రెబల్ స్టార్ ప్రభాస్ ని తన ఫ్యాన్స్ వేడుకునేది ఒకటే.. మారుతి లాంటి మీడియం రేంజ్ దర్శకులకు ఆఫర్లు ఇవ్వొద్దని.. రాధేశ్యామ్ విషయంలో రాధా కృష్ణ లాంటి దర్శకుడికి ప్రభాస్ చాన్స్ ఇచ్చి ఇదే తప్పు చేశాడన్నారు. ఓం రౌత్ ని నమ్మ ఆదిపురుష్ తో మునిగిపోయాడు.. అందుకే అనుభవం లేని మీడియం రేంజ్ డైరెక్టర్స్ కి ఆఫర్ ఇవ్వొద్దనేది, రాజాసాబ్ రిజల్ట్ తర్వాత ఫ్యాన్స్ నుంచి పెరిగిన విన్నపం.. కాని ప్రభాస్ మళ్లీచేసిన తప్పే చేస్తున్నట్టున్నాడు. పనికట్టుకుని మళ్లీ ఓ చిన్న దర్శకుడికి భారీ బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. బాహుబలి నుంచి తన ప్రతీ సినిమా ప్లానింగ్ లో నిజంగా ఒక లెక్కుంది... కేవలం రాధేశ్యామ్, ఆదిపురుష్, రాజాసాబ్ వర్కవుట్ కాలేదని, ప్రభాస్ ఏదో మొహమాటానికి పోయి ఆఫర్లు ఇస్తున్నాడనుకోవటం నిజం కాదా? ఎన్టీఆర్, బన్నీ, యష్ ఊహలకు అందని స్థాయిలో రెబల్ స్టార్ స్ట్రాటజీ ఉంటోందా? ఇన్ని సినిమాలు చేసిన అనుభవం ఉన్న తనకి ఎవరికి ఛాన్స్ ఇవ్వాలో తెలియదా? అంటే ఇదంతా ప్రభాస్ తెలిసే చేస్తున్నాడా? తన ప్రతీ అడుగు వెనకా ఒక పక్క లెక్కున్నట్టేనా? మరెందుకు పాన్ ఇండియా కింగ్ అయ్యాక కూడా ఈ ఫెల్యూర్స్ పడుతున్నాయి..? హిట్లే కాదు, ఫ్లాపులను కూడా ప్లాన్ చేసే ఏకైక హీరో అనిపించుకోవటం వెనక, మైండ్ బెండింగ్ స్ట్రాటజీ ఉందా? వింటానికి వింతగా ఉన్నా, కొన్ని ఎనాలసిస్ లను చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే.. అవేంటో చూసేయండి...
డైరెక్టర్ మారుతికి రాజాసాబ్ ఆఫర్ ఇచ్చినప్పుడు అంతా రెబల్ స్టార్ ప్రభాస్ అతిమంచితనాన్ని, మొహమాటాన్ని తప్పు పట్టారు. మనకు వీల్లొద్దు డార్లింగన్నారు... రాజాసాబ్ రిజల్ట్ తర్వాత మళ్లీ ఇలాంటి మీడియం రేంజ్ దర్శకులతో సినిమాలొద్దనే రిక్వెస్ట్ లుకూడా చాలా పోయాయి.. ఇంతజరిగినా ప్రభాస్ ఇమేజ్ తగ్గలేదు. మార్కెట్ లో తన ఘాటు తగ్గదు.. ఆస్తాయికి తనెప్పుడో వెళ్లాడు..పాన్ ఇండియా కింగ్ గా ఐదు హిట్లతో దేశాన్ని కుదిపేసిన ప్రభాస్, నిజానికి తన హిట్లే కాదు, తన ఫెల్యూర్స్ ని కూడా ప్లాన్ చేస్తాడంటే నమ్ముతారా...? ఇలాంటి ఒక విచిత్రమైన డిస్కర్షన్ ఇండస్ట్రీలో రీసౌండ్ చేసేలా వినిపిస్తోంది.. అన్ని మంచి లక్షనాలుంటే, దిష్టి తగులుతుందని, సిగరెట్ ఎలిగించిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ లో ని హీరో సీన్ గుర్తొస్తుందా.?
ఇక్కడ ఆ సీన్ పర్ఫెక్ట్ గా యాప్ట్ అవుతుంది. నిజమే ఇండస్ట్రీలో ఇలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయి.. ఒక అద్భుతం జరగాలంటే, అంతకుముందు ఒక దెబ్బ తగలాలి.. ఈ ఫార్ములానే రాజాసాబ్ కి అప్లై చేశాడు ప్రభాస్.. ఎందుకంటే హిట్ తర్వాత హిట్ అంటే అంచనాలు పెరుగుతాయి.. అలా పెరిగే అంచనాల కింద కొన్ని సార్లు కత్తిలాంటి కథ కూడా నలిగిపోతుంది.అలా జరక్కూడదంటే, చిన్నా చితకా ఫెల్యూర్స్ అప్పడప్పుడు పడాలి... ఇది దిష్టి చుక్కలాంటి ప్రయత్నమనే వాదన కూడా ఉంది. అందుకే సుజిత్, మారుతి, లాంటి దర్శకులకు ఆఫర్లిచ్చి ప్రభాస్ రిస్క్ చేస్తున్నాడనే వాదన కూడా ఉంది. మరి ఇదే ప్లాన్ ఎన్టీఆర్, చరణ్, బన్నీ వేయట్లేదా..? వాళ్లకి కూడా ఇది అవసరమే కదా అంటే... వాళ్ళకు ఎందుకో ఈ ఫార్ములా సెట్ కావట్లేదో, సెట్ చేయటం రావట్లేదో.. మొత్తానికి ప్రబాస్ కి మాత్రం వర్కవుట్ అవుతోంది.
ఎందుకంటే, ఐదు పాన్ ఇండియా హిట్ల తర్వాత, ప్రభాస్ కి పెరిగిన ఇమేజ్ వల్ల, తను హిట్లు, ఫ్లాప్ లకు అతీతుడైపోయాడు.. కేవలం ఒక హిట్ తో తన ఇమేజ్ పెరగటం, ఒక ఫెల్యూర్ తో తన ఇమేజ్ తగ్గటం అనేది పాన్ ఇండియా లెవల్లో జరగేఛాన్స్ లేదు. అంత ఇంపాక్ట్ కి బాహుబలి 2 భాగాలు, కల్కీ, సలార్ లు క్రియేట్ చేశాయి.. కాని ఇలా కావలనీ ఎవరైనా ఫెల్యూర్స్ ప్లాన్ చేస్తారా అంటే, తప్పదు.. వింటానికి విచిత్రంగా అనిపించినా, ప్రతీ మూవీ అద్భుతంగా మారటం కష్టం..అలాంటి సినిమాలు తీసేందుకు ఎంతమందని దర్శకులు అందుబాటులో ఉంటారు.. తిప్పి తిప్పి కొడితే, అదే రాజమౌైళి, అదే సుకుమార్, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగ.. ఇలా పది పదిహేనుకి మించి తోపు అనిపించే బ్యాచ్ దేశం మొత్తం మీద లేరు.. వాళ్లతోనే ప్రతీ సారి మూవీలు కష్టం.. మిగతా హీరోలకు కూడా దర్శకులు కావాలి... ఒకవేల వీళ్లతోనే సినిమా తీసినా, వాళ్లెంతవరకు అద్భుతం అనిపించే కంటెంట్ లు ప్రతీ సారి క్రియేట్ చేస్తారు.. కాబట్టే అంచనాలకు కల్లెం వేసేందుకు ఒకప్పుడు బాలీవుడ్ లో తన ఫెల్యూర్స్ ని తానే ప్లాన్ చేసిన షారుఖ్ ఖాన్ లా ప్రభాస్ తన రూటే సెపరేట్ అనిపించుకుంటున్నాడనే ప్రచారం పెరిగిపోతోంది.