డ్రాగన్ 2 పార్ట్స్ ఫిక్స్.. అఫ్ఘాన్ కంపెనీ పార్ట్ 1..?

డ్రాగన్ గ్లింప్స్ వచ్చిన వెంటనే ఫ్యాన్స్ లో పూనకాలొచ్చాయి.. అందరూ లెంథీ గ్లింప్స్ మత్తులోకి జారిపోయారు. ఎన్టీఆర్ లుక్స్ కి ఫిదా అయ్యారు. డ్రాగన్ వరల్డ్ బిల్డింగ్ చూసి ఇది, సలార్, కేజీయఫ్ ని మించిపోయే సినిమా అనంటున్నారు.

Post Published By: dialnews
Updated : 21 May 2026, 7:30 PM IST

డ్రాగన్ గ్లింప్స్ వచ్చిన వెంటనే ఫ్యాన్స్ లో పూనకాలొచ్చాయి.. అందరూ లెంథీ గ్లింప్స్ మత్తులోకి జారిపోయారు. ఎన్టీఆర్ లుక్స్ కి ఫిదా అయ్యారు. డ్రాగన్ వరల్డ్ బిల్డింగ్ చూసి ఇది, సలార్, కేజీయఫ్ ని మించిపోయే సినిమా అనంటున్నారు. అంతవరకు బానే ఉంది.. కాని డ్రాగన్ ఎన్ని భాగాలు.. ఒకటేనా? ఎందుకంటే టైటిల్ చూస్తే జస్ట్ డ్రాగన్ అని మాత్రమే గ్లింప్స్ లో కనిపిస్తోంది. ఎక్కడా కూడా ఛాప్టర్ వన్, లేదంటే మొదటి భాగం, కాదంటే మరో క్యాప్షన్ కూడా లేదు... కాబట్టి ఇది కేవలం ఒకే భాగంగా రాబోయే లెంథీ సినిమా అనుకోవాలా? ఖచ్చితంగా కానే కాదు..ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు డజన్ల కొద్ది విలన్లు... అమెరికా,వియాత్నం వార్.. రష్యా ఆఫ్ఘాన్ వార్... దీనికి బ్రిటిష్ ఇండియా నుంచి ఉన్న లింక్.. అందుకే ఒక్క సినిమాలో ఇంత భారీ కథ ని చెప్పడం సాధ్యం కాదని తెలుస్తోంది. కాబట్టే ఇది రెండు భాగాల సినిమా..లేదంటే మూడు భాగాలుగా రావొచ్చంటున్నారు.. అయితే మొదటి భాగం ఆఫ్ఘాన్ కంపెనీ గురించైతే, రెండో భాగం గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ కథా? టీజర్ లేదంటే, ట్రైలర్ లో ఇది రెండు భాగాల సినిమా అని, అసలు క్యాప్షన్ తో సహా టైటిల్ ని పూర్తిగా చూపించబోతున్నారా?

డ్రాగన్ ఒక భాగం కాదు, రెండు భాగాలుగా రావొచ్చు.. లేదా మూడు భాగాలు కూడా అవ్వొచ్చు.. ఇది మాత్రం ఫైనల్.. ఇందులో మరో మాటలేదనటానికి రీజన్ డ్రాగన్ గ్లింప్సే.. కాని గ్లింప్స్ లో ఎక్కడా డ్రాగన్ టైటిల్ కింద క్యాప్షన్ గా చాప్టర్ వన్ అని, మరొకటని లేదు. కాబట్టి ఇది కేవలం ఒక భాగంగానే వస్తుందని అంతా అనుకోవచ్చు.. ఈవిసయంలో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వకపోవటంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహపడ్డారన్న మాటలు వినిపిస్తున్నాయి.కాని రియాలిటీ ఏంటంటే, ఇది నిజంగా ఒకే భాగంగా వచ్చే సినిమా అయితే, కేవలం పాత్రల పరిచయంతోనే 80శాతం సినిమా అయిపోతుంది. కనీసం రెండు మూడు గంటలు పాత్రల పరిచయానికి, కాన్ ఫ్లిక్ట్ పరిచయం చేయటానికే సరిపోతుంది. ఇక హీరో ఎటాక్, తో పాటు మిగతా ఎమోషన్స్ ఎక్కడ చూపిస్తారు. అందుకే ఇది రెండు భాగాల కథని కన్ఫామ్ చేసుకోవాల్సి వస్తోంది

మరి డ్రాగన్ నిజంగా రెండు భాగాలు, లేదా అంతకుమించేలా ఎక్కువ సీక్వెల్స్ తో వస్తే... మొదటి భాగం టైటిలేంటి? రెండో భాగం కోసం ఎలాంటి టైటిల్ ఫిల్మ్ టీం ఫిక్స్ చేసింది? అక్కడే రెండు ఆన్సర్స్ వినిపిస్తున్నాయి.. ఒకటి ఆఫ్టాన్ కంపెనీ, రెండో గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ.. ఈ రెండు పేర్లతోనే డ్రాగన్ రెండు భాగాలుగా విడగొట్టారా అన్న డౌట్లు పెరిగాయి.ఎందుకంటే డ్రాగన్ గ్లింప్స్ చూస్తే, మొత్తం పాత్రలు, కథంతా ఆఫ్ఘాన్ డ్రగ్స్ కంపెనీ గురించే కనిపిస్తుంది. వినిపిస్తుంది. హీరో కూడా ఆఫ్ఘాన్ కంపెనీ లో అసాసిన్ గ్రూప్ హెడ్.. అంటే కిల్లర్ టీం కి టీమ్ లీడర్... కాని డ్రాగన్ గ్లింప్స్ లో ఎక్కడా కూడా గోల్డెన్ ట్రయాంగిల్ కంపెనీ మెంబర్స్ ని చూపించలేదు. ఒక్క పాత్రని కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు.

దీనికి తోడు ఎన్టీఆర్ ని డ్రాగన్ గా మాత్రం పరిచయం చేయలేదు. తన పాత్ర పేరు లూగర్ అని ఒక జర్మన్ గన్ పేరుతో పరిచయం చేశారు. అక్కడే సవాలక్ష డౌట్లు పెరిగాయి. వాటి ప్రకారం డ్రాగన్ డెఫినెట్ గా ఎన్టీఆర్ తాత లేక తండ్రి పేరైఉంటుంది.. తన వారసుడిగా లూగర్ గా మరో ఎన్టీఆర్ వచ్చాడనే సెన్స్ క్యారీ అవుతోంది. ఏదేమైనా డ్రాగన్ రెండు భాగాలుగా ఉంటే... డ్రాగన్ మొదటి భాగం అఫ్టాన్ కంపెనీ, డ్రాగన్ రెండో భాగం గోల్డెన్ ట్రైయాంగిల్ కంపెనీ పేరుతో వచ్చే ఛాన్స్ఉంది.ఆగస్ట్ లో లేదా దసరాకు రిలీజ్ చేయాలనుకునే టీజర్ లో డ్రాగన్ రెండు భాగాల టైటిల్స్ రావొచ్చనే అంచనాలున్నాయి. ఏదేమైనా ఈ మధ్య కాలంలో ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన గ్లింప్స్ కనిపించలేదు. ధురందర్ ఎంత రక్తసిక్తమైనా, ట్రైలర్, పాటలతోనే ఆ ఇంపాక్ట్ కనిపించింది. కాని గ్లింప్స్ దశలో ఇంత చర్చకు దారితీసేలా చేసింది మాత్రం డ్రాగన్ ఒక్కటే.

 

Published : 
  • 21 May 2026, 7:30 PM IST