టాలీవుడ్ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్ల మాఫియా నడుపుతున్నారా..? అసలు ఎన్టీఆర్‌కే తెలియకుండా తెర వెనుక ఏం జరుగుతోంది..? అభిమాన సంఘాల ముసుగులో దొంగల ముఠాలు ఎంటర్ అయ్యాయా..? లేక ఎన్టీఆర్‌ను ప్రాణంగా ప్రేమించే అసలైన ఫ్యాన్స్‌లోనే కొందరు దారితప్పారా..? తన పేరు వాడుకుంటూ కోట్ల రూపాయలు గుంజుతున్నారనే విషయాన్ని తారక్ ఎలా కనిపెట్టారు..? అంతా బానే ఉంది కానీ.. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వకుండా కేవలం ఒక ప్రెస్ నోట్, లేఖ మాత్రమే ఎన్టీఆర్ ఆఫీస్ ఎందుకు రిలీజ్ చేసింది..? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి..? అసలు మ్యాటర్ ఏంటంటే.. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్‌లోనే గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపే కొందరు కేటుగాళ్లు సీన్‌లోకి ఎంటర్ అయ్యారు. ఎన్టీఆర్ పేరు మీద ఒక భారీ ఛారిటీ ప్రోగ్రామ్ చేస్తున్నామని, దాదాపు 100 కోట్ల రూపాయల బడ్జెట్‌తో పెద్ద పెద్ద సామాజిక కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నామని సోషల్ మీడియాలో కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. తారక్ పేరు చెప్పి విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. "ఎన్టీఆర్ గారే స్వయంగా ఈ ఛారిటీ రన్ చేస్తున్నారు" అంటూ ఫ్యాన్స్ గ్రూపుల్లో నమ్మించి, గూగుల్ పే, ఫోన్ పే, బ్యాంక్ అకౌంట్ నంబర్లు పెట్టి భారీగా డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేశారు.
ఇక్కడ మనకొచ్చే మెయిన్ డౌట్.. ఇది అసలైన ఫ్యాన్స్ చేసిన పనా..? లేక దొంగల ముఠానా..? ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. హీరోల మీద ఉండే పిచ్చితో ఫ్యాన్స్ అసోసియేషన్ నడిపే కొందరు లోకల్ లీడర్లు, తమ సొంత లాభాల కోసం ఇలా దారితప్పినట్లు తెలుస్తోంది. మరికొందరు అనామకులు ఫ్యాన్స్ ముసుగు వేసుకుని ఈ వసూళ్ల దందాలోకి దిగారు. ఈ విషయం ఎన్టీఆర్ పిఆర్ టీమ్ దృష్టికి ఎలా వచ్చిందంటే.. ఈ వంద కోట్ల ఛారిటీ ఫేక్ పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి.నిజమైన అభిమానులు కొందరు.. "అన్నా.. మీరు 100 కోట్లతో ఛారిటీ చేస్తున్నారట కదా, మా వంతుగా మేము కూడా డొనేషన్స్ ఇచ్చాం" అంటూ ఎన్టీఆర్ పర్సనల్ స్టాఫ్‌కు మెసేజ్‌లు పంపడంతో తారక్ ఆఫీస్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇలాంటి ప్రమోషన్స్ మేము అస్సలు స్టార్ట్ చేయలేదని గుర్తించి షాక్ అయ్యారు. ఇప్పుడు అందరినీ వేధిస్తున్న పెద్ద ప్రశ్న.. ఈ వసూళ్ల దందాపై పోలీసులు యాక్షన్ తీసుకోకుండా కేవలం ఒక స్టేట్‌మెంట్ ఎందుకు ఇచ్చారు..? దీని వెనుక ఎన్టీఆర్ పెద్ద మనసు, ఒక మాస్టర్ ప్లాన్ ఉన్నాయి.
ఒకవేళ అఫీషియల్‌గా పోలీస్ కేస్ పెడితే, అందులో ఉన్నది సొంత అభిమానులే కాబట్టి వాళ్ల లైఫ్ కోర్టులు, స్టేషన్ల చుట్టూ తిరిగి నాశనమైపోతుంది. అందుకే ఫ్యాన్స్ మీద ఉన్న ప్రేమతో ముందస్తు హెచ్చరికగా ఈ లేఖ ఇచ్చారని ఫ్యాన్స్ అంటున్నారు. తారక్ పేరు మీద ఎవరైనా డబ్బులు అడిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి అని ప్రజలను, అమాయక ఫ్యాన్స్‌ను అలర్ట్ చేయడం తారక్ మెయిన్ టార్గెట్. ఈ లేఖ జస్ట్ మొదటి అడుగు మాత్రమే. ఈ వార్నింగ్ తర్వాత కూడా ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే, వాళ్లను ఫ్యాన్స్‌గా అస్సలు చూడకుండా లీగల్ గా లోపల వేయించడానికి ఎన్టీఆర్ టీమ్ వెనకాడదు.ఎన్టీఆర్ ఆఫీస్ విడుదల చేసిన అఫీషియల్ స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా ఏం చెప్పారంటే.. "కొన్ని అభిమాన సంఘాలు ఎన్టీఆర్ గారి పేరుతో ఛారిటీ కార్యక్రమాలు చేస్తూ విరాళాలు సేకరిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ కార్యక్రమాలతో ఎన్టీఆర్ గారికి గానీ, ఆయన ఆఫీస్‌కి గానీ ఎలాంటి సంబంధం లేదు. వీటిని ఆయన ఏ విధంగానూ సపోర్ట్ చేయడం లేదు. కాబట్టి శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్ ఎవరూ ఇలాంటి వాటికి విరాళాలు ఇచ్చి మోసపోకండి. ఎన్టీఆర్ ఏదైనా సోషల్ యాక్టివిటీ చేయాలనుకుంటే ఆయన అఫీషియల్ అకౌంట్స్ ద్వారా నేరుగా ఆయనే ప్రకటిస్తారని ఎన్టీఆర్ ఆఫీస్ పేర్కొంది. సో చూసారుగా.. హీరోల మీద ఉన్న అభిమానాన్ని కొంతమంది ఇలా వసూళ్ల దందాలకు వాడుకుంటున్నారు. ఎన్టీఆర్ గారు టైమ్‌కి స్పందించి లేఖ ఇవ్వడం వల్ల ఎంతో మంది అభిమానులు మోసపోకుండా సేవ్ అయ్యారనే కామెంట్స్ వస్తున్నాయి.