డ్రాగన్ గ్లింప్స్ లో అతి పెద్ద రూమర్ కి బ్రేక్ పడింది. అదే ఈ సినిమా కథ మారిందని, స్టోరీకి రిపేర్లు జరిగాయన్న గాలి వార్తలకు బ్రేక్ పడింది.ఇదే కాదు ఎన్టీఆర్ సన్నబడటం వెనకున్న లాజిక్ కూడా ఇప్పుడు, గ్లింప్స్ పుణ్యమాని మ్యాజిక్ చేస్తోంది. మాస్ మతిపోగొట్టేలా తన లుక్ ఉండటమే కాదు, ముఖంలో ఆ నెగెటివిటీని తీసుకురావటంతో, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరూ సక్సెస్అయ్యారని అంటున్నారు. అతి క్రూరంగా ఎన్టీఆర్ కనిపించటం వెనక రీజనుంది. అదే ముఖంలో కండ కరిగించటం, కఠినత్వం కొట్టొచ్చేలా కనిపించేలా చేయటం. అంతేకాదు సినిమా మొత్తం పాన్ ఆసియా కంటెంట్ అని తెలుస్తోంది. కాని డ్రాగన్ ని మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గానే రిలీజ్ చేస్తున్నట్టు గ్లింప్స్ తోతేలింది.. అసలు ఒక సినిమా గ్లింప్స్ ఇన్ని కోణాల్లో, ఇండస్ట్రీని షేక్ చేయటం, గత ఐదేళ్లలో ఇదే మొదలు... ఇంతకి డ్రాగన్ గ్లింప్స్ లో బయట పట్ట నందమూరి విలనిజం, హీరోయిజంగా ఎప్పుడు మారుతుంది? ఎలా మారబోతోంది?
డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ లుక్ గతంలో ఎన్నడూ లేనంత కర్కశంగా ఉందనటానికి రీజన్..ముఖంలో ఖండ లేకపోవటం.. అంతగా తను సన్నబడ్డాడు.. మొదట్లో ఎన్టీఆర్ ఏంటి ఇంత సన్నబడ్డాడు.. అని చాలా మంది కామెంటస్స్ చేశారు... కాని గ్లింప్స్ వచ్చాకే తన పాత్రకి తగ్గు లుక్ అన్న క్లారిటీ వస్తోంది.. టెంపర్, జైలవకుశలో కూడా ఎన్టీఆర్ నెగెటీవ్ ఎమోషన్స్ ని చూపించాడు.కాని డ్రాగెన్ గ్లింప్స్ లో తన లుక్ ఒక్కటి చాలు, ఇంకేం అవసరం లేదనేంతగా, తన ముఖంలో కఠినత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. లూగర్ గా, డెవిల్ గా, డ్రాగన్ గా ఇలా ఎన్ని పేర్లతో పిలిచినా, ఒక డ్రగ్స్ మాఫియా కోసం ఫైట్ చేసే కఠినాత్ముడికి ఎలాంటి ఫీచర్స్ ఉండాలో.. అవన్ని తనలో ఉండాలంటే, ఈమాత్రం లుక్ తో కిక్ ఇవ్వాల్సిందే..
అక్కడే ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. తను కండ కరిగించి, బక్కచిక్కిముఖంలో కఠినత్వాన్ని పెంచటమే కాదు.. ఇప్పుడు మజిల్స్ పెంచుతు, ఆ లుక్ ఇంపాక్ట్ కి కూడా పెంచేశాడు. కాబట్టే తన బరువు తగ్గటం మీదొచ్చిన కామెంట్లన్నీంటికి ఇదో సింగిల్ లైన్ ఆన్సర్ లా పనిచేసింది. ఇక ఇప్పుడు తెలవాల్సిన మరో ఆన్సర్ ఏంటంటే, డ్రాగన్ సెంటిమెంట్ ఏంటి?కేజీయఫ్ లో చూస్తే అందులో తల్లి సెంటిమెంట్ చూపించాడు ప్రశాంత్ నీల్. తర్వాత సలార్ లో ఫ్రెండ్ షిప్ తో కదిలించే ప్రయత్నం చేశాడు. మరి డ్రాగన్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ ఏమై ఉంటుంది? ఇక్కడే బేబీ సెంటిమెంట్ అంటున్నారు. హీరోయిన్ రుక్మినీ వసంత అసలు డ్రాగన్ లవ్ ఇంట్రస్టా ? లేదంటే ఇంకెవరో గ్లింప్స్ లో తేల్చలేదు. కాని...హీరోయిన్ ఒళ్లో బిడ్డని చూస్తే.. ఇది ఫాదర్, సన్ లేదా ఫాదర్ డాటర్ సెంటిమెంట్ తో రాబోతున్న సినిమా అనంటున్నారు.కూతురికోసం మాఫియాతో ఫైట్ చేసే విలన్ గానో లేదా, బిడ్డకోసం మారే కర్కోటకుడి గానో తన పాత్ర ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. ఏదేమైనా ఇది మాత్రం బిడ్డ సెంటిమెంట్ తో వచ్చే మూవీగా ఆల్ మోస్ట్ అంతా కన్ఫామ్ చేస్తున్నారు. సో తల్లి సెంటిమెంట్ తో కేజీయఫ్, ఫ్రెండ్ షిప్ సెంటిమెంట్ తో సలార్, ఇప్పుడు బిడ్డ సెంటిమెంట్ తో డ్రాగన్.. పర్ఫెక్ట్ ట్రాక్ లోనే వెలుతున్నట్టున్నాయి. గ్లింప్స్ కి మాత్రం చాలా మంది కళ్ళు, ఊహలు బైర్లు కమ్మినట్టున్నాయనే టాకే కిక్ ఇస్తోంది.