ఆగస్టు 15 ఖడ్గం రీ-రిలీజ్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల నరనరాల్లో దేశభక్తి భావనను రగిలించి, థియేటర్లలో రక్తం ఉడికించేలా చేసిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో 'ఖడ్గం' ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది.

Post Published By: dialnews
Updated : 12 August 2026, 3:15 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. కానీ ప్రేక్షకుల నరనరాల్లో దేశభక్తి భావనను రగిలించి, థియేటర్లలో రక్తం ఉడికించేలా చేసిన ప్రతిష్టాత్మక చిత్రాల్లో 'ఖడ్గం' ఖచ్చితంగా మొదటి వరుసలో ఉంటుంది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.ప్రస్తుతం టాలీవుడ్‌లో పాత ఐకానిక్, సూపర్ హిట్ చిత్రాలను మళ్లీ థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేసే హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే, అలనాటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్, దేశభక్తి సంచలనం 'ఖడ్గం' సినిమా కూడా మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది.

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలతో, ఈ ఆగస్టు 15న 'ఖడ్గం' చిత్రాన్ని మరోసారి థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 15 లేదా జనవరి 26 వచ్చాయంటే చాలు.. బుల్లితెరపై 'ఖడ్గం' సినిమా ప్రసారం కావడం ఆనవాయితీగా మారింది. అయితే ఈసారి బుల్లితెరకే పరిమితం కాకుండా, థియేటర్లలో బిగ్ స్క్రీన్ పై డాల్బీ సౌండింగ్‌తో ఈ చిత్రాన్ని వీక్షించే అరుదైన అవకాశాన్ని అభిమానులకు అందించబోతున్నారు.2002వ సంవత్సరంలో థియేటర్లలోకి వచ్చిన 'ఖడ్గం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కేవలం ఒక సాధారణ దేశభక్తి చిత్రం మాత్రమే కాదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ చిత్రంలో అనేక రకాల భావోద్వేగాలను సమపాళ్లలో మేళవించి తెరకెక్కించారు.

మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో 'ఖడ్గం' ఒక మైలురాయి. ఎలాగైనా సినిమాలో హీరో కావాాలని తపించే 'కోటి' పాత్రలో ఆయన జీవించారు. "ఒక్క అవకాశం.." అంటూ ఆయన చెప్పే డైలాగులు, పండించిన కామెడీ, ఎమోషన్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్‌గా, దేశరక్షణే ధ్యేయంగా పనిచేసే ఎసిపి రాధాకృష్ణ పాత్రలో శ్రీకాంత్ విశ్వరూపం చూపించారు. ఆయన సీరియస్ లుక్, యాక్షన్ సీన్స్, దేశభక్తి పూరిత సంభాషణలు సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. మానవత్వమే మతం అని నమ్మే ఒక సామాన్య ఆటో డ్రైవర్ అమ్జద్ పాత్రలో నటుడు ప్రకాష్ రాజ్ ఒదిగిపోయారు. ఒక వైపు తన మతం పట్ల నిందలు ఎదుర్కొంటూనే, మరోవైపు దేశం పట్ల తనకున్న భక్తిని నిరూపించుకునే సన్నివేశాల్లో ఆయన నటన కంటివెంట నీరు తెప్పిస్తుంది. 'ఖడ్గం' సినిమా విజయంలో రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం అత్యంత ముఖ్యమైన హైలైట్. ఏళ్లు గడుస్తున్నా 'ఖడ్గం' సినిమాలోని ఎమోషన్, గూస్‌బంప్స్ ఇచ్చే సీన్స్ ఇప్పటికీ ఫ్రెష్‌గానే ఉంటాయి. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా థియేటర్లలో విడుదలవుతున్న ఈ చిత్రాన్ని పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయడానికి సినీ ప్రేమికులు, రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 12 August 2026, 3:15 PM IST