రప్పా రప్పా రాక్షసుడు.. “రాకా”తో జాగ్రత్త…!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్టైనా, సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ వల్ల, సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. సైలెంట్ గా మిగిలాడు.. ఇలా చాలా డ్యామేజ్ తర్వాత, ఇప్పడు రాకాగా మారి దండెత్తుతున్నాడు. కాసేపు తన మీదున్న నెగెటివిటీ, తను అనుభవించిన హార్డ్ సిచ్చువేషన్స్

Post Published By: dialnews
Updated : 9 April 2026, 6:40 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 హిట్టైనా, సంధ్యా థియేటర్ ఇన్స్ డెంట్ వల్ల, సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు. సైలెంట్ గా మిగిలాడు.. ఇలా చాలా డ్యామేజ్ తర్వాత, ఇప్పడు రాకాగా మారి దండెత్తుతున్నాడు. కాసేపు తన మీదున్న నెగెటివిటీ, తను అనుభవించిన హార్డ్ సిచ్చువేషన్స్ ని పక్కన పెట్టి, చూస్తే, రాకా నిజంగా పాన్ ఇండియా హ్యాట్రిక్ తో తన ఫేట్ మార్చబోతోందా? ఆట్లీ మీద పూర్తిగా ఎవరికీ నమ్మకం లేకపోయినా... తనేం మరీ డిజాస్టర్ డైరెక్టర్ కాదు.. అల్ల టప్ప సబ్జెక్ట్స్ కి అల్లు అర్జున్ కనెక్ట్ కాడు.. కాబట్టి పుష్పరాజే పులిరాజ్ గా మారి, సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా? నిజం చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ నుంచి పవన్ ఫ్యాన్స్ వరకు అంతా బన్నీని దూరం పెట్టారనంటారు. అల్లు ఆర్మీ తనకున్నా, మెగా తూఫాన్ ని తట్టుకోవటం చాలా కష్టం.. అలా జరగాలంటే పుష్పరాజ్ రేంజ్ లో రాకా మూవీ కంటెంట్ కి దమ్ముండాలి... మరి పోస్టర్ తోనే దమ్ముందని తెలుస్తోందా? రాకా పోస్టర్ తో పాటు బయట పడ్డ స్టోరీలైన్ లో, గుడ్ బ్యాడ్ అగ్లీ.. ఇలా ఏమేమున్నాయి... మీకోసం..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆట్లీ తీస్తున్నమూవీ రాకా.. రాక్షసుడు టైటిల్ కి ఇది షార్ట్ ఫామా? తమిళ్ లో రాకాస పదానికి ఇది షార్ట్ ఫామా? అన్న డిస్కర్షన్ జరుగుతోంది. పోస్టర్ మాత్రం పేలింది. ఆల్రెడీ ఈ మూవీ మొదలైనప్పుడు వదిలిన మేకింగ్ వీడియోలో బీస్ట్ హ్యాండ్ తో బన్నీ కనిపించిన వీడియో ఇప్పుడు వైరలౌతోంది. ఆల్రెడీ అప్పట్లోనే ఫిల్మ్ టీం హింట్ ఇచ్చిందన్న చర్చ సోషల్ మీడియాలో పెరిగింది.చాలా కాలం తర్వాత ఇలా అల్లు అర్జున్ గురించి సోషల్ మీడియాలో తక్కువ నెగెటివ్ చర్చలు జరగటం ఇదే మొదలు. ఎప్పుడు అల్లు అర్జున్ మీద నెగెటివ్ ప్రచారాలు, లేదంటే వివాదాలు, కాదంటే ఏదో ఒక అంశాలు వార్తలై వైరలయ్యేవి. కాని తన రాకా మూవీ పోస్టర్ ఇంపాక్ట్ కొంతవరకు పాజిటివ్ గా నే ఉన్నట్టు తెలుస్తోంది. ఇది మాత్రం కొంతవరకు బన్నీకి కలిసొచ్చే అంశం.

మరి పుష్ఫరాజ్ సీక్వెల్ సక్సస్ సెలబ్రేషన్స్ లో జరిగిన ఇన్స్ డెంట్, తర్వాత బన్నీకి జరిగిన డ్యామేజ్, తర్వాత తను పూర్తిగా సైలెంగ్ గా మిగిలిపోవటంతో సింపతీ పెరిగిందో.. లేదంటే ఆల్ ఆఫ్ సడన్ గా అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్ గా, రాకా పోస్టర్ వస్తే ఎక్కడా గతంలో ఉన్నంత నెగెటివిటీ కనిపించట్లేదు. ఒకరకంగా ఎవరూ రాకా మూవీ అప్ డేట్ ఎక్స్ పెక్ట్ చేసి ఉండకపోవచ్చు.దీనికి తోడు అల్లు ఆర్మీ కూడా అగ్రెసీవ్ గా కాకుండా, సైలెంట్ గా తన పని తాను చేసుకుంటుండటం. టీనేజర్స్ కి హెచ్ పీవీ ఇంజెక్షన్ తాలూకు ఎవైర్ నెస్ క్రియేట్ చేయటం లాంటి సోషల్ సర్వీస్ రూటు ఎంచుకోవటం కూడా మంచి మార్పే.. ఇది కూడా ఒకరకంగా బన్నీ కొత్త మూవీ మీద నెగెటివ్ ఇంపాక్ట్ ని తగ్గించింది అంటున్నారు. అయితే ఇందులో హీరో వేసేది మాత్రం నెగెటీవ్ రోలే అని తెలుస్తోంది.

అందులోనూ అల్లు అర్జున్ వేసేది ఒక పాత్ర కాదు, డ్యూయెల్ రోల్ అని తెలుస్తోంది. ఒక చెడ్డ వ్యక్తి పగ తీర్చుకునేందుకు మ్రుగంగా మారితే... ఆ మ్రుగంతో అదే వ్యక్తి రక్త సంబంధీకుడు ఫైట్ చేయాల్సి వస్తే. లాంటి బీస్ట్ ఫార్ములాతో రాకా రాబోతోందట. అంటే మనిషిగా, రాక్షస అవతారంలో ఇలా రెండు నెగెటీవ్ రోల్స్ వేస్తూ, హీరోగా కూడా కనిపించబోతున్నాడు బన్నీ. తనకి జోడీగా దీపికా ఫీమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తుంటే, తోడుగా మ్రుణాల్ ఠాకూర్, రష్మిక మందనన్నా, జాన్వీ కపూర్ కనిపించబోతున్నారు. ఇక రాకా ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో రా అంటే రామలింగయ్య అదే, దివంగత నటుడు బన్నీ తాత అల్లు రామలింగయ్యఅని, డబుల్ ఏ అంటే అల్లు అర్జున్ అని కే అంటేనిర్మాత కలానిది మారన్ అని, ఇక చివర్లో ఉండే ఏ అంటే డైరెక్టర్ ఆట్లీ అని కూడా అంటున్నారు. ఏదేమైనా ఇది నిజం కాకున్నా, సోషల్ మీడియాలో రాకాకి చాలా తక్కు వ నెగెటివిటి రావటం చూస్తుంటే, ఐకానిక్స్ స్టార్ కి పాజిటివ్ వైబ్స్ మొదలైనట్టు కనిపిస్తున్నాయి.

Published : 
  • 9 April 2026, 6:40 PM IST