శ్రీనివాస్ weds కావ్య రెడ్డి…!

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ - రష్మిక, నిన్న అల్లు శిరీష్ - నయనిక.. ఇలా వరుసగా మన యంగ్ హీరోలు

Post Published By: dialnews
Updated : 10 March 2026, 11:43 AM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ - రష్మిక, నిన్న అల్లు శిరీష్ - నయనిక.. ఇలా వరుసగా మన యంగ్ హీరోలు ఒక ఇంటివారవుతున్నారు. ఇప్పుడు ఇదే లిస్ట్‌లోకి మాస్ అండ్ యాక్షన్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయారు. అవును, మీరు విన్నది నిజమే! బెల్లంకొండ వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి. మార్చి 8, 2026న ఆయన నిశ్చితార్థం అత్యంత ఘనంగా జరిగింది.

బెల్లంకొండ శ్రీనివాస్ మనసు దోచుకున్న ఆ అమ్మాయి పేరు కావ్య రెడ్డి. ఈమె సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాదు. కావ్య రెడ్డిది ఒక ప్రతిష్టాత్మకమైన కుటుంబ నేపథ్యం. ఆమె తాతగారు గతంలో జడ్జిగా పని చేయగా, తండ్రి ప్రముఖ న్యాయవాది అని తెలుస్తోంది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన కావ్య రెడ్డి, బెల్లంకొండ కుటుంబానికి ఎప్పటి నుంచో సుపరిచితురాలే. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారని, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెద్దల అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

ఈ నిశ్చితార్థ వేడుక మార్చి 8వ తేదీన హైదరాబాద్‌లోని బెల్లంకొండ నివాసంలో అత్యంత ప్రైవేట్‌గా జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అతి తక్కువ మంది సినీ ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరోయిన్ సంయుక్త వంటి సన్నిహితులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

సాయి శ్రీనివాస్ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోతుంటే, కావ్య రెడ్డి పద్ధతైన చీరకట్టులో అందరినీ ఆకట్టుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల 'కిష్కిందపురి' సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఆయన, ఇప్పుడు 'టైసన్ నాయుడు' మరియు 'హైందవ' వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయితే, ఈ సినిమాల షూటింగ్స్ గ్యాప్‌లోనే పెళ్లి పీటలెక్కాలని ప్లాన్ చేస్తున్నారు. సమాచారం ప్రకారం, వీరి వివాహం మే లేదా జూన్ 2026లో అత్యంత వైభవంగా జరిగే అవకాశం ఉంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ తన కుమారుడి పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్‌గా చేయాలని భావిస్తున్నట్లు టాక్.

Published : 
  • 10 March 2026, 11:43 AM IST