టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఉన్న స్పీడ్, ఫామ్ మరెవరికీ లేవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 'అఖండ' సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ తర్వాత బాలయ్య వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత వచ్చిన ప్రతీ సినిమా ఒకదానిని మించి మరొకటి సాలిడ్ హిట్స్ సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించాయి.ప్రస్తుతం బాలకృష్ణ లైనప్‌లో భాగంగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఒక భారీ చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి అభిమానులకు తెలిసిందే. బాలకృష్ణ కెరీర్లోనే 112వ చిత్రంగా ఈ సినిమాను అత్యంత గ్రాండ్‌గా ప్రకటించారు.
అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అలాగే టాలీవుడ్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ రకరకాల ఊహాగానాలు, రూమర్స్ విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని మేకర్స్ స్పష్టం చేస్తూ రూమర్స్‌కు ముగింపు పలికారు. సినిమా ఆగిపోలేదని, ప్లాన్ ప్రకారమే ట్రాక్‌లోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ కాంబినేషన్ కోసం కాచుక్కూర్చున్న నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ తన 111వ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన చిన్న గాయం కారణంగా బాలయ్య కొద్దిరోజులు గ్యాప్ తీసుకున్నారు. ఆ గాయం నుంచి కోలుకున్న తర్వాత ప్రస్తుత ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి, వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే NBK 112 సినిమాను పట్టాలెక్కించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.మాస్ ప్లస్ సోషల్ మెసేజ్ కలయికలో కొరటాల శివ మార్క్ మేకింగ్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరిన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.