మీరు బూతులు మాట్లాడొచ్చు.. తను మాట్లాడితే…!

బూతు మాట్టాడితే తప్పు.. కాని మాట్లాడిందేదైనా బూతైతే ఏం చేయాలి... ప్రజెంట్ సాయిపల్లవి పరిస్తితి అంత ధారుణంగా ఉంది. బాహుబలి నుంచి నార్త్ లో పరిస్థితులు మారాయి.. సౌత్ వాల్లంటే భయం, భక్తి, గౌరవం వాళ్లకి పెరిగాయన్నారు.

Post Published By: dialnews
Updated : 29 April 2026, 6:15 PM IST

బూతు మాట్టాడితే తప్పు.. కాని మాట్లాడిందేదైనా బూతైతే ఏం చేయాలి... ప్రజెంట్ సాయిపల్లవి పరిస్తితి అంత ధారుణంగా ఉంది. బాహుబలి నుంచి నార్త్ లో పరిస్థితులు మారాయి.. సౌత్ వాల్లంటే భయం, భక్తి, గౌరవం వాళ్లకి పెరిగాయన్నారు. కాని కుళ్లు, కోపం, అసూయ అలానే ఉన్నాయని తేలింది. సాయిపల్లవిని తోటి హీరోలు ఓదార్చాల్సినంతగా తనని ఆటాడుకుంటున్నారు. ట్రోలింగ్స్ లిమిట్ దాటాయి.. తనేం స్కిన్ షో చేయలేదు. బూతు సినిమాల్లో నటించలేదు. డ్రగ్సో లేదంటే మందో తీసుకుని దారి తప్పలేదు.. ఐనా లేడీ టెర్రరిస్ట్ గా తనని మార్చేశారు.. ఒక్క మాట ఒకే ఒక్క మాట తను అన్నందుకు, వరుసగా తూటాలు పేలుస్తున్నారు.. హిందీ హీరోయిన్లు ఎన్ని బూతులు మాట్లాడినా పట్టించుకోని నార్త్ జనం, సాయిపల్లవి బూతు మాట్లాడకున్నా బూతుల రాణిగా మార్చేశారు.. ఎందుకు? తనని ఈ రేంజ్ లో ఎందుకు టార్గెట్ చేశారు?

సాయిపల్లవి దిక్కుమాలిన స్టారా? తప్పుడు మనిషా..? డ్రగ్స్ తీసుకుంటూ దొరికిందా? ఇలాంటీ డౌట్లు రావటానికి కారణం, తనమీద జరుగుతున్న ట్రోలింది. తనేం తప్పుచేసింది? ఏ బాలీవుడ్ హీరోయిన్ మీద ఈ స్థాయిలో దాడి జరగలేదు... సౌత్ లో ఎన్నడూ సాయిపల్లవిని ఎవరు పెద్దగా ట్రోలింగ్ చేసింది లేదు. మరీ ఇంతలా అయితే ఎన్నడూ జరగలేదు.ఇలాంటి ఆవిడ మన సీతాదేవి పాత్ర చేస్తుందా? ఇలాంటి వాళ్లని తీసుకోవటానికి దర్శకుడికి మైండ్ లేదా? ఇలా డైరెక్ట్ స్పీచ్ లోనే సాయిపల్లవి మీద మాటల దాడి పెరిగింది. అంతా నార్త్ ఇండియాలోనే... ప్రజెంట్ తను హిందీ రామాయనంలో సీత పాత్ర వేస్తోంది.. అమీర్ ఖాన్ కొడుకు తో ఏక్ దిన్ మూవీ చేసింది. ఈ వారం అంటే మే 1 న ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఐతే ఈ మూవీ ప్రమోషన్ లో భఆగంగా తను మాట్లాడిన మాటే, తనమీద తూటాగా మారింది.

సాయి పల్లవి ఒకే ఒక్క మాట ఛాహతీ అని కాకుండా ఛాహతా అంది అంతే,, ఇక అంతా తగులుకున్నారు.. హిందీలో అబ్బాయి అయితే కోరకుంటున్నా అనటానికి చాహాతా అని, అమ్మాయి అయితే చాహ్ తీ హూ అని అనటం గ్రామర్.. సాయిపల్లవికి అంతగా హిందీ రాదు.. ఒకవేల వచ్చినా, రీసెంట్ గా నేర్చుకున్నా, లింగ బేదం అంటే ఆడకి ఒకరకంగా, మగకి ఇంకోరకంగా హిందీలో పలకటం అనేదగ్గరా చాలా వరకు సౌత్ ఇండియన్స్ కన్ ఫ్యూజ్ అవటం కామన్.అక్కడ పట్టుకుని, ఈ మాత్రం హిందీ రాదు, ఈమెనెందుకు బాలీవుడ్ లో తీసుకున్నారని, అది కూడా డీసెంట్ గా కాదు, గట్టిగానే ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ముంబై నుంచి వచ్చిన బ్యాచ్ కనీసం ఒక్కముక్కైనా తెలుగు రాకున్నా, తెలుగుని నలిపేస్తూ డైలాగ్స్ చెప్పినా, కొన్ని సార్లు మామూలు పదాలని బూతులేమో అనుకునేలా చెప్పినా, ఇక్కడ అలాంటి ట్రోలింగ్ జరిగింది లేదు.

కానీ చిన్న పదంలో గ్రమేటికల్ మిస్టేక్ ఉంటే, దానికి సాయిపల్లవిని మామూలుగా కాదు గట్టిగా తిట్టిపోస్తున్నారు. అయినా ఒక సౌత్ ఇండియా హిందీ నేర్చుకుని హిందీ మూవీ చేస్తుంటే, మెచ్చుకోకుండా, నొచ్చుకుంటున్నారు. అదే హిందీ హీరోయిన్లలో కొందరకి హిందీనే రాదు.. ఇంకొందరు డ్రగ్స్ అండ్ క్రైమ్స్ లో దొరికినా ఇంతలా ట్రోలింగ్ జరిగినట్టు కనిపించలేదు. కాని సాయిపల్లవిని మాత్రం హిందీ రామాయణంలో సీత పాత్ర ఇస్తారా? ఇలాంటి లేడీ అవసరమా? అని అదేతో తప్పుడు పని చేసిన వ్యక్తికి, సీతపాత్ర ఇచ్చుడేంది అన్నట్టు ట్రోల్ చేస్తున్నారు. అంటే సీతైతే హిందీ మాట్లాడాలా? అసలు రామాయన కాలంలో హిందీ ఉందా? అంతా సంస్క్రుతమే కదా? ఈ మాత్రం కామన్ సెన్స్ లేని బ్యాచ్, ఇంకా సౌత్ జనాలంటే అసూయతో రగిలిపోతున్నారనటానికి ఈ ఎగ్జాంపుల్ చాలు.. ఎన్ని బాహుబలిలొచ్చినా, నార్త్ లో సౌత్ మీదున్న అసూయ, చిన్నచూపురూంలో ఇలా బయటపడుతూనే ఉంటుంది.

Published : 
  • 29 April 2026, 6:15 PM IST