Allu Arjun: పుష్ప 2 టీజర్ లో సమంత కనిపిస్తుందా..?

పుష్ప 2 మూవీ టీజర్ 55 సెకన్లతో కట్ చేసింది ఫిల్మ్ టీం. ఈనెల 8న బన్నీ బర్త్ డే అవటంతో ఒకరోజు ముందు అంటే ఏప్రిల్ 7కే టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఐతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ టీజర్ లో రష్మిక విజువల్ ఉండే ఛానస్ లేదట. కాని ఊకొట్టమనే లేడీ సమంతని మాత్రం చూపించబోతున్నారు.

Post Published By: Srikar Creator
Updated : 3 April 2023, 6:30 PM IST

పుష్ప 2 లో సమంత కూడా స్పెషల్ రోల్ వేస్తోందని తెలుస్తోంది.మొన్నటి వరకు ఇది పుకారే, కాని ఇప్పుడిది నిజం కాబోతోంది. ఇందులో సమంత పాత్ర పుష్పరాజ్ కి సాయం చేసే రికార్డింగ్ డాన్సర్ గా ఉండబోతోందని తెలుస్తోంది

పుష్ప రాజ్ భార్యగా రష్మక నటిస్తుంటే, అన్ అఫీషియల్ లవర్ గా సమంత రోల్ ఉండబోతోందట. మొత్తానికి మొదటి భాగంలో ఊ అంటావా అన్న పాత్ర, రెండో భాగంలో బన్నీతో ఊకొట్టించేలా ఉంది. ఐతే క్రాక్ లో విలన్ ఓపెన్ గాల్ ఫ్రెండ్ గా వరలక్ష్మీ వేసినటువంటీ పాత్రే ఇక్కడ పుస్ప 2 లో సమంత వేస్తోందట. అదీ కూడా 15 నిమిషాలే ఉంటుందని తెలుస్తోంది.

Published : 
  • 3 April 2023, 6:30 PM IST