ఎన్నికలు Vs విడాకులు…!

కోలీవుడ్ సూపర్ స్టార్, ప్రస్తుతం రాజకీయాల్లో ‘తమిళ వెట్రి కళగం’ అధినేతగా బిజీగా ఉన్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకవైపు ఎన్నికల ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా దూసుకుపోతున్న విజయ్‌కి, మరోవైపు తన భార్య సంగీత నుంచి ఎదురవుతున్న విడాకుల

Post Published By: dialnews
Updated : 21 April 2026, 3:20 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్, ప్రస్తుతం రాజకీయాల్లో ‘తమిళ వెట్రి కళగం’ అధినేతగా బిజీగా ఉన్న దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఒకవైపు ఎన్నికల ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా దూసుకుపోతున్న విజయ్‌కి, మరోవైపు తన భార్య సంగీత నుంచి ఎదురవుతున్న విడాకుల వ్యవహారం పెను సవాలుగా మారింది. 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పక్కన పెట్టి ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన విజయ్‌కు, ఈ వ్యక్తిగత వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. చాలా కాలంగా విజయ్ - సంగీత విడివిడిగా ఉంటున్నారనే ప్రచారం ఉన్నప్పటికీ, ఇప్పుడు అది కోర్టు మెట్లెక్కింది. సంగీత తన భర్త నుంచి విడాకులు కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. విజయ్‌కి ఒక ప్రముఖ నటితో వివాహేతర సంబంధం ఉందనే విషయాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ ఇంట్లో తనకు ఉండే కనీస హక్కులు కూడా లేకుండా చేస్తున్నారని ఆమె ఆరోపించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో చెంగల్పట్టు కోర్టు ఈ కేసును విచారణకు స్వీకరించింది. ఏప్రిల్ 20వ తేదీన విచారణకు హాజరు కావాలని విజయ్‌కి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై ఉన్నందున, తాను ఆన్‌లైన్ ద్వారా విచారణకు హాజరవుతానని విజయ్ కోర్టును కోరారు. ఎన్నికల సమయంలో ఈ వివాదం కొనసాగడం తన రాజకీయ భవిష్యత్తుకు, ఇమేజ్‌కు భంగం కలిగిస్తుందని భావిస్తున్న విజయ్.. ఈ సమస్యను త్వరగా పరిష్కరించుకోవాలని చూస్తున్నారు. పరస్పర అంగీకారంతో విడిపోయేందుకు చర్చలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే, విడాకుల సెటిల్మెంట్ కింద సుమారు 250 కోట్ల రూపాయలు ఇవ్వాలని సంగీత డిమాండ్ చేస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తనతో పాటు తన కుమారుడు, కుమార్తె భవిష్యత్తు కోసం కూడా సెటిల్మెంట్ ఉండాలని ఆమె పట్టుబడుతున్నారు.

మరోవైపు, విజయ్ దీనికి పూర్తిస్థాయిలో అంగీకరించలేదని తెలుస్తోంది. విజయ్ కేవలం 35 కోట్ల రూపాయలు ఇచ్చి, పిల్లల బాధ్యతను తానే తీసుకుంటానని ప్రతిపాదించినట్లు సమాచారం. మరి ఈ ఇద్దరి మధ్య డీల్ ఎక్కడ కుదురుతుంది? కోర్టు తీర్పు ఎలా ఉండబోతుంది? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకువస్తానని శపథం చేసిన విజయ్‌పై విమర్శలు చేయడానికి ఆయన ప్రత్యర్థులు ఈ విడాకుల అంశాన్ని అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. ద్రవిడ రాజకీయ దిగ్గజాలైన DMK మరియు AIADMKలను ఎదుర్కోవడం విజయ్‌కి అంత సులభం కాదు. ఇలాంటి సమయంలో వ్యక్తిగత జీవితం గురించి వస్తున్న వార్తలు ప్రజల్లో ఎలాంటి ముద్ర వేస్తాయో చూడాలి. మరోవైపు,సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల ప్రకారం నటి త్రిషతో ఉన్న సాన్నిహిత్యమే ఈ వివాదానికి మూలమని కొందరు ప్రచారం చేస్తున్నారు.
ఎన్నికల పోలింగ్ ముగిసేలోపే ఈ రచ్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని విజయ్ లీగల్ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
విజయ్ తన ఇమేజ్‌ను కాపాడుకుని రాజకీయాల్లో సక్సెస్ అవుతారా? లేక ఈ విడాకుల సెటిల్మెంట్ ఆయన కెరీర్‌పై ప్రభావం చూపుతుందా? తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Published : 
  • 21 April 2026, 3:20 PM IST