పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ వార్ డ్రామా 'ఫౌజీ' షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. ఈ చిత్రంలో ప్రభాస్‌కు సంబంధించిన షూటింగ్ కేవలం 20 రోజులు మాత్రమే పెండింగ్ ఉండగా, వరుస షెడ్యూల్స్ కారణంగా సెప్టెంబర్ 15 వరకు ఈ విరామం ప్రకటించారు.
షూటింగ్ కొద్ది రోజులు ఆగిపోయినప్పటికీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రం చాలా వేగంగా జరుగుతున్నాయి. ఈ పీరియాడిక్ ఎపిక్‌ను గ్రాండ్ విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు, ఇందులోని భారీ యాక్షన్ బ్లాక్స్ కోసం అమెరికాకు చెందిన ప్రముఖ అంతర్జాతీయ VFX కంపెనీలు పని చేస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత భారీ ప్లానింగ్‌తో నిర్మిస్తోంది.