టాక్సిక్ Vs స్పిరిట్.!

తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద్దరు భారీ కటౌట్ల గురించే చర్చ జరుగుతోంది. ఒకరు కన్నడ రాకింగ్ స్టార్ యశ్, మరొకరు మన రెబల్ స్టార్ ప్రభాస్.

Post Published By: dialnews
Updated : 4 July 2026, 8:00 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు పాన్ ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఇద్దరు భారీ కటౌట్ల గురించే చర్చ జరుగుతోంది. ఒకరు కన్నడ రాకింగ్ స్టార్ యశ్, మరొకరు మన రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న అప్‌కమింగ్ హై-వోల్టేజ్ యాక్షన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతున్నాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.యశ్ నటిస్తున్న 'టాక్సిక్', ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' చిత్రాలకు సంబంధించిన ఆసక్తికరమైన పోలికలు, విశేషాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'టాక్సిక్'. ఈ సినిమాకు సంబంధించిన కథాంశం మరియు నేపథ్యం చాలా వైవిధ్యంగా ఉండబోతోంది. ఈ సినిమా గోవా బ్యాక్‌డ్రాప్‌లో 1950 నుంచి 1970ల మధ్య కాలంలో సాగే డ్రగ్ కార్టెల్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతోంది.

ఇందులో యశ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒక పవర్‌ఫుల్ డ్రగ్ లార్డ్‌గా దుమ్మురేపడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి పాన్ ఇండియా స్టార్ హీరోయిన్లు నటిస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన సరికొత్త గ్లింప్స్, టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇందులో యశ్ రగ్గడ్ లుక్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీన్లు, ఇంటెన్స్ బోల్డ్ కంటెంట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టాక్సిక్' సృష్టించిన హైప్ అనుహ్యంగా పాన్ ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, దీనికి ఏమాత్రం తగ్గకుండా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్' చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి', 'యానిమల్' చిత్రాలతో బోల్డ్ అండ్ వయలెంట్ కంటెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సందీప్, ప్రభాస్ లాంటి భారీ కటౌట్‌ను ఎలా ప్రెజెంట్ చేస్తారనే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగింది. స్పిరిట్' చిత్రం నేటి తరం బ్యాక్‌డ్రాప్‌లో సమాజంలోని నేరాలు, చట్టం అనే కోణంలో సాగే పవర్ ఫుల్ పోలీస్ స్టోరీగా రూపొందుతోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం ప్రభాస్ విపరీతంగా కష్టపడుతున్నారు. ఇందులోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ఆయన ఎలాంటి బాడీ డబుల్స్ వాడకుండా స్వయంగా రిస్క్ తీసుకుని నటిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. టాక్సిక్' లోని బోల్డ్ ఎలిమెంట్స్ చర్చనీయాంశం కావడంతో, 'స్పిరిట్' లోని హీరోయిన్ తృప్తి దిమ్రిని సందీప్ వంగా ఎంత గ్లామరస్‌గా, బోల్డ్‌గా చూపిస్తాడోనని నెటిజన్లు అప్పుడే లెక్కలు వేస్తున్నారు.

ఈ రెండు చిత్రాల మధ్య పోలికలను గమనిస్తే, కథాంశాలు వేరైనప్పటికీ, రెండింటిలోనూ కథానాయకులు విపరీతమైన కోపం, ఇంటెన్సిటీ కలిగిన పవర్‌ఫుల్ పాత్రలనే పోషిస్తున్నారు. ఒకరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే డ్రగ్ లార్డ్ అయితే, మరొకరు చట్టాన్ని రక్షించే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. యాక్షన్ పరంగా 'టాక్సిక్' కి ఏమాత్రం తగ్గకుండా, సందీప్ రెడ్డి వంగా మార్క్ 'రా అండ్ రియలిస్టిక్ ఫైట్స్' ఈ సినిమాలో హైలైట్ కానున్నాయట. ఈ రెండు సినిమాల్లోని యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులకు సరికొత్త 'వైల్డ్' ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయనడంలో సందేహం లేదు. మొత్తానికి యశ్ 'టాక్సిక్' అందించిన ఊపు, ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు మరింత ప్లస్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయోనన్న ఆసక్తిని సినీ ప్రియుల్లో రెట్టింపు చేసింది. థియేటర్లలో ఈ రెండు చిత్రాలు విడుదలైనప్పుడు రికార్డుల వేట ఎలా ఉండబోతుందో చూడాలి మరి.

Published : 
  • 4 July 2026, 8:00 PM IST