ఎన్టీఆర్ డ్రాగన్ లో రెండు లుక్స్ తో కనిపించబోతున్నాడు. కారనం వేసేది రెండు పాత్రలు.. ఇది ఆల్ మోస్ట్ అందరికి తెలిసిందే.. కాని ఇదే ఎన్టీఆర్ కోసం 150 లుక్స్ ప్లాన్ చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. గాడ్ ఆఫ్ వార్ మూవీలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండాలనే విషయంలో, ఈపాటికే తన 360 డిగ్రీస్ ఫోటోస్ తీసి, తన లుక్ టెస్ట్ వర్క్ మొదలు పెట్టింది త్రివిక్రమ్ టీం. ఇలాంటి టైంలో తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ సినిమా వార్త వైరలైంది. తన కొత్త మూవీకోసం రజినీ కాంత్ తాలూకు 83 లుక్స్ ని రెడీ చేశాడట డైరెక్టర్.. విచిత్రం ఏంటంటే, అంతకంటే రెండు రెట్లు 150 లుక్స్ తో త్రివిక్రమ్ ఇప్పుడు షాక్ ఇస్తున్నాడు.. ఈలుక్ టెస్ట్ తాలూకు వీడియోతోనే ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది.. ఇంతకి 150 లుక్స్ తో తేలిందేంటి? ఫైనల్ లుక్ ఓకే అయినట్టేనా?
డ్రాగన్ రెండు భాగాలతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బిజీ అయ్యాడు. తర్వాత దేవర సీక్వెల్ తో బిజీ కాబోతున్నాడు. కొరటాల శివ టెన్షన్ ని తగ్గించేలా డేట్లు కూడా ఇచ్చినట్టే అని తెలుస్తోంది. అయితే ఇప్పుడుహాట్ టాపిక్ అవుతోంది గాడ్ ఆఫ్ వార్ కోసం ఎన్టీఆర్ లుక్స్... ఔను వచ్చే ఏడాది ఎండ్ కి మొదలయ్యే ఈ సినిమాకోసం, అందులో ఎన్టీఆర్ వేసే పాత్రకోసం ఏకంగా 150 లుక్స్ రెడీ చేశాడట త్రివిక్రమ్.కథ విషయంలో, దాన్ని బన్నీదగ్గరకు తీసుకెళ్లటం విషయంలో త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ కి వివాదం జరిగిందన్నారు. వెన్నుపోటన్నారు.. తర్వాత నిర్మాతల జోక్యంతో కాంట్రవర్సీ కరిగిపోయింది. త్రివిక్రమ్ క్షమాపణతో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూల్ అయినట్టు వార్తల వరదొచ్చింది. అదటుంచితే, ఇప్పుడు ఫోకస్ అంతా గాడ్ ఆఫ్ వార్ పైనే పెట్టినట్టున్నాడు త్రివిక్రమ్.
అందుకే దసరా వరకు ఎన్టీఆర్ డ్రాగన్ గా, ఆ తర్వాత దేవర గా దాని సీక్వెల్ తో బిజీ అయ్యే తారక్ కోసం రెండేల్ల ముందే లుక్ టెస్ట్ చేస్తున్నాడు. గాడ్ ఆఫ్ వార్ నిజానికి ఓ మైథలాజికల్ డ్రామా... లార్డ్ సుబ్రహ్మన్యం ని బేస్ చేసుకుని రాసిన కథలో, ఎన్టీఆర్ కార్తికేయుడిగా కనిపించబోతున్నాడట. ఐతే దేవుడిగా కనిపిస్తాడా? దేవుడి అంశగా షాక్ ఇస్తాడా?ఇవేవి ఇంకా కన్ఫామ్ కాలేదు. కాని ఆ పాత్రకోసం తన లుక్ ఎలా ఉండాలో ఒకసారి లుక్ టెస్ట్ చేసి, 150 లుక్స్ రెడీ చేశాడట త్రివిక్రమ్. ఔను 360 డిగ్రీల యాంగిల్స్ లో ఎన్టీఆర్ త్రీడీ ఇమేజ్ తీసుకుని, తన మీద కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెస్ తో చాలా లుక్స్ రెడీ చేసినట్టుంది. మొత్తంగా 180 లో త్రివిక్రమే 30 ఫిల్టర్ చేసి, ఎన్టీఆర్ ముందు 150 లుక్స్ ఉంచాడట.
ఇంకా ఎన్టీఆర్ కాని, టోటల్ టీం కాని ఫైనల్ డిసీజన్ తీసుకోలేదు. ఇలాంటి టైంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా 83 లుక్స్ తో వార్తల్లో కొచ్చాడు. తనతో సిబి చక్రవర్తి తీయబోయే సినిమా కోసం 83 లుక్స్ ప్లాన్ చేశారట. అందులోటాప్ త్రీ సెలెక్ట్ చేసిన దర్శకుడు, ఫైనల్ లుక్ ని మాత్రం రజినీకాంత్ నిర్ణయానికే వదిలేశాడని తెలుస్తోంది. సో అచ్చం ఇలానే గాడ్ ఆఫ్ వార్ లో 150 లుక్స్ లో ఒక లుక్ ని ఎన్టీఆరే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది.. అదొచ్చాకే మోషన్ పోస్టర్ ని లాంచ్ చేస్తారని, అలా సినిమా ఎనౌన్స్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది.