదన. పార్టీ సీనియర్ నేత కళా వెంకటరావు తనకు టీటీడీ బోర్డు చైర్మన్ పదవి ఇప్పించాలని లోకేష్ చంద్రబాబు ఇద్దరినీ కలిసి విన్నవించుకున్నారు. ఆయన విన్నపాలు, విజ్ఞప్తులు ఫలిస్తే, త్వరలోనే టిటిడి బోర్డు చైర్మన్ పదవికి బి.ఆర్ నాయుడు రాజీనామా చేయడం పక్కా.