నటసింహం బాలకృష్ణ తో కొరటాల శివ సినిమా ఓకే అయ్యేలా ఉందా? ఎందుకంటే దేవర2 ని పట్టాలెక్కించే పనిలో ఉన్న కొరటాల శివ, ముందు అబ్బాయ్ తో దేవర సీక్వెల్ తీసి, వెంటనే తన బాబాయ్ తో మైండ్ బెండ్ చేసే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు.. నిజానికి బాలయ్యకి కెరీర్ లో సైలెంట్ హిట్టైన రెండు బ్లాక్ బస్టర్లకు కారణం కొరటాల శివ.. అక్కడ తనకి అన్యాయం జరిగిందని అప్పట్లో పుకార్లొచ్చాయి... తనని మోసం చేసినోడు మట్టికొట్టుకుపోయాడనే కామెంట్లు ఇండస్ట్రీలో పేలాయి.. కట్ చేస్తే పోగొట్టుకున్న చోటే రాబట్టుకునేందుకు, కొరటాల శివ ప్లాన్ చేశాడా? నందమూరి నటసింహం బాలయ్యతో సినిమా ప్లానింగ్ వెనక, గెలుపుకోసం కొరటాల శివ ఆరాటమే కారణమా? దేవరలాంటి హిట్ పడ్డాక, దేవర 2 ఆల్రెడీ చేతిలో ఉన్నాక కూడా, బాలయ్య ఆఫర్ కోసం ఎందుకు కొరటాల శివ ఇంత తపన పడుతున్నాడు? తనని మోసం చేసిన దర్శకుడి మీద రివేంజా?
కొరటాల శివ దేవర 2 ప్లానింగ్ లో ఉన్నాడు. ఆల్రెడీ ఆచార్యతో పడ్డ పంచ్ కి, దేవర హిట్ తో సమాధానం చెప్పాడు.. ఏకంగా రాజమౌళిసెంటి మెంట్ ని బ్రేక్ చేసిన మూవీగా దేవర నిలిచింది. త్రిబుల్ ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళిసెంట్ మెంట్ ని బ్రేక్ చేసి ఎన్టీఆర్ ఎకౌంట్ లో చాలా పెద్ద రికార్డు పడేలా చేసింది. ఇదంతా కొరటాల శివ దేవరతోనే సాధ్యమైంది...అందుకే దేవర 2 కి కూడా ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఈ కాంబినేషన్ రెండు సార్లు వర్కవుట్ అయ్యింది. ఇప్పుడు జనతా గ్యారేజ్, దేవర తర్వాత దేవర2 తో హ్యాట్రిక్ కిక్ దక్కేలా ఉంది. ఎలా చూసినా కొరటాల శివ చేతిలో 1000 కోట్ల రిజల్ట్ కనిపిస్తోంది. కెరీర్ గ్రాఫ్ నెక్ట్స్ లెవల్ కి వెళ్లబోతోంది. ఇలాంటి టైంలో బాలయ్య ప్రాజెక్ట్ కోసం తను పడుతున్న తపన చూస్తుంటే, ఏదో కొత్త దర్శకుడు మొదటి అవకాశమే నందమూరి నటసింహంతో దొరికిందన్నట్టు ప్రవర్తిస్తున్నాడని అంటున్నారు.
కాని ఇక్కడే ఈ మొత్తం సీనారియో వెనక చాల పెద్ద పేయిన్ ఫుల్ స్టోరీ ఉందంటున్నారు. కొరటాల శివ కసకి పదేళ్ల పైనే చరిత్ర ఉందనంటున్నారు. గతంతో బోయపాటి శీను మేకింగ్ లో బాలయ్యచేసిన లెజెండ్ కి రైటర్ గా వర్క్ చేసింది కొరటాల శినే అని, తను రాసి స్క్రిప్ట్ తాలూకు క్రెడిట్స్ బోయపాటి శీను తీసుకున్నాడని ఆమధ్య ఓ ఇంటర్వూలో చెప్పాడు.అవన్నీ గతం గతహా అనేసి ఊరుకున్నాడు. కట్ చేస్తే, మోసం చేసిన బోయపాటి, వినయ విధేయ రామ, అఖండ 2 ప్లాపులతో అడ్రస్ లేకుండాపోయాడనంటున్నారు. ఇప్పుడు కొరటాల వంతొచ్చినట్టుంది.. తన కథని ఎత్తుకెళ్లి క్రెడిట్ కొట్టేసినోడు, రోడ్డున పడ్డాడు.. ఇలాంటి టైంలో బాలయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టి రైటర్ పవరేంటో చూపించాలనే కసిగా ఉన్నాడట కొరటాల శివ.
చాలా సార్లు బాలయ్యతో సినిమా తీయాలని తను అనుకున్నా కుదర్లేదు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనేనేను, దేవర ఇలా ఆచార్య తప్ప వరుస హిట్లతో దూసుకెలుతున్నప్పటికీ, బాలయ్య ఆఫర్ కోసం తను వేయిట్ చేశాడు. కథ కుదిరగానే నటసింహానికి కథ వినిపించాడు. దేవర 2 అయిపోయిన వెంటనే, బాలయ్యతో ఊరమాస్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. లెజెండ్ టైంలో తనని మోసం చేసిన దర్శుకుడికి బుద్ది చెప్పే ప్రయత్నం ఇన్నాల్లకు చేస్తున్నాడట.. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.