MAN OF MASSESకి సలామ్.. దార్లో కొచ్చిన మాంత్రికుడు..?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు, సెట్లో కూడా డ్రాగన్ గా మారి నిప్పులు కురిపించాడా? ఆ నిప్పుల మీద ఇప్పుడు మాటల మాంత్రికుడు నడవాల్సి వచ్చిందంటున్నారు..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు, సెట్లో కూడా డ్రాగన్ గా మారి నిప్పులు కురిపించాడా? ఆ నిప్పుల మీద ఇప్పుడు మాటల మాంత్రికుడు నడవాల్సి వచ్చిందంటున్నారు.. కాల్లు బాగా కాలినట్టున్నాయి… చేతులు కాలాకా ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటారు. కాని కాల్లు కాలాకే, త్రివిక్రమ్ ఇప్పుడు ఎన్టీఆర్ చేతులు పట్టుకున్నాడన్న మాట తూటాలా మారుతోంది. తనతో కమిటైన ప్రాజెక్ట్ ని, బన్నీ దగ్గరకి మోసుకెళ్లటం మీద ఎప్పటి నుంచో పంచాయితీ నడుస్తోంది. ఈ చీటింగ్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ చాలా పెద్ద ఫైన్ వేశాడని కూడా తెలుస్తోంది. దాని ఎఫెక్టే మెగా ఫోన్ కి త్రివిక్రమ్ దూరమయ్యే పరిస్థితి అంటున్నారు..అంతగా మైథాలాజీకల్ డ్రామా గాడ్ ఆఫ్ వార్ తెరవెనక ఏం జరిగింది? పంచాయితీలో ఏం తేలింది?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ కమిటైన మూవీ గాడ్ ఆఫ్ వార్… లార్డ్ కార్తికేయని బేస్ చేసుకుని, త్రివిక్రమ్ రాసుకున్న పాన్ వరల్డ్ రేంజ్ ఉన్న లార్జర్ దేన్ లైఫ్ అనిపించే కథ ఇది.. ముందు బన్నీకే చెప్పాడు.. తను ఒప్పుకోకపోవటంతో ఎన్టీఆర్ ని కలవటం, తను గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, తర్వాతే కథలో మార్పులకోసం ఎన్టీఆర్ టీం కూడా కుస్తీ పడటం జరిగిందని తెలుస్తోంది.కట్ చేస్తే, ఫైనల్ స్క్రిప్ట్ రెడీ.. ఇంతలో బన్నీ నుంచి త్రివిక్రమ్ కి కాల్ రావటం, తను బన్నీకి కథ చెబితే ఆ ప్రాజెక్ట్ తనతోనే తీయాలని బన్నీ ఫోర్స్ చేయటం… అలా గాడ్ ఆఫ్ వార్ ని బన్నీ కబ్జా చేశాడన్న ప్రచారం పెరగటం జరిగాయి.. ఓరకంగా త్రివిక్రమ్ ఇలా గాడ్ ఆఫ్ వార్ విషయంలో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పోడిచాడన్నారు. కాని కథ మీద కాపీరైట్ ఎన్టీఆరే తెలివిగా తీసుకోవటం వల్ల, ఆ స్టోరీనే కాదు, స్టోరీ లైన్ కూడా త్రివిక్రమ్ మరెవరితో ప్లాన్ చేసేందుకు వీలుండదన్న ప్రచారం జరిగింది.
సో గాడ్ ఆఫ్ వార్ ని త్రివిక్రమే రాసినా, కథ చర్చలు, మార్పులు ఎన్టీఆర్ టీం చేయటం వల్ల కాపీరైట్స్ ఉమ్మడిగా ఉండటం, ఎక్కువ శాతం రైట్స్ మీద కమాండ్ ఎన్టీఆర్ కే దక్కడం వల్ల, ఆ కథని త్రివిక్రమ్ మరెవరితో చేయలేడనే ప్రచారం జరిగింది. కాబట్టి అక్కడ త్రివిక్రమ్ లాక్ అవటంతో, ఇప్పుడు బన్నీతో తను ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేడు.. అలాని ఎన్టీఆర్ తనకి ఆఫర్ ఇవ్వలేడు.. మరో దర్శకుడిని పెట్టుకుని, ఇదే సినిమా పట్టాలెక్కించాలనేది ఎన్టీఆర్ ఆలోచన అని కూడా ప్రచారంజరిగింది.ఈ పంచాయితే సంక్రాంతి తర్వాత తీరుతుందన్నారు. కాని ఎన్టీఆర్ తన డ్రాగన్ షూటింగ్ తో బిజీ అయ్యాడు. జలుబు వల్ల చిన్న బ్రేక్ తీసుకుంటున్నాడన్నారు. కాని ఇది త్రివిక్రమ్ పంచాయితీకోసమే అనంటున్నారు. కథ విషయంలో త్రివిక్రమ్ తన తప్పుని రియలైజ్ అయ్యాడట. ఎన్టీఆర్ కి సారి కూడా చెప్పాడట.. ఐనా మ్యాన్ ఆఫ్ మాసెస్ కన్విన్స్ కాలేదనే ప్రచారం జరుగింది.
ఐతే ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ మూవీ కథని వేరే దర్శకుడితో కలిసి ఎన్టీఆర్ చేస్తే, అది త్రివిక్రమ్ కెరీర్ నే పూర్తిగా తుడిచి పెట్టే ఛాన్స్ఉంది. ఎందుకంటే ఇలా హీరోని మోసం చేసిన దర్శకుడిగా తన మీద మాయని మచ్చ పడుతుంది. అందుకే అంతా నార్మలైజ్ అయ్యేందుకు, ఎన్టీఆర్ కటాక్షం కోసం త్రివిక్రమ్ ఇప్పుడు డ్రాగన్ సినిమా సెట్స్ చుట్టూ చక్కర్లు కొట్టడం, ఫైనల్ గా ఎన్టీఆర్ నుంచి పిలుపు రావటం జరిగిందంటున్నారు.. మొత్తానికి త్రివిక్రమ్ కే ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ తో చివరి ఛాన్స్ ఇచ్చే అవకాశమే ఉన్నట్టు తెలుస్తోంది. గాడ్ ఆఫ్ వార్ వివాదం సుకాంతం అయ్యేలా కనిపిస్తోందనంటున్నారు.











