బ్రేకింగ్: జత్వాని కేసుపై చంద్రబాబు కీలక నిర్ణయం

ముంబై హీరోయిన్... నటి జత్వని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుని రాష్ట్ర ప్రభుత్వం సిఐడీకి అప్పగించింది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తును ప్రారంభించనున్న సీఐడీకి కేసు వివారాలను ఇబ్రహీంపట్నం పోలీసులు అందించే అవకాశం ఉంది.

Post Published By: Vencateshg
Updated : 21 October 2024, 2:04 PM IST

ముంబై హీరోయిన్... నటి జత్వని కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుని రాష్ట్ర ప్రభుత్వం సిఐడీకి అప్పగించింది. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో కేసు దర్యాప్తును ప్రారంభించనున్న సీఐడీకి కేసు వివారాలను ఇబ్రహీంపట్నం పోలీసులు అందించే అవకాశం ఉంది. నటి జత్వని పై వేధింపులు,అక్రమ కేసు నమోదు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారులు సీతారామాంజనేయులు,కాంతి రాణా,విశాల్ గున్నిలను విచారించే అవకాశం ఉంది.

కాగా ఇప్పటికే కాంతి రాణా,విశాల్ గున్ని,ఎసిపి హనుమంతరావు, సీఐ సత్యనారాయణ సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే కొందరిని అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇక జత్వాని ఐఫోన్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేసిన వ్యవహారంలో కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

Published : 
  • 21 October 2024, 2:04 PM IST