టాలీవుడ్ సినీ ప్రియులకు ‘రంగస్థలం’ సినిమా అందించిన అనుభూతి అంత సులభంగా మర్చిపోలేనిది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన, స్టార్ డైరెక్టర్ సుకుమార్ అద్భుతమైన టేకింగ్, వీటన్నింటికీ తోడు రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన అద్భుతమైన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆ సినిమాను ఒక క్లాసిక్ గా నిలబెట్టాయి. అందుకే, మళ్లీ రామ్ చరణ్ - సుకుమార్ కాంబినేషన్లో సరికొత్త సినిమా అనౌన్స్ అవ్వగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త తెగ హల్చల్ చేస్తోంది. అదేమిటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుండి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తప్పుకుంటున్నారని, ఆయన స్థానంలో మరొకరిని తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
చిత్ర పరిశ్రమలో ఒక కాంబినేషన్ సక్సెస్ అయిందంటే.. తదుపరి చిత్రానికి కూడా అదే టీమ్ రిపీట్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటారు. సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్‌కు టాలీవుడ్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'ఆర్య' సినిమా నుండి నిన్నటి 'పుష్ప2' వరకు వీరిద్దరి కాంబోలో వచ్చినవన్నీ మ్యూజికల్ బ్లాక్బస్టర్లే. పుష్ప-2’ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మధ్య చిన్నపాటి గ్యాప్ వచ్చిందంటూ నెట్టింట ప్రచారం మొదలైంది. దీనికి తోడు, దేవిశ్రీ ప్రసాద్ త్వరలోనే హీరోగా కూడా ఒక కొత్త అవతారం ఎత్తబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ కారణాల వల్ల, రామ్ చరణ్‌తో సుకుమార్ చేయబోయే తదుపరి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌ను మార్చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఈ కాంబోలో రానున్న రెండో సినిమా ఫుల్ స్క్రిప్ట్ పక్కాగా లాక్ అవ్వడానికి మరికొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఏ సినిమాకైనా కథే ప్రాణం, ఆ కథే మ్యూజిక్ డైరెక్టర్‌ను నిర్ణయిస్తుంది. సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను నమ్ముతారు. రామ్ చరణ్ సినిమా పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, ఆ కథా నేపథ్యాన్ని బట్టి, దేవిశ్రీ ప్రసాద్‌ను కొనసాగించాలా లేదా కథకు తగినట్లు వేరే సంగీత దర్శకుడిని ఎంచుకోవాలా అనే దానిపై సుకుమార్ తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టమవుతోంది.రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఈ ముగ్గురి కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వాలనే మెగా అభిమానులు సైతం కోరుకుంటున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇలాంటి రూమర్లను నమ్మకూడదని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత సుకుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.