విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లిపై తప్పుడు ప్రచారం.. వెడ్డింగ్ అక్కడే.. భారీ ప్లానింగ్..!

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు

Post Published By: dialnews
Updated : 2 February 2026, 9:55 PM IST

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ పెయిర్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 2న వీళ్ళ వివాహం జరిగిపోయిందంటూ ఒక మార్ఫింగ్ వీడియో రీల్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. అయితే అది కేవలం ఫ్యాన్ మేడ్ వీడియో అని, అందులో ఎటువంటి నిజం లేదని తేలడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. కానీ ఈ వార్త ఆగిపోలేదు, పైగా మరింత కొత్త పుకార్లకు ఆజ్యం పోసింది. తాజా సమాచారం ప్రకారం ఈ జంట పెళ్లికి మరో కొత్త ముహూర్తం తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 26న విజయ్, రష్మిక ఒక్కటి కాబోతున్నారని గట్టిగా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం విజయ్ పిఆర్ టీం నుంచి కూడా వచ్చేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీళ్ళ వివాహం జరగనుందని, దీనికోసం ఇరువురి కుటుంబ సభ్యులు ఇప్పటికే వెడ్డింగ్ ప్లానింగ్స్‌లో బిజీగా ఉన్నారని తెలుస్తుంది.

ఇప్పటికే పెళ్లి షాపింగ్ కూడా షురూ చేసారు విజయ్, రష్మిక. కేవలం అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుందని తెలుస్తుంది. అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఇండస్ట్రీ నుంచి విజయ్, రష్మిక పెళ్లికి హాజరు కానున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. వీరిద్దరి నిశ్చితార్థం ఇప్పటికే చాలా సైలెంట్‌గా జరిగిపోయింది. ఎవరికీ తెలియకుండా కేవలం కుటుంబం మధ్య ఉంగరాలు మార్చుకున్నారు.. పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతున్నా.. ఇక్కడ కూడా కొద్దిమందికి మాత్రమే ఎంట్రీ ఉండబోతుంది. టాలీవుడ్ నుంచి ఎంతమంది వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ వార్తలపై అటు విజయ్ కానీ, ఇటు రష్మిక కానీ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ తరచుగా వీళ్ళిద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్లడం, ఒకే ఇంట్లో ఉన్నట్లు ఫోటోలు లీక్ అవ్వడం.. ఇవన్నీ ఓ పద్దతి ప్రకారమే చేసారు ఈ జోడీ.

వీళ్ళ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2018లో గీతగోవిందం.. 2019లో డియర్ కామ్రేడ్ వంటి సినిమాల్లో ఇద్దరి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. అప్పటి నుంచే ఈ జోడీ రియల్ లైఫ్‌లో కూడా ఒక్కటైతే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్క్రీన్ మీద పండించిన మ్యాజిక్, ఇప్పుడు రియల్ లైఫ్ వెడ్డింగ్‌గా మారబోతుంది. ఇక కెరీర్ పరంగా చూస్తే, దాదాపు ఆరేళ్ళ విరామం తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ సెట్ అయ్యింది. రాహుల్ సంక్రీత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం రణబాలిలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఓ పక్క షూటింగ్ బిజీలో ఉంటూనే, మరోపక్క పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇద్దరు. పెళ్లి కోసం చిన్న బ్రేక్ తీసుకున్నా.. వెంటనే మళ్లీ షూట్‌కు వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు రౌడీ బాయ్. రణబాలి సెప్టెంబర్ 11న, రౌడీ జనార్థన డిసెంబర్‌లో రానున్నాయి. ఇక రష్మిక మైసాతో త్వరలోనే రాబోతున్నారు.

Published : 
  • 2 February 2026, 9:55 PM IST