ఉగాదాకే ఉస్తాద్…!

పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. నిజానికి ఈ సినిమా సమ్మర్ రేసులో వస్తుందని మనందరికీ తెలుసు

Post Published By: dialnews
Updated : 6 March 2026, 12:55 PM IST

పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' నుండి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. నిజానికి ఈ సినిమా సమ్మర్ రేసులో వస్తుందని మనందరికీ తెలుసు, కానీ ఇప్పుడు మేకర్స్ ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఉస్తాద్ ఒక వారం ముందే థియేటర్లలోకి దూసుకురాబోతున్నాడు! మొదట 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని మార్చి 26, 2026న రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఇప్పుడు మార్చి 19, 2026కి ప్రీపోన్ అయింది. అంటే మనం అనుకున్న దానికంటే వారం రోజుల ముందే భగత్ సింగ్ థియేటర్లలో రచ్చ చేయబోతున్నాడు.

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' మొదట మార్చి 19న రావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది. ఆ ఖాళీ అయిన స్లాట్‌ని మన ఉస్తాద్ తెలివిగా క్యాచ్ చేసుకున్నాడు. మార్చి 19న రిలీజ్ చేయడం వల్ల సినిమాకి ఉగాది పండగ అడ్వాంటేజ్ కూడా దొరుకుతుంది. లాంగ్ వీకెండ్ ప్లస్ హాలిడేస్.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం! రిలీజ్ డేట్ ఒకెత్తయితే, ఈ సినిమాలో జరిగిన ఒక సర్ప్రైజింగ్ మ్యూజిక్ అప్‌డేట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సాంగ్స్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ ఫ్యాన్స్‌ని ఊపేస్తున్నాయి. అయితే, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఒక చిన్న మార్పు జరిగింది.

డీఎస్పీ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల, మేకర్స్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్. తమన్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం రంగంలోకి దింపారు. 'గబ్బర్ సింగ్'కి డీఎస్పీ అదిరిపోయే మ్యూజిక్ ఇస్తే, ఇప్పుడు ఉస్తాద్ ఎలివేషన్లకి తమన్ తన మార్క్ బీజీఎమ్ తో నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సీన్స్ మరియు పవన్ చెప్పే డైలాగ్స్ ఈ సినిమాలో హైలైట్ కాబోతున్నాయి. "ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది" అని హరీష్ శంకర్ అన్న మాట నిజం కాబోతోందని మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే అర్థమవుతోంది. శ్రీలీల మరియు రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో నిర్మించారు.

Published : 
  • 6 March 2026, 12:55 PM IST