నెవర్ బిఫోర్.. కుల్లుబ్యాచ్ ఎంత దిగజారినా…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ తన ఫ్యాన్స్ కే కాదు, నార్మల్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చిన్టటుంది. నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ లో ఏం చూపిస్తారులే, అని అనుకున్న బ్యాచ్ కి, మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు ప్రశాంత్ నీల్.

Post Published By: dialnews
Updated : 25 May 2026, 8:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ తన ఫ్యాన్స్ కే కాదు, నార్మల్ ఆడియన్స్ కి కూడా బాగా నచ్చిన్టటుంది. నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ లో ఏం చూపిస్తారులే, అని అనుకున్న బ్యాచ్ కి, మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాడు ప్రశాంత్ నీల్. దీంతో ఫ్యాన్స్ నుంచి మూవీ లవర్స్ వరకు అంతా హ్యాపీస్ అనుకుంటుంటే, బీపీ బ్యాచ్ ఇప్పుడు బ్లడ్ ప్రెజర్ పెంచేసుకుంటోంది. ఎక్కడ ఎన్టీఆర్ దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న కళ్లు బ్యాచ్ కి డ్రాగన్ గ్లింప్స్ చిన్న సందు కూడా ఇవ్వలేదు. అందుకే డ్రాగన్ మీద కామెంట్లు, ట్రోలింగ్స్ తో ఎటాక్ చేయటం కుదరక, ఇప్పుడు పది మెట్లు దిగి, కాదు దిగజారి బురద చల్లుతున్నారు.. అది డ్రాగన్ లో ఎన్టీఆర్ బేస్ వాయిస్ మీదే... విచిత్రం ఏంటంటే పేషెంట్ కి విషమిచ్చి చంపబోతే, అదే అమ్రుతంగా మారినట్టు... కుళ్లుబ్యాచ్ కామెంట్లే డ్రాగన్ కి మరింత ప్లస్ అవుతున్నాయి. ఇంతకి కోడిగుడ్డు మీద కుళ్లు బ్యాచ్ ఏం పికబోయింది? అదెలా డ్రాగన్ కి ప్లస్ అవుతోంది?

డ్రాగన్ గ్లింప్స్ పేలింది. షాక్ వేవ్ క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ నుంచి కామన్ ఆడియన్స్ వరకు, అంతా షాక్ అయ్యేలా ఇంత కంటెంట్ ని వదిలారేంట్రా బాబు అనుకునేలా చేసింది. ఏదో మేకింగ్ వీడియోలు, సంబంధంలేని ఏఐ వీడియోస్ తో నింపేస్తారనుకుంటే, ఏఐ సపోర్ట్ తీసుకున్నా, క్వాలిటీ ఔట్ పుట్ తో షాక్ ఇచ్చింది డ్రాగన్ టీం.నాలుగున్నర నిమిషాల గ్లింప్స్ లో విజువల్స్ నిజంగా గ్లోబల్ సినిమా అనిపించే స్థాయిలో ఉండటం ఒక ఎత్తైతే, ఎన్టీఆర్ లుక్ నిజంగా వెన్నులో వణుకు వచ్చేలా చేస్తోందంటున్నారు. అస్సలు యాంటీ ఫ్యాన్స్ కూడా వంకపెట్టలేని స్థాయిలో నెక్ట్స్ లెవర్ ఫుటేజ్ తో షాక్ ఇచ్చింది డ్రాగన్ టీం. అందుకే మొదిటి రెండు రోజులు సౌండ్ లేదు. కాని కుళ్లు బ్యాచ్ అంత ఈజీగా ఎన్టీఆర్ ని ఎందుకు వదలేస్తుంది.

తనకి తెలుగు లో యాంటీ ఫ్యాన్స్ ఎలా ఉన్నారో, బాలీవుడ్ లో తెలుగు హీరోలందరిని టార్గెట్ చేసే కుళ్లు బ్యాచ్ కూడా ఉంది. అందులో ఎక్కువ మంది టార్గెట్ చేసిది కూడా ఎన్టీఆర్ నే.. అయితే కోడిగుడ్డుమీద ఈకలు పీకినట్టు, ఈబ్యాచ్ డ్రాగన్ గ్లింప్స్ మీద చేస్తున్న దాడి చూస్తుంటే, ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అన్నట్టు జనాలు స్పందిస్తున్నారు.ఎందుకంటే డ్రాగన్ లో ఎన్టీఆర్ బేస్ వాయస్ బాలేదనే కామెంట్ షాకిస్తోంది. ఎంతసేపు ఇలా బేస్ వాయిస్ తో ఎన్టీఆర్ డైలాగ్స్ చెబుతాడు? ఇంకా వేరియేషన్సే లేవా? తను మారడా? నటుడిగా ఎదగడా ..? ఇవి యాంటీ ఫ్యాన్స్, కుల్లుబ్యాచ్ వేసే ప్రశ్నలు.. విచిత్రం ఏంటంటే, ఎన్టీఆరే కాదు, అమితాబ్ బచ్చన్ వరకు కూడా ఏ నటుడిని చూసినా, బేస్ వాయిస్ లో ఎన్ని మార్చినా, బేస్ వాయిస్ మారదు.. అసలు నటుడికి బేస్ వాయిసే బలం.

అలాంటి వాయిస్ నే వంకపెట్టి, డ్రాగన్ గ్లింప్స్ లో వంకపెట్టడానికి ఏం లేకపోయేసరికి, ఇలా తలా తోలకేలి కామెంట్లతో అటాక్ చేస్తున్నారు. విచిత్రం ఏంటంటే, పరోక్షంగా ఎన్టీఆర్ బలమైన బేస్ వాయిస్ కి వీల్లే ప్రచార కర్తలుగా మారుతున్నారు. ఫస్ట్ టైం యాంటీ ఫ్యాన్స్ చేస్తున్న ట్రోలింగే, రివర్స్ ట్రోలింగ్ కి గురవ్వటం, ఈ మొత్తం ఎపిసోడ్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్... ఎవరైనా నటుడు, తనకు చాలా పెద్ద బలం అనుకున్న ఆయుధాన్ని వాడకుండా ఉండటం మూర్ధత్వమే అవుతుంది... మరి ఎన్టీఆర్ ని మూర్ఘంగా ఉండమంటున్నారా ఈ యాంటీ ఫ్యాన్స్... అందుకే ఈ తలతిక్క ట్రోలింగ్ వల్ల, డ్రాగన్ కి మైనెస్ కంటే ప్లసే ఎక్కువౌతోంది.

Published : 
  • 25 May 2026, 8:15 PM IST