భార్యే సర్వస్వం అంటున్న భాయ్…!

టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అండ్ లవ్లీ కపుల్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి.

Post Published By: dialnews
Updated : 9 March 2026, 4:20 PM IST

టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అండ్ లవ్లీ కపుల్ అంటే అందరికీ గుర్తొచ్చే పేరు అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డి. ప్రస్తుతం అల్లు వారి ఇంట్లో డబుల్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఒకవైపు బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ పెళ్లి వేడుకలు జరుగుతుంటే, మరోవైపు ఐకాన్ స్టార్ తన వైవాహిక జీవితంలో 15 ఏళ్ళ మైలురాయిని చేరుకున్నారు. మార్చి 6, 2011న అల్లు అర్జున్-స్నేహ రెడ్డి వివాహం జరిగింది.

15 ఏళ్ళ తర్వాత కూడా వీరి బాండింగ్ ఇప్పటికీ కొత్తగా కనిపిస్తుంది. బన్నీ తన ఇన్స్టాగ్రామ్‌లో స్నేహతో ఉన్న ఒక అందమైన బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, "Happy Anniversary, Cutie. 15 years of togetherness. ఈ ప్రయాణం నీవు లేకుండా సాధ్యం అయ్యేది కాదు" అని ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చారు. స్నేహ కూడా తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హ, రెండు పెట్ డాగ్స్‌తో కూడిన అందమైన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేస్తూ, "ప్రేమతో నిర్మించుకున్న ఇల్లు, వెలకట్టలేని జ్ఞాపకాలు" అంటూ తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ యానివర్సరీని మరింత స్పెషల్‌గా మార్చడానికి అల్లు అర్జున్ తన భార్యకు ఒక లగ్జరీ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు.

సుమారు 1.81 కోట్ల రూపాయల విలువైన Mercedes-AMG CLE 53 కారును స్నేహ రెడ్డికి బహుమతిగా ఇచ్చారు. అల్లు అరవింద్ సమక్షంలో బన్నీ ఈ కారు కీస్‌ని స్నేహకు అందజేయడం, దానికి కృతజ్ఞతగా స్నేహ తన భర్తకు ఒక స్వీట్ కిస్ ఇవ్వడం నెట్టింట వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అందరూ "రియల్ లైఫ్ పుష్పరాజ్ తన శ్రీవల్లికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ యానివర్సరీ రోజే అల్లు శిరీష్ మరియు నయనిక రెడ్డిల వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అల్లు అర్జున్ తన 15వ యానివర్సరీని తన తమ్ముడి పెళ్లి వేడుకల మధ్య జరుపుకోవడం విశేషం. ఈ వేడుకకు రామ్ చరణ్, ఉపాసన, సూర్య వంటి స్టార్స్ కూడా హాజరయ్యారు. పెళ్లిలో అల్లు ఫ్యామిలీ అంతా ఐవరీ కలర్ డ్రెస్సుల్లో మెరిసిపోతూ 15 ఏళ్ళ ప్రయాణాన్ని ఎంజాయ్ చేశారు.

Published : 
  • 9 March 2026, 4:20 PM IST