900,1600, 2000 కోట్ల వెనక.. నిజం నికృష్టం…!

900 కోట్లు, 1600 కోట్లు, 2000 కోట్లు ఇవన్నీ నెంబర్స్ కాదు.. నిజాలు.. నిజం నికృష్టంగా ఉంటుందని నిరూపించే వసూళ్లు.. త్రిబుల్ ఆర్ మూవీ లైఫ్ టైం వసూల్లను వన్ వీక్ లో ధురందర్ 2 రాబట్టేసింది. సినిమా అంటే ఇలానే ఉండాలి.. ఇంతే ఉండాలని రెండున్నర గంటల ఫార్ములా వాడే

Post Published By: dialnews
Updated : 25 March 2026, 10:00 PM IST

900 కోట్లు, 1600 కోట్లు, 2000 కోట్లు ఇవన్నీ నెంబర్స్ కాదు.. నిజాలు.. నిజం నికృష్టంగా ఉంటుందని నిరూపించే వసూళ్లు.. త్రిబుల్ ఆర్ మూవీ లైఫ్ టైం వసూల్లను వన్ వీక్ లో ధురందర్ 2 రాబట్టేసింది. సినిమా అంటే ఇలానే ఉండాలి.. ఇంతే ఉండాలని రెండున్నర గంటల ఫార్ములా వాడే వాళ్లందరూ నోల్లు మూసుకునేలా చేశాయి మూడు సినిమాలు. యానిమల్, పుష్ప2, ఇప్పుడు వచ్చిన ధురందర్ 2.. మన బాహు బలి 2 రికార్డులు అలానే ఉన్నాయి... కల్కీ రికార్డుని కూడా ధురందర్ ఇంకా టచ్ చేయలేదు. కాని ఒకటి మాత్రం నిజం.. ధురందర్ , యానమల్ హిందీ మూవీలే కావొచ్చు.. పుష్పరాజ్ కొందరికి నచ్చకపోయుండొచ్చు.. ఐనా ఈ మూడు సినిమాలు ఇండియా మొత్తం, చాలా మంది మాడు పగలగొట్టే నిజం తేల్చాయి... ఒకటి సినిమా డ్యూరేషన్ ఎన్నిగంటలని కాదు.. బాక్సాఫీస్ లో బుల్లెట్ దిగిందా లేదా? అదే నిజం.. 2000 కోట్ల దంగల్ రికార్డు బద్దలైపోతున్న నిజం..

తెలుగు సినిమా,హిందీ సినిమా అన్న డిబెట్ కాసేపు పక్కన పెడదాం.. ధురందర్ 2 ఓ గుడ్డలు చించుకునేంత గొప్పగా ఉందని కాదు కాని.. రియల్ కంటెంట్ ని కమర్శియల్ మూవీగా ఆదిత్య ధర్ చూపిస్తే, అది మూడున్నర, నాలుగు గంటల లెంథ్ ఉన్నం జనం చూశారు. చూస్తున్నారు. 3 రోజుల్లో 500 కోట్ల వసూళ్లు గిఫ్ట్ గా ఇచ్చారు. సీన్ చూస్తే వారంలో వెయ్యి కోట్లు వచ్చేలా ఉన్నాయి..ఇదే కాదు 900 కోట్ల రాబట్టిన యానిమల్, 1600 కోట్లు రాబట్టిన పుష్ఫ2 కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి...మూడుగంటలు, మూడున్నర గంటలు సినిమా తీస్తే ఎవరూ చూడరు. బోర్ కొడుతుంది.. అవి ఫ్లాపౌతాయి... కత్తిరంచండి.. ఇలాంటి మాటలే ఎప్పడూ విన్నాం, వింటున్నాం. కాని పావుతక్కువ నాలుగు గంటల నిడివితో వచ్చిన యానిమల్ 900 కోట్లు రాబట్టింది.

వెయ్యికోట్ల వసూళ్ల కొద్దిలో మిస్. అంతా తిట్టిపోశారు. ఇదేం సినిమా అన్నారు. మరీ సీరియల్ లాగా ఇంతలెంథేంటని రివ్యూలు రాశారు. కాని ఏమైంది 900 కోట్ల వరదని అవేవి ఆపలేకపోయాయి. పుష్ప 2 కూడా మూడున్నర గంటల నిడివా? సుకుమార్ కి మైండ్ దొబ్బిందా అన్నారు. అదేమైంది... 1600 కోట్లు రాబట్టింది. కొద్దిలో మిస్ కాని, లేదంటే బాహుబలి 2 రికార్డు బ్రేక్ అయ్యేది.కాని ఇప్పడు ధురందర్ సీక్వెల్ పావుతక్కవ నాలుగు గంటలున్నా, కదలకుండా,మెదలకుండా జనాలు థియేటర్స్ లోని చైర్ల అంచుల్లో కళ్లప్పగించి చూస్తున్నారు.. కంటెంట్ లో దమ్ముండాలి కాని, దుమ్మ కల్లల్లో పడుతున్నా, కళ్లు తెరుచుకునే ఉంటారు.

యానిమల్, పుష్ప 2, ధురందర్ 2 తో ఇదే తేలింది. సినిమా అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలనే లెక్కలన్నీ తొక్కలో లెక్కలనే మాటే నిజమౌతోంది.ఒక్కసారి ఊహించండి త్రిబుల్ ఆర్ లాంటి హిట్ మూవీ లైఫ్ టైంలో రాబట్టిన యూఎస్ వసూళ్లని ధురందర్ 2, వన్ వీక్ లో రాబట్టిందంటే ఏంటర్ధం... లెంథ్ వల్ల నష్టం ఉంటే యూఎస్ లో ధురందర్ 2 కి త్రిబుల్ ఆర్ టోటల్ యూఎస్ కలెక్షన్స్ అయిన 14.5 మిలయన్ డాలర్స్, వన్ వీక్ లోపే వచ్చాయి. 15.2 మిలియన్ యూఎస్ డాలర్స్ తో ధురందర్ 2 దూసుకెళుతోంది.. సీన్ చూస్తే బాహుబలి 2, కల్కీ 2 రికార్డులు బద్దలయ్యేలా ఉన్నాయి. ధంగల్ తాలూకు 2 వేల కోట్ల వసూళ్లు ఇక మీదట ధురందర్ 2 కి ఏమాత్రం పెద్ద టార్గెట్టే కాదనుకోవాల్సి వస్తోంది.

Published : 
  • 25 March 2026, 10:00 PM IST